మంచూరియా రుచులు

oats manchuria
oats manchuria


ఓట్స్‌ మంచూరియా
కావలసినవి: ఓట్స్‌-రెండు కప్పులు
క్యారెట్‌, క్యాబేజీ, కీరాతురుము-అరకప్పు చొప్పున
బీన్స్‌సన్నగా తరిగినది-నాలుగు చెంచాలు
ఉల్లిపాయలు-రెండు, పచ్చిమిర్చి-ఐదు
కొబ్బరి తురుము-పావ్ఞ కప్పు, క్యాప్సికం తరుగు-నాలుగు చెంచాలు
అల్లం, వెల్లుల్లి మిశ్రమం-అరచెంచా
సోయా సాస్‌- అరచెంచా, టమాట కెచప్‌-మూడు చెంచాలు
అజినోమోటో-కొద్దిగా, ఉప్పు-అరచెంచా
నూనె-వేయించడానికి సరిపడా
కొత్తిమీర -కొద్దిగా
తయారుచేసే విధానం:
ఓట్స్‌ను ఓసారి వేయించుకుని పొడిచేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి క్యాప్సికం మినహా మిగిలిన కూరగాయ ముక్కలు, సగం ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. కొంచెం వేగాక అందులో కొబ్బరి తురుము చేర్చి పొయ్యి కట్టేయాలి. ఈ మిశ్రమంలో ఓట్స్‌ పొడి, ఉప్పు, కలిపి నీళ్లు చల్లి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని నూనెలో బంగారువర్ణంలోకి వచ్చేదాకా వేయించుకోవాలి.
నూనె ఎక్కువగా వద్దనుకుంటే ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చు. తరువాత బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి అల్లం, వెల్లుల్లి మిశ్రమం మిగిలిన ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం తరుగు అజినోమోటో చేర్చి వేయించాలి. ఇందులోనే సోయాసాస్‌, టమాట కెచప్‌ కలపాలి. చివరగా ఓట్స్‌ ఉండల్ని కూడా వేసి రెండు మూడు నిమిషాలు వేయించి తీసేయాలి. కొత్తిమీర తురుము అలంకరిస్తే రుచికి, చూపుకి అందంగా ఉంటుంది.