మట్టిగణపతిని పూజిద్దాం

mon top heading
mon top heading
Undrallu
Undrallu

భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. పూజా విధానాలలో, పండుగ ప్రసాదాలలో ఆరోగ్యరహస్యాలు ఇమిడి ఉంటాయి. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటు చేయబడిందే వినాయక చవితి పండుగ. తెలుగు రాష్ట్రాలలో విశేషంగా జరుపుకునే సామూహిక ఉత్సవాల్లో వినాయక చవితి ముఖ్యమైనది. మనరాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఢిల్లీ తదితర ప్రాంతాలలో సామూహికంగా గణేష్‌ నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. విశేష రూపం గలవాడు కనుక వినాయకుడు అనే పేరు వచ్చింది. నాయకుని అన్ని లక్షణాలు వినాయకునిలో ఉన్నాయి. నాయకత్వ లక్షణాలకు ప్రతీక వినాయకుడు. ఉపద్రవ కారుకులైన గణములన్నింటిని నియంత్రించి, గణపీడన తొలగించడానికి గణాలకు అధిపతిగా వినాయకుణ్ణి నియమిం చాడు శివ్ఞడు. ఎవరైతే ప్రధమ పూజలను గణపతికి చేస్తారో వారి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడాలని గణపతికి శంకరుడు ఆనతిచ్చాడు. నాటి నుండి గణపతి ప్రథమ పూజితుడుగా పూజలందుకుంటున్నాడు. బుద్ధి, సిద్ధి సహిత గణపతికి మహా గణపతి అంటారు. 18 రకాల విద్యల ఆధిపత్యం కూడా మహాగణపతికే అప్పగించటం వల్ల ఈయన విద్యాపతి కూడా అయ్యాడు. విద్యారంభానికి ముందు, ప్రతి వినాయక చవితికి విద్యార్థులు తప్పకుండా గణేశపూజ చేస్తారు.
వినాయకుని పూజలో విశేషాలు
గణములు అంటే శక్తులు (సూక్ష్మ చైతన్య కణాలు) వాటిని పాలించేవాడు ‘పతి కనుక గణపతి అనేపేరు వచ్చింది. ముద్గలబుషి, వినాయకుణ్ణి వెయ్యిపేర్లతో స్తుతించారు. అదే గణేశ సహస్రనామంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం పూజలో ఉపయోగపడుతుంది.
గరిక ప్రాధాన్యత
నిత్య గణపతి పూజలో గరికకు ప్రాధాన్యత ఉంది. గణపతి భక్లసులభుడు. కేవలం రెండు గడ్డిపరకలు ఆయన ముందుంచి, గుంజీలు తీస్తే చాలు సంబరపడిపోతాడు. నిజానికి దీనివెనుక శాస్త్రీయ దృక్పథం కూడా ఉంది. వర్షాకాలంలో అనేక రకరకాల వ్యాధులు వ్యాపిస్తాయి. వైరల్‌ జ్వరాలు ప్రస్తుతం విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. చర్మవ్యాధులు కొన్ని గరిక స్పర్శ మాత్రంతోనే నశిస్తాయి. లేత గరికను ప్రసాదంగా తీసుకుంటే (తినటం) లోపలి నులిపురుగులు కూడా నశిస్తాయి. అందువలనే గరిక ప్రాధాన్యత సంతరించుకొంది. కాని మంచి గరక అంటే బావిగట్టు లేదా కుంట ఒడ్డున పరిశుభ్రమైన ప్రాంతం నుండి లేత గరికను సేకరించాలి. కొన్ని ప్రాంతాలలో లేత గరిక పచ్చడి కూడా చేస్తారు. దీనిని దుర్వ అని పిలుస్తారు. దూ: అంటే దూరంలో ఉన్న, అవమ్‌ అంటే దగ్గరకు తెచ్చేది. దుర్వ అంటే దూరంగా ఉంటే గణపతి తత్వాన్ని మన దగ్గరకు తెచ్చేది అని అర్ధం. ప్రతిసారి రెండు తృణములు (పరకలు) సమర్పించాలి. అందుకే దుర్వారయుగ్మం, సమర్పయామి అంటాం. వినాయకచవితి పండుగ పిల్లలందరకూ వేడుకైనదే. భక్తిశ్రద్ధలతో అందరూ ఆచరించేదే. కాని మనం చేసే పని పరమార్ధం తెలుసుకొని చేయడం వలన మరింత ప్రయోజనం చేకూరుతుంది కదా!

పెద్దలు, పిల్లలకు, పిల్లలు స్నేహితులకు గణపతి పూజా విశిష్టతను తెలపండి.
విదేశాలలో వినాయకునిపూజలు
భారతదేశంలోనే కాకుండా విదేశాలలో సైతం వినాయకచవితి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ప్రవాసభారతీయుల ద్వారా జరిగే గణపతి పూజలు మామూలే. కాని పూర్వం నుంచే కొన్ని ప్రాంతాలలో గణపతి పూజ రుగుతుందనటానికి చరిత్రక ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా బౌద్దులలో కూడా గణపతి ఆరాధన ఉంది. బౌద్ధ గణపతి ఆరాధన క్రీ.శ.806 నుంచి జపాన్‌లో జరుగుతుంది. గణపతి కోసమే ప్రత్యేక

ఆలయాలు అక్కడ
నిర్మించబడ్డాయి. ధా§్‌ులాండ్‌, ఇండోనేషియా, వియత్నాంలలో తొలిరోజులలోనే భారతీయులు వలస వెళ్లటం ద్వారా అక్కడ హిందూ దేవాలయాలు వెలిసాయి. బ్యాంకాక్‌లో అపూర్వమైన కంచు గణపతి విగ్రహం ఉంది. అయాతియోగ్‌ అనే చ ఓట ఉక వాహనం ఈ విగ్రహ ప్రత్యేకత. క్రీ.శ.8,9 శతాబ్దాలలో ఇండోనేషియాలో శైవమతం ఉచ్ఛస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రీకు, రోమన్‌లు కూడా విఘ్నాధిపతిని పూజించే వారని చరిత్రను బట్టి తెలుస్తుంది. ఈజిప్టులో ఈ దేవ్ఞని పేరు గునేశ్‌, అమెరికా, పెరూమెక్సికోకు చెందిన ఆదివాసులలో కూడా గనఫతి పూజ వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది.
భారతదేశంలో హిందూ జాగరణ కలిగి వారిలో ఐక్యత పెంపొం దించే విధంగా గణపతి మనల్ని ఆశీర్వదించుగాక.
వినాయకుని 21 రూపాలలో ఆరాధన చేస్తారు. అందుకే 21 రకాల పత్రులతో వినాయకుని పూజిస్తారు. వినాయకుని పూజించే 21 పత్రి ఔషధ గుణాలు కలిగి ఆరోగ్యాన్ని అందజేస్తాయి. అలాగే వినాయకునికి అర్పించే ఫలాలు కూడా ఆయా రుతువ్ఞలలో తప్పనిసరిగా ఉపయోగించాలి.

  • యఱ€ంశెట్టి హనుమంతరావు