బ్రెడ్‌ తింటే లావైపోతారు

EATING BREAD
EATING BREAD

బ్రెడ్‌ తింటే లావైపోతారు

బ్రెడ్‌ను ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. బ్రెడ్‌ను ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి ఎటువంటి పోషణను అందించదు. ప్రోటీన్లు, విటమిన్లు తీసుకోవడం చేయాలి. గోధుమ బ్రెడ్లను లేదా పూర్తి ధ్యానం బ్రెడ్లను తీసుకొంటే ఎక్కువ మొత్తంలో కాకుండా కొన్ని పోషకాలను మాత్రమే అందిస్తుంది. బ్రెడ్‌లో అధిక రక్తపోటుకు గుండె వ్యాధులకు దోహదం చేసే సోడియం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. బ్రెడ్‌ను ప్రతిరోజూ అల్పాహారంగా తీసుకుంటే శరీరంలో ఉప్పు ఎక్కువ స్థాయిలో ఉండటా నికి కారణమవ్ఞతుంది. బ్రెడ్‌ను బర్గర్లు, శాండ్విచ్లు రూపాల్లో ఎక్కువగా తీసుకోవటం వలన గుండె వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

బ్రెడ్‌లో చాలా తక్కువ కేలరీలు కలిగి ఉండుట వలన వాటిని ప్రతిరోజూ అల్పాహారంగా తీసుకుంటే మనం చాలా కేలరీలు తీసుకున్నట్టే అవ్ఞతుంది. కేకులు లేదా బర్గర్లు రూపంలో ఉన్నప్పుడు అదనంగా ఉప్పు లేదా శుద్ధి చేసిన చక్కెర ఉండటం కూడా బరువ్ఞ పెరుగుటకు దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.