బ్రేక్‌ఫాస్ట్‌లో బత్తాయిరసం శ్రేష్ఠం!

jice
jice


చూడ్డానికి పెద్దసైజు నిమ్మపండులా ఉండే బత్తాయిపండు రుచిలో మాత్రం పుల్లగా కాకుండా తీయగా ఉంటుంది. అందుకే దీన్ని స్వీట్‌లైమ్‌ అని పిలుస్తారు. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపు రంగులో ఉంటుంది. చాలామంది ఒలుచుకుని తిన్నప్పటికీ జ్యూస్‌ రూపంలోనే దీనికి వాడుక ఎక్కువ. అందుకే పండ్లరసం అనగానే అందరికీ ఈ పండ్లే గుర్తుకొస్తాయి.
ఆగ్నేయాసియా, దక్షిణ ఆసియా, మధ్యధరా ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే ఈ పండ్ల చెట్లని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెంచుతున్నారు. పుట్టింది ఆసియాదేశాల్లోనే అయినా క్రమంగా ఇటలీ, మధ్యధరా ప్రాంతంలో ఎక్కువగా పండించడంతో ఇటాలియన్‌ లైమ్‌, మెడిటెర్రేనియన్‌ లైమ్‌ అని కూడా పిలుస్తుంటారు. ఇరానీయులైతే తీపి నిమ్మ అంటారు.
రుచిలో ఒకేరకంగా ఉన్నప్పటికీ మధ్యధరా, మొరాకోల్లో, పెరిగే బత్తాయిలు రూపంలో మాత్రం కాస్త భిన్నంగా ఉంటాయి. మొరాకో రకం తొక్క పలుచగా ఉండి పసుపుతో కూడిన నారింజవర్ణంలో మంచి వాసన కలిగి ఉంటే మధ్యధరా ప్రాంతంలో పెరిగేవి మాత్రం పులుపన్నదే లేకుండా తియ్యగా ఉంటాయి. ఇటీవల పుల్లని నారింజనీ తియ్యని బత్తాయినీ సంకరీకరించి సిట్రస్‌ బెర్గామియా అనే కొత్త రకాన్ని రూపొందించారు. ఇది తీపి పులుపు రుచితో చూడ్డానికి నారింజపండులా ఉంటుంది.
పోషక విలువలతో పాటు ఔషధపరంగా కూడా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. జలుబు, జ్వరం వంటివి వచ్చినప్పుడు త్వరగా కోలుకోవడానికి ఈ పండ్ల రసాన్నే అందిస్తారు.
విటమిన్‌-సి లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధిని అరికట్టడంలో ఈ పండుని మించింది లేదు. రుచికి తియ్యగానే ఉన్నా ఇందులో విటమిన్‌-సి ఎక్కువపాళ్లలో దొరుకుతుంది.
ఈ పండుకున్న తీపివాసన లాలాజలగ్రంథుల్ని ప్రేరేపించి లాలాజలం అధికంగా ఊరేందుకు కారణమవ్ఞతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్‌లు పిత్తరసంతో పాటు ఇతర జీర్ణరసాల, ఆమ్లాలూ విడుదలయ్యేం దుకు దోహదపడతాయి. అందువల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవ్ఞతుంది. అంతేకాదు ఈ రసం త్వరగా జీర్ణమై రక్తంలో వెంటనే కలిసిపోతుంది. అందుకే బెడ్‌మీద ఉన్న రోగులు కోలుకునేందుకు బత్తాయిరసాన్నే ఇస్తుంటారు. ఉదయాన్నే యోగా, జాగింగ్‌, వాకింగ్‌ చేసి వచ్చాక ఓ గ్లాసు తాజా బత్తాయిరసం తాగితే చాలు…అలసిన శరీరం వెంటనే శక్తిమంతం అవ్ఞతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఓ గ్లాసు బత్తాయిరసం తీసుకోవడం ఎంతో మంచిదని పోషకనిపుణులు సూచించేదీ ఇందుకే.
ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఆమ్లాలు పేగుల్లోని విషపూరిత పదార్థాల్ని పారదోలతాయి. అందువల్ల అర్తితో బాధపడేవాళ్లకి కూడా బత్తాయిరసం ఎంతో మంచిది. ఇందులో ఎక్కువగా ఉండే పొటాషియం డ§ేరియా, డీసెంట్రీ…వంటి వ్యాధుల్ని వెంటనే తగ్గేలా చేయడంతో బాటు బాధితులు త్వరగా కోలుకునేలా చేస్తుంది.
ముఖ్యంగా కామెర్లు వచ్చిన వాళ్లకు ఈ జ్యూస్‌ ఎంతో మంచిది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/