ప్రేమానుబంధాలతో దగ్గరవ్వండి

మేడమ్‌ నా పేరు సౌజన్య. నాకు ఒక బాబు ఉన్నాడు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువ్ఞతున్నాడు. కారణం ఏమో తెలియదు కానీ డిప్రెషన్‌ ఫీలవ్ఞతున్నాడు. ఒంటరిగా ఉంటున్నాడు. ఎవరితో కలవడం లేదు. నాకు దిగులుగా ఉంది. నేను, నా భర్త కూడా బాగా చదవమని ఇది వరకయితే ఒత్తిడి పెట్టేవాళ్లం. కానీ ఇప్పుడేమీ అనడం లేదు. అయినా మా బాబు సంతోషంగా ఉండటం లేదు. ఏం చేస్తే మా బాబు బాగవ్ఞతాడు? కొంచెం వివరంగా తెలియచేయండి ప్లీజ్‌.

mother
mother
  • సౌజన్య
    మీరు తప్పక మీ బాబుని చక్కగా సంతోషంగా ఉంచుకోగలరు. ఇందులో సందేహం లేదు. మీ బాబుని అర్ధం చేసుకోండి. స్నేహితులుగా మెలగండి. ప్రేమానుబంధాలతో దగ్గరవ్వండి. వృత్తి నిపుణులతో సలహా సంప్రదింపులతో మీ బాబు చక్కగా పెరుగుతాడు. ఇందులో అనుమానం లేదు. మీరు మీ బాబుకి మంచి ఆసరా, సపోర్ట్‌ ఇవ్వండి. మీరు అతనిని చదువ్ఞ పేరుతో, భవిష్యత్‌ పేరుతో ఒత్తిడి చేయవద్దు. అతను తప్పక వృద్ధిలోకి వస్తాడు. ఇందులో ఢోకాలేదు. అతనిని ప్రేమతో లాలించండి. చక్కని సమయం కేటాయించండి. చక్కని సంప్రదింపులతో చర్చలతో అతని ఈ ఒత్తిడికి కారణం తెలుసుకోండి. ఆ కారణాన్ని నివృత్తి చేయండి. అప్పుడు అతను మామూలుగా అయి పోతాడు. ఏ కారణం వల్ల అయితే ఈ కుంగుబాటుకి లోనయ్యాడో తెలిస్తే, ఆ కారణాన్ని తీసివెయ్యాలి. పారద్రోలాలి. అప్పుడు చక్కని మేధాశక్తితో వృద్ధిలోనికి వస్తాడు. వర్తమానంలో జీవించండి. భవిష్యత్‌ గరించి విచారించవద్దు. జీవితం అమూల్యమైనది. ఆనందించ వలసిన ఒక అపూర్వమైన కానుక. ప్రతిరోజు ప్రతిక్షణం విలువైంది. ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలి.

మీరే మీ భర్తను ఆదరించండి
మేడమ్‌! నా పేరు మాధవి. నేను ఒక పెద్ద ఉద్యోగం, గవర్నమెంట్‌ ఉద్యోగం చేస్తున్నాను. నాకు వివాహమై 30 సంవత్సరాలైంది. నేను, నా భర్త చాలా అన్యోన్యంగా ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు అలా ఉండటం లేదనిపిస్తోంది. నా భర్త తన వ్యాపారంలో బిజీ అయిపోయాడు. కుటుంబం మీద, నా మీద శ్రద్ధ తగ్గింది. దీనివల్ల నేను చాలా బాధపడుతున్నాను. నేను మరల ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండా లంటే ఏమి చెయ్యాలి. దయచేసి వివరించండి మేడమ్‌. – మాధవి

మీరు తప్పక ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండగలరు. మీరు సానుకూంగా ఆలోచించాలి. వ్యతిరేక ఆలోచనలకు స్వస్తి చెప్పాలి. సమయం గడు స్తున్న కొద్దీ, అందరిలో మార్పులు కనిపిస్తాయి. అవి సహజం.మార్పు అనేది అత్యంత సహజమైంది. దానిని మీరు అంగీకరి ంచాలి. మీరు మీ ఆనందా నికి ఎవరి మీద ఆధారపడి ఉండకూడదు. ఏ వస్తువు మీదా ఆధారపడి ఉండకూ డదు. ఏ పరిస్థితి మీద ఆధారపడి ఉండ కూడదు. ఎల్లప్పుడూ మీరు మీ ఆనందానికి మీపై, మీ దృక్పథంపై ఆధారపడి ఉండాలి. దీనిని స్వయం ఆధారిత చికిత్సలు అని అంటాం. మీరు మీ జీవితాన్ని ఆనందిస్తూ, ఇతరులకు ఆనందాన్ని పంచాలి. మీరు మీ భర్తను బాగా ఆదరించండి. గౌరవించండి, ప్రేమించండి. అనుబంధాలను పంచండి. అప్పుడు మీరిద్దరూ ఆనందంగా ఉండగలరు. అన్ని మీ చేతుల్లోనే ఉన్నాయి. అన్ని వనరులు మీకున్నాయి. జీవితం అమూల్యమై నది. నిత్యం ఆనందభరితంగా ఉండాలి. మీరు ఆనందంగా ఉంటూ, వీలయినంతవరకు ఇతరులకు మీ ఆనందాన్ని పంచి ఇవ్వాలి. అన్ని సమృద్ధిగా మీకున్నాయి. కాబట్టి మీరు అలా పంచి ఇవ్వగలరు ఇందులో అనుమానం లేదు.

  • డాII ఎం. శారద
    సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/