నోటిపూత, దుర్వాసన నివారణకు

Mouth Fresh
Mouth Fresh

నోటిపూత, దుర్వాసన నివారణకు

నాలుకపూత పోవాలంటే ‘బి విటమిన్‌ గల ఆహారం తీసుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు ‘బి విటమిన్‌ క్యాప్సుల్స్‌ వాడితే నోటిపూత తగ్గిపోతుంది.

గోరువెచ్చని నీటిలో ఉప్పువేసి రోజుకు మూడుసార్లు పుక్కిలిపడితే నోటిపూత తగ్గుతుంది.

జామాకులు నమిలినా నోటి పూత తగ్గుతుంది. రోజూ రెండు మూడుసార్లు నమలాలి. రెండు రోజులలో నాలికపూత తగ్గుతుంది

పేరిన నెయ్యి రోజూ నాలుగైదు సార్లు రాస్తే మంచిది. పసిపిల్లలకు నాలుకపూస్తే ఈ చిట్కా చాలా మంచిది. ్జ మాచికాయ అరగదీసి ఆ గంధాన్ని నాలుకకు రాస్తే నాలుకపూత తగ్గిపోతుంది.

రోజ్‌వాటర్‌ నీటిలో కలిపి పుక్కిలి పడితే నోటి దుర్వాసన పోతుంది.
యాలకులు, లవంగాలు, జాజికాయ వీటిని పొడికొట్టి ఆ పొడిని చప్పరిస్తుంటే నోటి దుర్వాసన అంతరించిపోతుంది.

తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి రోజూ పుక్కిలించి పడితే నోటి దుర్వాసన, నోటిపూత, చిగుళ్ల వ్యాధులు అంతరించి పోతాయి.

జాపత్రిని నములుతున్నా నోటి దుర్వాసన పోయి నాలుకపూత తగ్గుతుంది.

పటిక కలిపిన గోరువెచ్చని నీరుతో పుక్కిలించి పడితే నోటి దుర్వాసన, నోటిపూత తగ్గుతాయి.

నోరు దుర్వాసనగా ఉంటే యోగాసనా లలో వజ్రాసనం కాని సింహాసనం వేయండి. అజీర్ణం, గొంతుకు సంబంధించిన వ్యాధులు ఉంటే నోరు దుర్వాసనగా ఉంటుంది. ఈ ఆస నాలు వేస్తే వ్యాధులు తగ్గుముఖం పట్టి నోటి దుర్వాసన తగ్గుతుంది.