పిల్లల్లో గొంతునొప్పి – కారణాలు

doctor-examining-girl
doctor-examining-girl


గొంతునొప్పిని ఫారింజైటిస్‌, త్రోట్‌ పెయిన్‌, సోర్‌ త్రోట్‌, రెడ్‌ త్రోట్‌, స్ట్రెప్‌ త్రోట్‌, త్రోట్‌ ఇన్ఫెక్షన్‌, త్రోట్‌ రాష్‌ అని అంటారు.
గొంతునొప్పి అనేది వ్యాధి కాదు. ఒక వ్యాధి లక్షణం. ఇది చిన్న వ్యాధి మొదలుకొని సీరియస్‌ వ్యాధుల్లో ప్రధానంగా వుండే ప్రాబ్లమ్‌. ప్రతి సంవత్సరం 2.4 మిలియన్‌ ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా గొంతునొప్పితో బాధపడుతున్నారని అంచనా. 7.5 శాతం ప్రజలు ప్రతి మూడు నెలలకొకసారైనా గొంతునొప్పితో బాధపడుతారు.


రకాలు: ఇన్ఫెక్షన్‌ తీవ్రతను బట్టి మూదు రకాలు.

 1. మైల్డ్‌ ఫారింజైటిస్‌: ఇది గట్టిగా అరవడం, ఎక్కువగా మాట్లాడడం, ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల వస్తుంది. టీచర్లు, లెక్చరర్లు, పబ్లిక్‌ స్పీకర్స్‌లో వస్తుంది.
  కారణాలు: దాదాపు 50కి పైగా గొంతునొప్పి రావడానికి కారణాలుంటాయి.
 • ఇన్ఫెక్షన్‌: వైరల్‌ వల్ల వచ్చే ఫారింజైటిస్‌ని వైరల్‌ ఫారింజైటిస్‌ అని అంటారు. ఇది సర్వసాధారణంగా 60 శాతం కేసుల్లో కన్పిస్తుంది. ఇది ఎడినో, ఎంటరో, కాక్సకి, పారా ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్‌, రైనైటిస్‌, నాసల్‌ అబ్‌స్ట్రక్షన్‌, దగ్గు, జ్వరం, జలుబు, ఫ్లూ, మీజిల్స్‌, చికెన్‌ పాక్స్‌, కోరింత దగ్గు, డిఫ్తీరియా, క్రోప్‌ వంటి వైరల్‌ వ్యాధుల వల్ల వస్తుంది. బాక్టీరియా వల్ల 37 శాతం కేసుల్లో బాక్టీరియల్‌ ఫారింజైటిస్‌ వస్తుంది.
  ఇది పిల్లల్లో ఎక్కువ. ఇన్‌ఫ్టుయెంజా, స్ట్రెప్టోకాకస్‌, మైకో బాక్టీరియాను కాటరీలిస్‌, డిఫ్తీరియా, గోనోకాకై, క్లామిడియా, మైకోప్లాస్మా, కాండిడా ఇన్ఫెక్షన్‌ వల్ల వస్తుంది.
  ఇవే గాకుండా ఇన్ఫెక్షువస్‌ మోనో న్యూక్లియోసిస్‌, ఈ.బి.వైరస్‌, రూబెల్లా, సైటోమెగలో వైరస్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల వస్తుంది.
 • ఎలర్జీ, గొంతు పొడారిపోవడం, వాతావరణంలోని మార్పులు, స్ట్రెయిన్‌, ట్యూమర్స్‌, గొంతులో పదునైన వస్తువులు గుచ్చుకున్నా, ఇరిటెంట్స్‌, ఘాటైన వాసనలు, గ్యాస్ట్రో ఈసోఫాజియల్‌ రిఫ్లెక్స్‌, మందులు, పెయిన్‌ కిల్లర్స్‌, డ్రగ్స్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌, సైనసైటిస్‌, బ్రారికైటిస్‌, ఎడినాయిడ్స్‌, లాసాఫీవర్‌, పోలియో, రేబిస్‌, టైఫాయిడ్‌, ఎయిడ్స్‌, గనేరియా, హెచ్‌.ఐ.వి. కొరియో మెనింజైటిస్‌, మోనో న్యూక్లియోసిస్‌, సిఫిలిస్‌, క్లామిడియా, కాలుష్యం, ఎలర్జిక్‌ రైనైటిన్‌, ఆంత్రాక్స్‌, ఆర్బో వైరస్‌ వల్ల వస్తుంది.
  దంత వ్యాధులు, స్మోకింగ్‌, ఆల్కహాల్‌ తాగేవారిలో వస్తుంది.
  వ్యాప్తి: గాలి, దుమ్ము, ధూళి పొగ గొంతు స్రావాలు కాంటాక్ట్‌, ఎంగిలి వస్తువుల వల్ల వ్యాపిస్తుంది.
  విధానం: ఇది రెండు విధాలుగా వస్తుంది.
 1. అక్యూట్‌ ఫారింజైటిస్‌
 2. క్రానిక్‌ ఫారింజైటిస్‌.
  అక్యూట్‌ ఫారింజైటిస్‌: దీన్నే షార్ట్‌ టర్మ్‌ ఫారింజైటిస్‌ అంటారు. ఇది త్వరగా వచ్చి త్వరగా తగ్గుతుంది. ఎక్కువగా వాయిస్‌ స్ట్రెయిన్‌ వల్ల, స్మోకింగ్‌, పొగ, వాతావరణం మార్పుల వల్ల వస్తుంది.
  క్రానిక్‌ ఫారింజైటిస్‌: దీన్నే లాంగ్‌ టర్మ్‌ ఫారింజైటిస్‌ అంటారు. ఇది స్మోకింగ్‌ మోనోన్యూక్లియోసిస్‌, గ్యాస్ట్రో ఈసోఫాజియల్‌ రిప్లెక్స్‌, ఎలర్జీ, లారింజైటిస్‌, దవడబిళ్లల వల్ల వస్తుంది.
  వ్యాధి లక్షణాలు: తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు, చలి, దగ్గు, తలనొప్పి, ముక్కు కారడం, తుమ్ములు, కండరాల నొప్పులు, జలుబు, వికారం, వాంతులు, గొంతు వాపు, బొంగురుపోవడం, ఆహారం మింగలేకపోవడం, మాట్లాడినా, తిన్నా, తాగినా గొంతునొప్పి, శ్వాస పీల్చుకోవాలన్నా బాధాకరంగా వుండడం, మెడలోని లింఫ్‌ గ్రంథులు వాచి, నొప్పిగా ఉంటాయి. నేసల్‌ కంజేషన్‌, గొంతులో ఇరిటేషన్‌, మంట, ఆకలి తగ్గడం, గొంతు పొడారి బాధాకరంగా వుంటుంది. ఆహారం, నీరు తీసుకోలేకపోవడం, టాన్సిల్స్‌ వాపు వంటి లక్షణాలుంటాయి.
  రిస్క్‌ ఫ్యాక్టర్స్‌: జన సమర్థ్యమున్న ప్రాంతాలు, చిత్తడి, తేమగల ప్రాంతాల్లోనివారు, పోషకాహార లోపం వున్నవారు, స్మోకింగ్‌, డ్రగ్స్‌, ఆల్కహాల్‌ వంటి మత్తు పదార్థాలు వాడేవారు, అతి చల్లని శృతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్‌ తినేవారు, కాలుష్యం, ఎలర్జీ, సీజనల్‌ ఎలర్జీ, దుమ్ము, ధూళికి గురైనపుడు, ఫారింజైటిస్‌తో రిస్క్‌ ఉంటుంది. గాయకులు, స్పీకర్లు, టీచర్లు ఎక్కువగా గురవుతారు.
  కాంప్లికేషన్స్‌: స్కార్‌లెట్‌ ఫీవర్‌, రుమాటిక్‌ ఫీవర్‌, కిడ్నీ వ్యాధులు, పెరి టాన్సిలార్‌ అబ్సెస్‌, పారా ఫారింజియల్‌, రెట్రోఫారింజియల్‌ సెల్యులైటిస్‌, మార్నింగ్‌ తలనొప్పి, మైపోనాస్‌ స్పీచ్‌ (ముక్కుతో మాట్లాడనట్లుండడం) చెవినొప్పి, న్యూమోనియా, ట్రాకియైటిస్‌, బ్రాంకైటిస్‌, నోరు దుర్వాసన, బివేరియర్‌, న్యూరో నెగటివ్‌ డిస్‌ ఆర్డర్స్‌, మెంటల్‌ ఇంటిబిలిటీ, సైనసైటిస్‌ లారింజైటిస్‌, పోషకాహార లోపం వంటి కాంప్లికేషన్స్‌ ఏర్పడతాయి.
  నిర్ధారణ: రక్త పరీక్షలు, ఎలర్జిక్‌ సోర్‌ త్రోట్‌ టెస్ట్‌, స్కిన్‌ పాచ్‌ టెస్ట్‌, సి.టి. స్కాన్‌, ఎక్స్‌రే, పాలీ సొమ్నోగ్రాఫీ ద్వారా గుర్తించవచ్చు.
  ముందు జాగ్రత్తలు-చికిత్స: వేడినీళ్లలో ఉప్పు వేసి పుక్కిలించడం, గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం మంచిది. ద్రవ పదార్థాలు, జావ, పాలు వంటి వేడి పదార్థాలు తీసుకోవడం మంచిది.
 • పడని వస్తువులకు దూరంగా ఉండాలి. ముఖానికి మాస్క్‌ లేదా కర్చిఫ్‌ కట్టుకోవాలి.
 • స్మోకింగ్‌ వంటి దురలవాట్లు మానివేయాలి.
 • వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునే విధంగా పౌష్టికాహారం, విశ్రాంతి తీసుకోవాలి.
 • ఆంటిబయాటిక్‌, పారసిటమాల్‌ మందుల్ని వ్యాధి తీవ్రతను బట్టి 4-5 రోజులు వాడాలి.
 • కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి.
 • అడినో టాన్సిలెక్టమీ, ట్రాకియాస్టమీ వంటి సర్జరీలు కూడా అవసరమైతే తీసుకోవాలి.
 • శీతాకాలంలో, వర్షాకాలంలో గొంతునొప్పి ఎక్కువగా వస్తుంటుంది.
  కాబట్టి ఇన్ఫెక్షన్‌ చేరకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి పదార్థాలు తీసుకోరాదు.
 • ఎక్కువగా మాట్లాడకుండా విశ్రాంతి తీసుకుంటే 2-3 రోజుల్లో గొంతునొప్పి తగ్గిపోతుంది. క్రానిక్‌ ఫారింజైటిస్‌కు ఆంటిబయాటిక్స్‌ వాడితే సరిపోతుంది.
 • డాక్టర్‌. కె.ఉమాదేవి,
  తిరుపతి