నైట్‌ఫ్రాక్‌ కుట్టే విధానం

Nighty1
Nighty

నైట్‌ఫ్రాక్‌ కుట్టే విధానం

చెస్ట్‌ : ముందుగా టేపుతో చెస్ట్‌ కొలుచుకోవాలి. అలా కొలిచిన చెస్ట్‌ ఉదాహరణకి 20 అంగుళాలు ఉందనుకోండి, దానికి 6అంగుళాలు కలుపుకోవాలి. అలా కలిపి 26 అంగుళాలు తీసుకొని దానిని 4చే భాగించగా వచ్చిన దానికి 1అంగుళం కలపాలి.చెస్ట్‌ లూజు బట్టను రెండు మడతలమీద పెట్టి, దానికి ఒక అంగుళం కలిపి బట్టను నాలుగు మడతల మీద చెస్ట్‌ పొడవు పెట్టి కత్తిరించాలి.

అసలు చెస్ట్‌ని అనగా 20ని 4చే భాగించగా వచ్చిన ఆన్సర్‌కి 1/2 తగ్గించి మడతలవైపు నుండి ఓపెన్‌ వైపుకి షోలర్‌ గుర్తు పెట్టి, దానికి ఒక అంగుళం కలిపి చంక దింపు పెట్టాలి. మడతలవైపు పైన రెండంగుళాలు ప్రక్కమెడ పెట్టి,దానికి ఒకటిన్నర అంగుళం కలిపి ముందుమెడ పెట్టాలి. దీన్ని పలకగా కత్తిరించుకోవాలి. దీనికే ‘వి నెక్‌ పెట్టుకోవలసివస్తే అసలు చెస్ట్‌ని అనగా 20ని 4తో భాగించగా వచ్చిన ఆన్సర్‌కి ఒకటిన్నర అంగుళాలు కలిపి ముందు మెడపెట్టి ‘వి నెక్‌ లాగా షేప్‌తీసి ముందు పూర్తిగా ఓపెన్‌ చేసి, వెనుక మెడ పలక మెడపెడితే వెనుక మెడ కత్తిరించకూడదు. చేతులు : షోల్డరు ఎంత ఉందో అంతే చేతిలూజుని బట్ట రెండు మడతలమీద గుర్తుపెట్టి, షోల్డర్‌ని ఒక అంగుళం తగ్గించి, బట్టను నాలుగు మడతలమీద చేతి పొడవు పెట్టి కత్తిరించాలి.

షోల్డర్‌ని సగంచేసి, ఓపెన్‌ వైపున పైనుండి కిందకు చంక గుర్తుపెట్టి, మడతలవైపు నుండి చంక గుర్తుకి రౌండుగా భుజం షేపు తీసి,ఓపెన్‌వైపున కింద ఒక అంగుళం గుర్తుపెట్టి, అంగుళం గుర్తు నుండి చంక గుర్తు వరకు సైడ్‌ క్రాస్‌ తీసి,భుజంషేపు, సైడు క్రాస్‌ కూడా నాలుగు పొరలు కత్తిరించాలి. చెస్ట్‌కి కూడా పలకమెడ అయితే పలక షేపులో రెండుపొరలూ కత్తిరించి, ఎదురు ఓపెన్‌ చేసుకోవాలి. ‘వి నెక్‌ అయితే ఎదురు ఓపెన్‌ దగ్గర్నుంచి వి షేపులో రెండుపొరలూ కత్తిరించి,వెనుక మెడకూడా రెండుపొరలూ కత్తిరించాలి.

చంకలు మాత్రం నాలుగు పొరలూ కత్తిరించాలి. కుచ్చు : చెస్ట్‌ని సగంచేసి, దానికి నాలుగంగుళాలు కలిపి నాలుగు మడతలమీద కుచ్చులూజు పెట్టి, మనకు కావలసిన కుచ్చు పొడవు పెట్టుకొని, బట్టను కత్తిరించుకొని,మడతలవైపున ఓపెన్‌చేసి రెండు భాగాలుగా చేయాలి. ఇప్పుడు కుట్టడం నేర్చుకుందాం : ముందుగా భుజాలు కుట్టాలి. తరువాత భుజాలకి చేతులు అతికించాలి. పలక మెడకి ఒక అంగుళం వెడల్పు ముక్క తీసుకొని సన్నగా అంచుకుట్టి, అట్టే పెట్టుకొని, ఎద భాగం పెంపు,

మడతవేసి, తరువాత ఈ మెడముక్కని మెడకు అతుకుతూ పలక తేలినచోట కుచ్చుపెడుతూ మెడచుట్టూ వేసుకొని, కటింగ్‌లు పెట్టుకొని, అడుగున పెంపు మీద మడుపు పెట్టి రఫ్‌ తీసి, ముందు భాగానికి, వెనుక భాగానికి విడివిడిగా కుచ్చిళ్లు పెట్టి, చేతుల చివర్నించి కుచ్చు చివర వరకూ సైడ్స్‌ అతుక్కొని, అడుగున గౌను చివర మడచి కుట్టుకోవాలి.