పచ్చడి ముక్కలు

RUCHI-11
RUCHI-11

పచ్చడి ముక్కలు

చిన్న చిన్న మామిడి పిందెలతో ఇందులో రెండు రకాలు. 1. ఎర్రమిర్చి, ఆవాలతో 2. పచ్చిమిర్చి, ఆవాలుతో ఎర్రమిర్చితో కావలసిన పదార్ధాలు చిన్న చిన్న మామిడి పిందెలు -20 (గట్టివి, కరకరమనాలి) ఎండుమిరపకాయలు – 6 ఉప్పు – తగినంత ఇంగువ – కొంచెం ఆవాలు – 2 చెంచాలు నువ్ఞ్వల నూనె – 2 చెంచాలు తయారీ విధానం ముందుగా మామిడిపిందెలను కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి నీటిలో పోయాలి. ఆ తరువాత ఆ నీరు అంతా వంచేయాలి. ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ, ఉప్పు వేసి మెత్తగా రుబ్బి తరిగి ఉంచిన మామిడిముక్కలను వేసి, నూనె కూడా బాగా వేసి కలిపి మూత పెట్టాలి. ఆ మరునాడుకి ఊరి చాలా చాలా బావ్ఞంటుంది. పచ్చిమిరప కాయలతో తయారీ విధానం అన్నీ పైన చెప్పిన వస్తువ్ఞలే, పైన పద్ధతే. ఎర్రమిరపకాయల బదులు 6 పచ్చిమిర్చి వేసి రుబ్బి బాగా కలుప్ఞకుని మూతపెట్టి ఉంచితే మరునాటికి చాలా రుచిగా ఉంటుంది.