పశ్చిమోత్థాసనం

YOGA-11
YOGA

పశ్చిమోత్థాసనం

ఈ ఆసనం వేసేవారు ఎంతో సాధన చేయాలనే చెప్పాలి. దీనిని సంపూర్ణంగా వేయడం చాలా కష్టం. కావ్ఞన దీనిని ఉగ్రాసనం అని కూడా అంటారు. ప్రతిరోజు కొంచెం సాధన చేస్తూ సాధ్యమైనంత సంపూర్ణంగా వేయడానికి ప్రయత్నించాలి. వేసే విధానం నేలమీద కూర్చుని, కాళ్లు వంగకుండా నిటారుగా ఉండేట్లు ముందుకు చాపాలి. సాధ్యమైనంత ముందుకు నడుమును వంచి, గడ్డము మోకాళ్లకు ఆనేలా చేస్తూ రెండు చేతులను ముందుకు పోనిచ్చి, చేతుల వ్రేళ్లతో రెండు పాదాల బొటన వ్రేళ్లు పట్టు కోవాలి. నడుం వంచేటపుడు గాలి బాగా పీల్చుకుని, ఆసనంలోకి వెళ్లిన తరువాత నిదానంగా గాలిని వదలాలి. ఈ ఆసనంలో కనీసం ఐదారు నిమిషాలు ఉండాలి. ఉపయోగాలు ఈ ఆసనం వేయడం వలన నడుం చుట్టూ చేరుకున్న కొవ్ఞ్వ బాగా కరిగి, స్త్రీలకు నడుంనొప్పి వచ్చే అవకాశం లేదా, పైగా వారికి నడుంమీద తొనలు జారే అవకాశముండదు. నడుము ఎంతో అందంగా, నాజూకుగా ఉంటుంది. జఠారాగ్నిని వృద్ధిచేసి, జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరాకృతి చాలా బాగుంటుంది. వెన్నెముకకు బలం చేకూరుతుంది. కాలేయ మూత్రపిండాలు బాగా పనిచేస్తాయి. కఫాన్ని నివారిస్తుంది. రక్తపోటు, అతిమూత్రం వంటివి తగ్గుతాయి.