ప్రేమ పెళ్లికి నాన్నను ఒప్పించడం ఎలా?

మనస్విని

 

 

ప్రేమ పెళ్లికి నాన్నను ఒప్పించడం ఎలా?

మేడమ్‌, నేను ఎమ్‌.టెక్‌ పూర్తిచేసి మంచి కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాను. మంచి జీతం కూడా వస్తుంది. నేనొక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. తను కూడా ఇంజనీరింగ్‌ కాలేజీలో లెక్చరర్‌గా చేస్తున్నా డు. చాలా మంచివాడు. తను కూడా నన్ను ఇష్టపడుతున్నాడు. ఇద్దరం పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం. ఆ అబ్బాయి వాళ్ళింట్లో అందరు ఒప్పుకు న్నారు. నన్ను కూడా వాళ్ళింటికి తీసుకెళ్ళారు. బాగా చూసు కున్నారు. కాని మా అమ్మానాన్నలు వేరే కులం అని అసలు ఒప్పుకోవట్లే. రెండు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాను ఒప్పించడానికి . అబ్బాయి కూడా ఇంటికి వచ్చి అడిగారు. ఐనా మా నాన్నఅవమానించి పంపించారు. వాళ్లు అమ్మానాన్నలు కూడా మా నాన్నతో మాట్లాడారు. అయినా ఏం ఫలితం లేదు. నన్ను మంచి ఉద్యోగం మాన్పించి ఇంట్లో పెట్టారు. మా వాళ్ళు అంత అవమానించినా వాళ్ల తల్లితండ్రులు ఇంకా నాతో ప్రేమగా మాట్లాడు తున్నారు. నాకు ఇంట్లోంచి బయటకి వచ్చి తనను పెళ్ళి చేసుకోవాల నుంది. ఏం చేయాలో తోచడం లేదు. ఏదైనా సలహా ఇవ్వండి? – శ్రీవల్లి, మెదక్‌

 

 

మీరు ఈ సమస్యను చక్కగా పరిష్కరించుకోగలరు. ఇందులో ఏ సందేహం లేదు. కానీ చాలా జాగ్రత్తగా ఈ సమస్యను పరిష్కరించు కోవాలి. ఏ విషయంలోనూ అజాగ్రత్త ఉండకూడదు. ఈవిషయంలో చాలా అప్రమత్తులై ఉండాలి. ఇది మీజీవితానికి సంబంధించిన సమస్య. ఇరు కుటుంబాలకు సంబంధించిన సమస్య. అందువల్ల మీరు ముందుగా మీ సమస్యను పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. ఇరు కుటుంబాలకూ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంపై విస్తృతంగా చర్చించుకోవాలి. ఓపెన్‌ కమ్యూనికేషన్‌ ఉండాలి. శ్రద్ధ వహించి, ఉద్వేగాల సమతుల్యతతో, మాట్లాడుకోవాలి. మీ తల్లిదండ్రుల మనసు తెలుసుకోవాలి. వారు ఎందుకు వద్దంటున్నారో తెలుసుకోవాలి. కారణాలు తెలిసాక, నచ్చచెప్పటం, తెలియచెప్పటం సులభం. ఎట్టి పరిస్థితిలోనూ తొందరపాటు నిర్ణయాలు పనికి రావ్ఞ. తల్లిదండ్రులను ఎదిరించి బయటకు వెళ్లి వివాహం చేసుకొన్నవారు చాలా ఇబ్బందుల పాలయ్యారని, ఎన్నో పరిశోధనల ద్వారా తేలింది. అందువల్ల ఈ విషయంలో మీరు నిపుణుల సలహా లను తప్పక పాటించి సరైన నిర్ణయం తీసుకోవాలి. మీ వివాహం, మీకిష్టమైన వానితో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలతో జరిపించుకోవచ్చు. మీకు వ్యతిరేకమైన నిర్ణయాలతో మీ వివాహం జరుపకూడదు. ఇది మీ జీవితానికి సంబంధించిన క్లిష్టమైన సమస్య. అందువల్ల, అత్యంత జాగరూకతతో పరిష్కారాన్ని ఎంచుకోండి.

ఇప్పుడే పెళ్లి వద్దంటుంది

మేడమ్‌, నాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు బాగా చదువ్ఞతారు. మా దురదృష్టం మా వారు అనారోగ్యంతో చనిపోయారు. ఇప్పుడు మా పెద్దమ్మాయి ఇంటర్‌ పూర్తిచేసింది. కాని చాలా మంచి మార్కులు వచ్చాయి. ఎంసెట్‌లో ర్యాంకు రాలేదు. తనకు ఇంజనీరింగ్‌ చదవాలనుకుంది. కాని మా బంధువ్ఞలందరూ పెళ్ళి చేయమంటున్నారు. కాని మా అమ్మాయి అస్సలు ఇష్టంగా లేదు పెళ్ళిచేసుకోవడానికి. మా బంధువ్ఞలతో మాట్లాడం మానేసింది. నాకు కూడా ఏమి అర్థం కావట్లే. చిన్నమ్మాయి కూడా ఇంటర్‌ రెండవ సంవత్సరం ఇద్దరిని చదివించే మత లేదు. ఏం చేయాలో అర్థం కావట్లే. ఏదైనా సలహా ఇవ్వండి – విజయలక్ష్మి, హైదరాబాద్‌

మీ సమస్యలకు చక్కని పరిష్కారమార్గాలున్నాయి. మీ ఇద్దరి అమ్మాయిలినీ చదివించవచ్చు. బ్యాంక్‌లోనులు అందుబాటులో ఉన్నాయి. చదువ్ఞకైతే తప్పక బ్యాంక్‌లు సాయం చేస్తాయి. దాని గురించి మీరు తెలుసుకొని ప్రయత్నం చేస్తే తప్పక మీకు ఆసరా దొరుకుతుంది. మీ బంధువ్ఞల సహాయ సహకారాలు కూడా తీసుకోవచ్చు. మీ అమ్మాయికి ఇష్టం లేకుండా, ఎవరో ఏదో చెప్పారని పెళ్ళి చేయవద్దు. చదువ్ఞకోనివ్వండి. అమ్మాయి అభీష్టం మేరకు ఆమె చదువ్ఞకు చేయూతనివ్వండి. చదువ్ఞకొన్నాక, ఉద్యోగం చేస్తూ వివాహం చేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడే వివాహం చేస్తే చాలా ఇబ్బం దులు ఎదురవ్ఞతాయి. అమ్మాయికి అయినా, అబ్బాయికి అయినా ఆర్థికపరంగా ఆసరా అవసరం. ఆర్థిక స్థిరత్వం లేకపోతే ఎన్నో సమ స్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎవరైనా తమ కాళ్ళమీద తాము నిలబడవలసిందే. ఆర్థికంగా ఎవరిమీదైనా ఆధారపడితే, ఎన్నో బాధలు పడవలసి వస్తుంది. ఇది ఎన్నో పరిశోధనల ద్వారా తేలింది. అందువల్ల మీరు ఈ విషయమై అవగాహన చేసుకొని అమ్మాయిలకి వారిష్టమైన రీతిలో చదువ్ఞలు చెప్పించండి. దానికి కావలసిన సహాయ సహకా రాలు ప్రయత్న పూర్వకంగా కొనితెచ్చుకోండి. తప్పక లభ్యమవ్ఞతాయి. దీనిలో ఏ సందేహం లేదు. ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. మీరు కూడా ఉద్యోగం చేయవచ్చు. మీరు కుటుంబానికి ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో అండగా నిలవాలి. ఎవరెన్ని సలహాలు ఇచ్చినా, మీకు అనువైన, ఉపయోగపడే సలహాను మీరు తీసుకోవాలి. జీవితాన్ని పథకం ప్రకారం ఆనందమయంగా చేసుకోవాలి.

డా. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌