పనికిరాని సిడీలతో…

CD;s
CD;s

పనికిరాని సిడీలతో…

మీకు పనికిరాని సిడీలను ఏం చేస్తారు. సాధారణంగా చెత్తకుండీలో పారేస్తారు. కాస్తంత సృజనాత్మకంగా ఆలోచిస్తే నేరుగా పారేయడానికి బదులు మరోటి చేయవచ్చు. కొంతమంది కాస్తంత ఖాళీ స్థలంలోనో, కుండీల్లోనో, చెక్కపెట్టెల్లోనో ధనియా ల్లాంటి చిన్న చిన్న మొక్కలు పెంచు తుంటారు. ఇలాంటి చిన్న మొక్కల తాలూకు మొలకలు రాగానే పక్షులు వాటిని వెంటనే తినేస్తుంటాయి. సాధారణంగా పొలాల్లో ఈ పక్షుల్ని పారదోలడానికి పొడవాటి మెరుపు రంగు కాగితాన్ని వేలాడగడతారు. దానికి బదులు మీ కిచెన్‌ గార్డెన్‌ కోసం చిన్నారి మొక్కల మొలకలపై ఈ పాడైపోయిన సిడీలను వేలాడదీయండి. చూడ్డానికి అందంగానూ, షోగానూ ఉంటాయి. మొలకలను పక్షుల నుంచి రక్షిస్తాయి. నేరుగా చెత్తకుండీల్లో పారేయడానికి బదులు దానికి ముందే అది ఉపయో గంలోకి వస్తే పర్యావరణానికి కూడా ఎంతో మంచిది.