ఫేస్‌వాష్‌కు కొన్ని చిట్కాలు..

Face Wash
Face Wash

ఏ క్రీమ్‌ అప్లయి చేయాలన్నా ముందు ఫేస్‌వాష్‌ చేసుకుని అప్లయి చేస్తాం. అంతేకాదు ఎక్కడికైనా వెళ్లి ఇంటికి రాగానే ముఖం కడుక్కుంటాం. చికాకుగా వ్ఞంటుంది. కనుక రిలాక్స్‌ అవడానికి వాష్‌ చేస్తాం. అలానే వాష్‌ చేయకుండా ఉంటే ముఖం నల్లమరకలు పడేలా కనిపిస్తుంది. అలా నల్లబడ్డాక బ్యూటీపార్లర్స్‌, క్రీములు చకచకా వాడేసి మరలా మామూలుగా ఉంటే ప్రయోజనం ఏమి ఉండదు. బైటకెళ్లి రాగానే ఎక్కడున్నా ఫేస్‌వాష్‌ను మరచిపోవద్దు. ఇంట్లో అయితే వాష్‌బేసిన్‌ పక్కనే సబ్బు కూడా ఉంచండి. నాసిరకం సోప్‌ వాడకూడదు. ముఖం కడుక్కున్నప్పుడు టవల్‌తో రుద్దేయకుండా అద్దుతూ తుడుచుకోండి. క్లెన్సర్‌లు ఉపయోగించేవారు మంచి కంపెనీవే వాడండి. కనీసం ప్రతిరోజు ముఖం మూడు, నాలుగు నుండి సోప్‌ క్లెన్సర్‌లు ఉపయోగించటం వల్ల చర్మరక్షణకు, సౌందర్యానికి మంచిది. మంచి క్లెన్సర్‌ చర్మాన్ని మృదువ్ఞగా ఉంచటంతో పాటు మంట లాంటివి కలిగించదు. పొడిచర్మం గలవారికి క్రీమ్‌లాంటి క్లెన్సర్‌ కావాలి. పొడిచర్మం కలిగిన వారు నీటిలో కరిగిపోయే క్లెన్సర్‌ వాడటం మంచిది. వాష్‌ క్లాత్‌ బ్యాక్టీరియా కేంద్రంగా మారి పరోక్షంగా మొటిమలు తెప్పించేలా చేయగలవ్ఞ అందుచేత జాగ్రత్త వహించాలి.
అనవసరమైన సువాసనలు, నూనెలు కలిగి ఉండే క్లెన్సర్‌లు, క్రీములు కొనకండి. క్లెన్సర్‌ ఉపయోగించిన తరువాత చర్మం అయిల్‌గా గాని, పొడిగా గాని, పొరగా ఉన్నట్లుగాని అనిపించ కూడదు. బ్యూటీపార్లర్‌లో వాడే మాయిశ్చ రైజర్స్‌ కొన్నిరకాల రసాయనాలతో తయారుచేస్తారు. బ్యూటీషియన్స్‌కి ఏవి మంచివో, ఏవి హానిచేస్తాయో తెలుసు కాబట్టి సరైన నిర్ణయం తీసుకుంటారు. నీటికొరత కలిగించి మిమ్మల్ని మీ అందాన్ని డిస్ట్రబ్‌ చేసే సోడా, టీ, కాఫీ వంటి కెఫిన్‌ మోతాదు గల పానీయాలు మీ చర్మంపై చెడు ప్రభా వాన్ని చూపుతాయి. వీటివల్ల శరీరంలో నీటి పరిమాణం కరిగిపోతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/