బాడీ లోషన్‌

ఉపయోగించే తీరు

LOTION
LOTION


వాతావరణం మారుతున్న కొద్దీ చర్మ ససమ్యలు కూడా వస్తాయి. శీతాకాలంలో చర్మం పొడిగా ఉండటం సాధారణం. చర్మంలో పగుళ్లు ఏర్పడతాయి. శరీరం మృదువుగా ఉండాలంటే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే మంచి మార్గం. అందుకు రోజులో సరిపడా నీరు తాగాలి. శరీరంలో తగినంత నీరు ఉంటేనే శరీరంపై ఉండే చర్మం తేమగా మిళమిళలాడుతుంది. నీటిని తీసుకోవడంతో పాటు కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్‌ను క్రమం తప్పకుండా వాడాలి. కొంత మంది చర్మం పొడి బారకుండా ఉండటానికి రోజూ నూనెను ఉపయోగిస్తారు. అలా నూనెను ఉపయోగించనప్పుడు, ఆ నూనె చర్మంలో కొంతమేర మాత్రమే గ్రహిస్తుంది. మళ్లీ ఆరిపోతుంది. అలాంటి వారికి రోజువారీ చర్మం సంరక్షణ అవసరం. వెంటనే తగిన జాగ్రత్తలు చేయకపోతే చర్మం పొడిబారు తుంది. దానివల్ల చర్మంలో పగుళ్లు, గాయాలు, కొన్ని ఇతర చర్మ సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యలను నివారించడానికి బాడీ లోషన్‌ బాగా సహాయపడుతుంది. ఇవి పొడి చర్మం నుండి విముక్తులను చేస్తాయి. శరీరంపై బాడీలోషన్‌ అప్లై చేయడానికి కొన్ని పద్ధతులున్నాయి. బాడీ లోషన్లన్నీ ఒకేలా ఉండవు. కానీ నిజానికి, బాడీ లోషన్లు చాలా మృదువుగా, తేమతో ఉంటాయి. బాడీ లోషన్స్‌ కొద్దిగా తేమగా చిక్కగా ఉంటాయి. కాబట్టి చర్మానికి సరిపోయే వాటిని ఎంచుకోవాలి. అయిల్‌ స్కిన్‌ కొద్దిగా పొడి చర్మం ఉన్నవారు బాడీలోషన్‌ వాడటం మంచి ఎంపిక. పొడి చర్మం ఉన్నవారు బాడీ బటర్‌ వాడవచ్చు. కానీ జిడ్డుగల చర్మం ఉన్నవారు బాడీ బట్టర్‌ వాడకూడదు. పొడి, జిడ్డుగల చర్మం మధ్యలో సాధారణ చర్మం ఉన్నవారు బాడీ లోషన్‌ ఉపయోగించవచ్చు. స్నానం చేసిన తరువాత చర్మాన్ని తువ్వాలుతో తుడిచివేయడం చికాకు కలిగిస్తుంది. శరీరం నీటిని పీల్చుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల సాన్నం చేసిన వెంటనే బాడీలోషన్‌ అప్లై చేయడానికి ఇదే మంచి సమయం. స్నానం చేసిన వెంటనే చర్మం మృదువుగా, నునుపుగా ఉంటుంది. ఇతర సమయాల్లో కంటే ఇప్పుడు బాడీలోషన్‌ చర్మంలోకి గ్రహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాడీలోషన్‌ అప్లై చేయడం వల్ల చర్మంలో తేమను అలాగే ఉంచుతుంది. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. ముందుగా బాడీలోషన్‌ కాలుకు అప్లై చేయాలి. తర్వాత బాడీ మొత్తానికి అప్లై చేయాలని బ్యూటీ నిపుణులు సూచిస్తారు. ఇలా అప్లై చేయడం వల్ల తేమ ఎక్కువ సేపు ఉంటుంది. మోచేతులు, మోకాళ్లు ఇలా శరీరమంతా అప్లై చేయాలి. ఎందుకంటు ఇవి శరీరంలో ఎక్కువ పొడిని కలిగించే ప్రదేశాలు. ఈ భాగాలకు బాడీలోషన్‌ అప్లై చేయడం తప్పనిసరి. శరీరం హైడ్రేషన్‌లో ఉండాలంటే బాడీలోషన్‌ తప్పనిసరిగా ఉపయోగించాలి. బాడీ మొత్తం అప్లై చేసి సున్నితమైన మర్దన చేయవచ్చు. చర్మం పొడి బారిన ప్రదేశంలో అప్లై చేసి మర్ధన చేయడం మంచిది. ఇలా మర్దన చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ జరిగి చర్మం మరింత కాంతివంతమవుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/