ప్రెగ్నెన్సీ హార్మోన్స్‌-3

ప్రెగ్నెన్సీ హార్మోన్స్‌-3

జాగ్రత్తలు: గర్భిణీల్ని ఒంటరిగా ఉంచకుండా చూడాలి. ఎవరినైనా మాట్లాడుతూ వ్ఞండాలి. వాళ్ల ఫీలింగ్స్‌ను పంచుకోవాలి. వాళ్ల అపోహాలు, సందేహాల్ని నివృత్తి చేయాలి. ఎమోషన్స్‌ను కుటుంబ సభ్యులు భాగం పంచుకోవాలి. వాళ్లు సంతోషంగా ఉంచేటట్లు ప్రయత్నించాలి. వాళ్లకి శారీరక, మానసిక విశ్రాంతి కల్పించాలి. ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలి. ఆంటినేటల్‌ చెకప్స్‌, కన్పు గురించి, పుట్టపోయే బిడ్డ గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని డాక్టరు దగ్గర, ఆంటినేటల్‌ క్లాసెస్‌కి వెళ్లడం, నెట్‌తో తెలుసుకోవడం, అనుభవజ్ఞుల సలహాలు సంప్రదింపులు తీసుకుంటే వాళ్ల మానసిక సమస్యలు సులభంగా పరిష్కారమవ్ఞతాయి. బహిష్టు లేకపోవడం, హైపోధాలమిక్‌ ఆక్సిస్‌ తగ్గడం, ప్రెగ్నెన్సీ హార్మోన్స్‌ వల్ల కూడా శారీరక మార్పులే కాకుండా మానసిక మార్పులు కూడా కొందరిలో కల్గుతాయి. వీటికి మందులు వాడాల్సిన అవసరం లేదు. కాన్పు కాగానే అన్ని తగ్గిపోతాయి. కుటుంబ పరిస్థితులు కూడా వీరిపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం వ్ఞండాలి. ప్రెగ్నెన్సీ అనేది లైఫ్‌ ఛేంజింగ్‌ ఎఫెక్ట్‌.

ఆక్సిటోనిన్‌ హార్మోన్‌: 1952లో ఈ హార్మోన్‌ ప్రాముఖ్యతను కనుగొన్నారు. జంతువ్ఞల్లో జరిపే అనేక ప్రయోగాల్లో దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని వెటర్నరీ హార్మోన్‌ అని కూడా అంటారు. తల్లి బిడ్డల అనుబంధానికి వారధిగా వ్ఞండడంతో ఆక్సిటోసిన్‌ను ‘లవ్‌ హార్మోన్‌ అంటారు. ఈ హార్మోన్‌ను మెదడులోని హైపోధాలమస్‌ ఉత్పత్తి చేసి పిట్యూటరీ గ్రంధిలో నిల్వ వ్ఞంచుతుంది. విధులు: కాన్పునొప్పులు త్వరగా రావడానికి, -కాన్పు త్వరగా కావడానికి -కాన్పు తర్వాత రక్తస్రావం (బ్లీడింగ్‌) తగ్గడానికి – గర్భధారణలో అండం, వీర్యకణం కలయికకు తోడ్పడుతుంది. – ఆడ, మగ ఇద్దరిలో ప్లాస్మా, ఆక్సిటోసిన్‌ ఎక్కువగా ఉండడం వల్ల సెక్సువల్‌ కరికలకి, పునరుత్పత్తికి ఉపయోగ పడుతుంది. -గర్భసంచి సంకోచం చెందడం, సర్విక్‌ ద్వారం తెరుచుకొని వెడల్పు కావడానికి కాన్పు సమయంలో ఆక్సిటోసిన్‌ పాత్ర అమోఘమైనది. -కాన్పు తర్వాత తల్లికి పాలు పడడానికి కూడా ఇది ముఖ్యమైన హార్మోన్‌. దీన్నే ఫెరిఫెరాల్‌ హార్మోన్‌ అని కూడా అంటారు. – ఆటిజమ్‌లో స్పీచ్‌ థెరపీపై ఎఫెక్ట్‌ వ్ఞంటుంది. – భయం, ఆందోళన ఉన్న, ఎమోషన్స్‌ తగ్గడానికి నెగటివ్‌ ఫీలింగ్‌ తగ్గడానికి బిహేవియర్‌ థెరపీలో నాపల్‌ డ్రాప్స్‌ రూపంలో ఇస్తారు. -వంధ్యత్వం కేసుల్లో అంగస్తంభనలు (మగవారిలో కల్గించడానికి, సెక్సువల్‌ స్టిములేషన్‌కి, సెక్స్‌లో తృప్తికి ఈ హార్మోన్‌ ఇస్తారు. -ఇది ఆంటీడయూరిటిర్‌ మరియు వాసోప్రెసిన్‌గా పని చేస్తుంది. -ఇది డెసిడ్యువా నుంచి ప్రొస్టాగ్లాండిన్స్‌ని రిలీజ్‌ చేస్తుంది. కాన్పు సమయంలో అయ్యే గాయాల్ని త్వరగా మాన్పుతుంది. ఈ హార్మోన్‌ని ఇంజెక్షన్‌ రూపంలో డ్రిప్‌ ద్వారా (ఐ.వి) 5,10 యూనిట్స్‌గా ఇస్తారు. తల్లి, గర్భకోశం సంకోచాల మధ్య రిలాక్సేషన్‌ లేనప్పుడు, ఫీటల్‌, మెటర్నల్‌ డిన్‌ట్రెస్‌ వ్ఞన్నప్పుడు, బలమైన కంట్రాక్షన్స్‌ (నొప్పులు) వస్తూ 60 సెలకుల కన్నా ఎక్కువ సేపు ఉన్న ఆక్సిటోసిన్‌ డ్రిప్‌ ఆప్పుడు చేస్తారు.

డా.కె. ఉమాదేవి, తిరుపతి