నీటిని పొదుపుగా వాడుదాం

water
water

నీటిని పొదుపుగా వాడుదాం

వేసవి ఎండలు బాగా పెరిగిపోతున్నాయి. బోర్లు ఎండిపోతున్నాయి. సమద్ధిగా దొరికినన్నాళ్లు నీటి విలువ తెలియదు. వాడేటప్పుడే డబ్బుతో సమానంగా నీటిని కాపాడుకోవాలి. దీనిపై ఒక అవగాహనతో ఉండటం, తదనుగుణంగా వాడుకోవటం చేస్తే నీటికొరతకి గురికాకుండా ఉంటాం. ‘మేం ఒక్కరం పాటిస్తే ఎంత నీరు ఆదా అవుతుందిలే అనుకోకుండా అందరూ పాటించాల్సిన సూచనలు ఇవి- ్య కొంతమంది కుళాయి తిప్పి మాట్లాడుతూ అంట్లు తోముతుంటారు. దీనివల్ల మనం వాడే నీటి కంటే వృథా అయ్యే నీరే అధికంగా ఉంటుంది. ్య నీరు ఎంత అవసరమో అంతవరకే బకెట్లలో నింపుకుని అంట్లు తోముకోవడం వల్ల ఒక బకెట్‌ నీరు వృధా కాకుండా చూడవచ్చు. ్య ఒకటో, రెండో గిన్నెలను కడిగేటప్పుడు బకెట్లోకి నింపుకుని కడగటం దేనికిలే అనుకుని నేరుగా కుళాయి కిందే గిన్నెలను కడుగుతుంటారు. దీనివల్ల ఆ రెండు గిన్నెలను కడగటానికి ఉప యోగించే నీటికంటే దాదాపు ఐదురెట్లు నీరు వృథా అవుతుంది. ్య బట్టలు ఉతికేటప్పుడు చాలామంది పైపుని బకెట్లో వదిలేసి ఉతుకుతారు. దీనివల్ల చాలా నీటిని నష్టపోవాల్సి వస్తుంది.

బట్టలను జాడించేటప్పుడు కూడా అవసరమైన వరకే వాడుకుంటే చాలా నీరు మిగులుతుంది. ్య కూరగాయలను, పండ్లను కడిగేటప్పుడు వాటిని కుళాయి కింద పెట్టి అదేపనిగా కడగకుండా ఒక వెడల్పాటి గిన్నెలో నీటిని తీసుకుని అందులో కూరగాయలను, పండ్లను శుభ్రం చేసుకోవచ్చు. ్య కొంతమంది ఎక్కువ నీటిని ఉపయోగించి స్నానం చేస్తే ఫ్రెష్‌గా ఉంటుందనుకుంటారు. దీనిలో భాగంగానే షవర్‌ కింద స్నానాలు, టబ్బుల్లో స్నానాలు చేస్తుంటారు. ఒకరు ఒక్కసారి షవర్‌ కింద స్నానం చేసే నీళ్లను దాదాపు వారంరోజులు పాటు స్నానానికి ఉపయోగించుకోవచ్చు. ్య నీటిని ఎక్కువగా కుమ్మరించి ఇళ్లు కడిగే బదులు ఒక బకెట్లోకి నీటిని తీసుకుని గదులను తుడవడం వల్ల నీటిని సేవ్‌ చేసుకోవచ్చు. ్య చెట్లకు నీటిని పెట్టేటప్పుడు చాలామంది పైపులతో పోస్తూ ఉంటారు. ఇలా చేయడం కంటే ఒక కేన్‌లోకి నీటిని తీసుకుని దానికి చిల్లుల మూతను అమర్చి అవసరమయ్యే మేరకే మొక్కలకు పోయాలి. ఇలా చేయడం వల్ల ఏ మొక్కకు ఎంత నీరు అవసరమో అంతవరకే పోస్తాం. పైపులతో పోయడం వల్ల చాలా నీరు వృథా అవుతుంది.