పెరుగుతున్న వరకట్న బాధితులు

women
women


మహిళలపై జరుగుతున్న హింసల్లో ప్రధానమైనది వరకట్న సమస్య. ఆగర్భ శ్రీమంతుల నుంచి పేద, మధ్య తరగతి వరకు ఏ ఒక్కరిని వదలని సమస్య వరకట్నం. మాజీ ప్రపంచ సుందరి యుక్తాముఖి నుంచి మధ్యప్రదేశ్‌ మురేనాలో ఫస్ట్‌క్లాస్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ను వదలని వరకట్న వేధింపులు ఎప్పటికప్పుడు కొత్తరూపు సంతరించుకుంటున్నారు. ఆడపిల్లగా పుట్టడం ఎంత ఆపదో చెప్పకనే చెబుతున్నాయి.రాజులు మారినా..రాజ్యాలు మారినా అన్న చందంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా..ఎందరు పాలకులు మారినా..ఎన్నిరకాల చట్టాలు తెచ్చినా వరకట్న విషజ్వాలలను మాత్రం ఆపలేకపోతున్నారు. మహిళలు ఎన్నిరకాలుగా వరకట్న వేధింపులకు గురవుతున్నారో..రోడ్డెక్కుతున్నారో..మరెంతమంది ఆ జ్వాలలకు ఆహుతి అవుతున్నారో సమాజంలో రోజు మనం చూస్తూనే ఉన్నాం.
ఆగని అఘాయిత్యాలు: చదువుకునే చోట, పనిచేసే చోట, ఉద్యోగం చేసే చోట, ఒంటరిగా ఉండే చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చదువుకుందామని కాలేజీకి వెళ్తే అక్కడ కామాంధుల చూపు వారిపైనే…వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే ఒంట్లో ఉన్న రోగాన్ని చూడాల్సిన కొంతమంది డాక్టర్లు వారి ఒంటిని చూస్తున్న దాఖలాలు మనకు తెలిసిందే. కళాశాలల్లో కొంతమంది విద్యార్థుల వల్ల, ఉద్యోగం చేసే చోట కొంతమంది తోటి ఉద్యోగుల వల్ల ఏదో ఒకరకంగా లైంగిక వేధింపులకు, ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం.
గిరిజన తండాల్లో భ్రూణ హత్యలు, ఆడశిశు విక్రయాలకు అవగాహన లేమి ఒక కారణమైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు సరిగ్గాలేకపోవడం మరోకారణంగా చెప్పవచ్చు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నిత్యం తల్లీ బిడ్డలకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా గిరిజన తండాల్లో చాలాప్రాం తాల్లో నిత్యం మూసే ఉంటున్నాయి. సిబ్బంది జాడ కన్పించడం లేదు. ఆడపిల్లల సంరక్షణకోసం ప్రభుత్వం అమలు చేస్తున్న బాలికా శిశుసంరక్షణ, ఇందిరా గాంధీ మాతృత్వ యోజన. బంగారు తల్లి లాంటి పథకాలు గిరిజనుల దరిచేరడంలేదు. బాల్యవివాహాల విషాయానికొస్తే ఇంకా చాలా చోట్ల బాల్య వివాహాలు జరగడానికి కారణం బాల్య వివాహ నిరోధ చట్టాలు సరిగా అమలు కాకపోవడం, చట్టాల పట్ల అవగాహన లేకపోవడం, చట్టబద్ధమైన వివాహ వయస్సు తెలియకపోవడం జరుగుతుంది. ఇక వరకట్న విషజ్వాలల విషయానికొస్తే 1993లో వరకట్నాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్ప టికీ వరకట్న హత్యలు జరుగుతూనే ఉన్నా యి. అత్తింటి వేధింపులు ఉన్న వరకట్న బాధి తురాలు తనమెట్టినింటి వారుండే ప్రాంతంతో పాటూ, పుట్టింటి వారుండే ప్రాం తంలోనూ ఐపిసి 498ఎ కేసులను నమోడు చేయవచ్చని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. సెక్షన్‌ 498ఎ, గృహ హింస చట్టం అమలులోలోపాలు, కొందరు మహిళలు ఆచట్టాలు దుర్వినియోగం చేయడం కారణంగా…ఈ చట్టాల గురించి మహిళలకు తెలియక పోవడం కారణంగా…. వీటిపై అవగాహన కల్పించాల్సిన అధికార యంత్రాంగం సరిగా పని చేయకపోవడం కార ణంగా వరకట్న వేధింపులు, ఆత్మహత్యలు కొనసాతున్నాయి. ఇక మహిళలపై జరిగే అఘాయిత్యాల విషయం లో వాటి నిరోధక కృషి చేయాల్సిన అధికార యంత్రాంగం అల సత్యం, జరిగిన తర్వాత బాధితులు చట్టాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల అఘాయిత్యాలకు పాల్పడే వారు తప్పించుకుంటున్నారు. సమాజంలో ఇప్పటికీ బాల్య వివాహాలు కొనసాగుతున్నాయి. మూడ నమ్మకాలు, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, మతపరమైన సాంప్రదాయాలు బాల్య వివాహాలను ప్రోత్స హిస్తున్నాయి. ఆడపిల్లలంటే ‘ఆడ పిల్లగానే భావించేలా చేస్తున్నాయి. పెళ్లే లక్ష్యంగా ఆడపిల్లల్ని పెంచడం కనిపిస్తుంది. ఆర్థికంగా, విద్యా విషయకంగా, సాంస్కృతికంగా వెనుకబడిన వారిలో బాల్యవివాహాలు ఎక్కువ. బాల్యవివాహం ఆ బాలికపై శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా లోతైన మరచిపోలేని మరకగా మిగిలిపోతుంది. నగరాలతో పోలిస్తే గ్రామీణ భారతంలో ఇప్పటికీ బాల్య వివాహాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లలో ఎక్కువ. యునిసెఫ్‌ లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. బాల్య వివాహాలకు కారణం ‘ఆడ పిల్లేనన్న భావన నరనరాల్లోనూ జీర్ణించుకుపోవడంతో ఆ పిల్ల పెళ్లి చేసి గుండెలపై కుంపటి దించుకోవాలన్న తహతహ కనిపిస్తుంది. మేనరికాలు మనవాళ్లకి సర్వసాధారణ విషయం. చిన్నప్పుడు చేస్తేనే వారి బంధుత్వం మరింత గట్టి పడుతుందనే అన్న నమ్మకం, కుల కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు అన్నీ కారణమే. కొందరు పేదరికం కారణంగా అధిక కట్నం ఇవ్వలేక బాల్య వివాహం చేసేస్తున్నారు. పెళ్లి ఖర్చు తగ్గించుకోవడం కోసం ఒకేసారి, ఒకే రోజు ఇద్దరు ముగ్గురు కూతుళ్ల పెళ్లి చేస్తున్నారు. బాల్యవివాహాలు ఎక్కువగా దగ్గర బంధువుల్లోనే చేయడం కనిపిస్తుంది. కారణం ఆకుటుంబాల ఆస్తి కట్నం రూపంలో బయిటకు పోకుండా కాపాడుకోవడం కోసం అనుకోవచ్చు. అంతేకాకుండా చదువు పేరుతో గడపదాటిన ఆడపిల్ల చదువుతో పాటు లోకాన్ని చూస్తోంది. తన దృష్టి విశాల పరుచుకుంటోంది. తనకు నచ్చిన వాడిని తన జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ తీసుకుంటోంది. చిన్నప్పుడే పెళ్లిచేస్తే చెప్పుచేతుల్లో ఉంటారనీ, చూపించవాడిని చేసుకుంటుందని కొన్ని కులాల్లో, కుటుంబాల్లో పిల్లల్ని ఆర్థిక వనరుగా భావించడం, అమ్మమోల ఒత్తిడి. మనవరాలిపెళ్లి చూడాలన్న ఆ కాంక్షలు బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/