పిల్లల ఆరాటం

CHILDREN-2
CHILDREN-

పిల్లల ఆరాటం

పిల్లల్లో బాడీ మెచ్యూరిటీ కన్నా బ్రెయిన్‌ మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటోంది. 9 నుండి 14ఏళ్ల లోపు పిల్లలు సెల్ఫ్‌ ఇండిపెండెన్స్‌ను కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా వారి మాటలు ఉంటున్నాయి. సెల్ఫ్‌ ఇండిపెండెన్స్‌ పదేళ్ల కిందట 16 నుంచి 18ఏళ్లకు ఉంటే, అయిదేళ్ల కిందట అది 12 నుంచి 16కు, ఈమధ్యకాలంలో 9 నుంచి 13కు మారింది. వాళ్ల మాటలు ఆలోచనతో కూడుకున్నవా? ఊరికే ఎదుటివారిని ఆకట్టుకోవడానికి మాట్లాడుతున్నారా? అనేది తేలిగ్గా పసిగట్టవచ్చు. చేతలతో చేయలేని కొన్ని పనులు నోటిద్వారా చేద్దామని పిల్లలు ఆరాటపడతారు. ఆ ఆరాటంలోనే వారి మాట పెద్దదవ్ఞతుంది. ఇవి కొన్నిసార్లు పిల్లల మధ్య సంబంధాలను కూడా దెబ్బతీయవచ్చు. అలాగే పేరెంట్స్‌ మధ్య వాదులాట కూడా వారిపై ప్రభావం చూపి సెంటిమెంట్‌ డైలాగ్స్‌ చెప్పేలా చేస్తాయి. అయితే అంతమాత్రాన పిల్లలు మాట్లాడే పెద్ద మాటలను వెంటనే తుంచేయాల్సిన అవసరం లేదు. అలా చేయకూడదు కూడా. మానసిక ఎదుగుదలకు ఉపకరించేవి, సమాజం మీద సరైన అవగాహన ఉండి మాట్లాడే మాటల్ని ప్రోత్సహించడం మంచిదే.