పెరుగు తింటే మెరుగు

curd
curd

పెరుగు తింటే మెరుగు

ఇప్పుడు ప్రతి ఒక్కరూ సన్నగా,నాజూగ్గా అందరిలో ప్రత్యేకంగా మెరిసిపోవాలనే అనుకుంటారు. ఆహారంలో మార్పులూ, వాతావరణం వల్ల తెలియకుండానే లావెక్కుతారు. అందులోనూ కాలేజీ అమ్మాయిలు బరువ్ఞ పెరగ కుండా ఉండేందుకు తిండికి దూరమవ్ఞతున్నారు. తమకు తెలియకుండానే ఆరోగ్యసమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి వాళ్లు ఆహారంలో, అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే డైటింగ్‌ల జోలికి పోకుండానే నాజూగ్గా మారిపోవచ్చు. ముఖ్యంగా అందానికీ, ఆరోగ్యానికీ ఉపయోగపడే పండ్లని ఎక్కువగా తినాలి. విటమిన్‌’సి తాజాదనానికి ఎంతగానో పనికొస్తుంది. కనుక రోజూ ఉదయాన్నే గ్లాసు నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే రోజుకో నారింజ లేదా బత్తాయి తినండి. మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంలో పెరుగూ, ఏదో ఒక ఆకుకూర తప్పకుండా తీసుకోవాలి. పెరుగులోని పోషకాలు చర్మసౌందర్యానికి దోహదం చేస్తాయి. రాత్రి పడుకోబోయే ముందు పాలు తాగినా మంచిదే. రాత్రిపూట త్వరగా భోం చేయాలి. వెంటనే పడుకోకుండా రెండు గంటల తరువాత నిద్రపోవాలి. కనీసం ఎనిమిది గంటల నిద్ర తప్పని సరి. ఉదయం లేచాక అరగంట పరుగెత్తండి. మరో అరగంట నడవండి. ఇలా చేస్తే అధిక బరువ్ఞ సమస్య దరిచేరదు. అలాగని మరీ పీలగానూ తయారవరు.