నీరుతాగే క్రమం

                                     నీరుతాగే క్రమం

DRINKING WATER
DRINKING WATER

మీరు ప్రతిరోజూ పాటించాల్సిన నీరుతాగే క్రమం
– నిద్ర లేవగానే మామూలు మంచినీళ్లు ఒక సీసాడు తాగండి. మలబద్ధకం ఉన్నవాళ్లూ దీనికి బదులు గోరువెచ్చటి నీళ్లు తాగచ్చు.
– అల్పాహారం తిన్నాక : ఒక గ్లాసు.
– మధ్యాన్నం భోజనానికి ముందు ఒక గ్లాసు.
– భోజనం చేశాక ఒక గ్లాసు.
– వ్యాయామం చెయ్యటానికి 20 నిమిషాల ముందు రెండు గ్లాసులు.
– వ్యాయామం చేస్తున్నంతసేపూ కొద్దికొద్దిగా నీళ్లు తాగుతూ ఉండండి, ఎక్కువ మోతాదులో తాగద్దు, నీళ్లు ఉపయోగించటం బరువు తగ్గేందుకు, పొట్టనిండా తిన్నాక చల్లటినీళ్లు తాగద్దు, మామూలు నీళ్లు మాత్రమే తాగండి.
– వ్యాయామం చేశాక 2-3 గ్లాసులు.
– మీ బ్యాగులో ఒక లీటర్‌ సీసా నీళ్లు తీసుకెళ్తూ ఉండండి, ఖాళీ అవగానే మళ్లీ నింపండి.
– సాయంకాలం చిరుతిండి తినేముందు ఒకగ్లాసు.
– రాత్రి భోజనానికి ముందు ఒక గ్లాసు.
– భోజనం చేశాక ఒక గ్లాసు.
– నిద్రపోయేముందు ఒకటి
– రెండు గ్లాసులు. దీన్ని మీరు ప్రింటు చేసి మీ ఫ్రిజ్‌ మీదో, ఉద్యోగం చేసే ఆఫీసు గదిలోనో అతికించుకోండి. నీళ్లు ఎప్పుడు, ఎలా తాగాలో గుర్తుచేసుకోటానికి పనికివస్తుంది. మనమందరం అలవాట్లకి బానిసలం. నీళ్లు తక్కువ తాగటం అనేది అలవాటయినట్టే, సరైన మోతాదులో నీళ్లు తాగటం కూడా మనం అలవాటు చేసుకుంటే వస్తుంది. మొదలుపెట్టేందుకు ఇదే మంచి సమయం.