ప్రేమ కానుకలు..

                    ప్రేమ కానుకలు..

valentine's day gifts
valentine’s day gifts

సంప్రదాయం ఎవరిదైనా జనహృదయ రంజకం కావడమే దాని ఆమోదయోగ్యతను పెంచుతుంది. గత కొన్నేళ్ళుగా ప్రపంచమంతటా పెరిగిన వినిమయ దృక్పథం, అమ్మకాలను పెంచుకునేందుకు వ్యాపార సమ్రాట్టులు పన్నే వ్యూహాలు అనేక కొత్త సంప్రదాయాలను ప్రచారంలోకి తెచ్చాయి. ఈ కోవలోకి చెందినదే వాలెంటైన్‌డే జరుపుకునే సంప్రదాయం కూడా. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక క్షణాన ‘ప్రేమ హదయంలో చిగురించి మనసంతా పులకరించి మధురభావనలో తేలియాడుతుంది.

ఈ హదయ స్పందనను వ్యక్తీకరించే అపురూప క్షణాలకు జీవితకాలం పదిలపరచుకునే చిరుకానుకలూ తోడయితే… అది ప్రేమికులకు మరచిపోలేని పండుగరోజు. గత నెల రోజులుగా ఏ షాపులో చూసినా రంగురంగుల గ్రీటింగ్‌కార్డులు, ఆకర్షణీయమైన బహుమతులు కొలువుదీరి ఉన్నాయి. టీనేజర్స్‌ ఫిబ్రవరి నెలారంభంలో చేసే హడావుడంతా ‘ప్రేమికుల రోజు కోసమే అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వచ్చే ‘ప్రేమికుల రోజు కోసం ప్రేమికులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. తమ ప్రేమను రకరకాల గ్రీటింగులు, బహు మతులు, చాక్లెట్లు, హదయాకారం పెండెంట్లు, రింగులు, బొకేలు ఇచ్చి వ్యక్తపరుస్తుంటారు. వాలంటైన్స్‌ డే నాడు తమ మదిలోని ప్రేమను దానికర్హులైన వారికి వ్యక్తీకరిస్తే ఆ ప్రేమ చిరకాలం నిలుస్తుందని ప్రేమికుల ప్రగాఢ విశ్వాసం. ఇది విదేశీసంస్కృతి అయినా మనవాళ్లలోనూ ప్రతి సంవత్సరం ఈ రోజును ప్రేమికులు తప్పనిసరిగా జరుపుకోవడం, బహుమతులు ఇచ్చుకోవడం ఆనవాయితీగా మారిపోయింది.

ఆర్చీస్‌ వంటి షాపుల్లో ప్రేమికుల బహుమతులు కోకొల్లలుగా ఉన్నప్పటికీ, ఈ సందర్భాన్ని జువెలరీ షాపువారు కూడా వివిధ రకాల పెండెంట్లతో ప్రేమికులను ఆకట్టుకుని తమ వ్యాపా రాన్ని మూడుపువ్వులు ఆరుకాయలుగా చేసుకుం టున్నారు. ఆ కోవలోకి చెందినవే ఆకర్షణీయమైన ఈ కానుకలు.