నిరంత‌రం గీతా ప‌ఠ‌నం చేయాలి

                                   నిరంత‌రం గీతా ప‌ఠ‌నం చేయాలి

BHAGAVAD GITA
BHAGAVAD GITA

దైవసాక్షాత్కారమును కాంక్షించువారు మంచి మార్గము నవలంబించాలి. గీతాపఠనం నిరంతరం చేయాలి. గీతాచార్యులు తెలిపిన దురాచారములను త్యజించాలి. కలి మానవ్ఞలు తమ నిత్య జీవనయానంలో ‘గీత యను నావనుపయోగించి సంసారతర్పణం చేయాలి. దేహం ధరించిన ప్రతి జీవికి ఇంద్రియాల ప్రభావం ఉంటుంది. మనస్సును నిగ్రహించుకోలేనపుడు ప్రతి చిన్న విషయానికీ క్రోధం అనగా కోపం సంభవిస్తుంది. తద్వారా దుష్ఫలితాలు వస్తాయి. వాటి నివారణకు గీతాచార్యులు పరిష్కారాన్ని గీతలో కొన్ని శ్లోకాలలో పేర్కొన్నారు.
శ్లోII క్రోదాద్భవతి సమ్మోహంః
సమ్మెహాత్‌ స్మృతి విభ్రమః
స్మృతిభ్రంశాత్‌-బుద్ధినాశో
బుద్ధినాశాత్‌ ప్రణశ్యతిII అంటూ క్రోధం వలన రకరకాల దుష్ఫలితాలు కల్గుతాయని పేర్కొంటూ కోపం రాకుండా జాగరూకులై యుండాలన్నారు. కోరికలను అదుపులో ఉంచుకోవాలన్నారు. గీతా అనుష్ఠానపరులై ఇంద్రియాలను తమ అధీనంలో ఉంచుకొన్నచో జ్ఞానం స్థిరంగా ఉంటుందని అది స్థితప్రజ్ఞుల లక్షణమనీ తెలిపారు. భోగసముదాయంపై ఆసక్తి కల్గినపుడు, ఈ భోగములు సంసార మహారోగాలు కావ్ఞనశాంతి కోరువారు భోగాలను త్యజించాలి. ‘భోగా దుఃఖయో నయేవతే అనగా భోగములు దుఃఖ హేతువ్ఞలు. ‘భోగాభవమహారోగాః అని వశిష్ఠుల వారు పలికిరి. కాన భోగాలను వదలి గీతనాశ్రయించాలన్నారు. మరణ భయం కలిగినపుడు గీతావాక్యాలను చదువ్ఞకుని స్మరిస్తూ ఉండాలి. మరణం అనగా దేహవియోగం. ఈ భయం చాలా గొప్పది. అందరికీ కంపనం కల్గిస్తుంది. ‘దేహినిత్యమవధ్యోయం అన్నాడు కృష్ణపరమాత్మ. కామాది వికారములు ప్రకోపించినపుడు, దృశ్యవిషయములను భావన చేయుట మొదలు పెట్టగనే వాని పట్ల కోరిక జనిస్తుంది. అది జీవ్ఞని వినాశనమునకు దారితీయును. గీతలో పదహారవ అధ్యాయంలో 21వశ్లోకంలో పరమాత్మ
శ్లోII త్రివిధం నరకస్యేదం
ద్వారం నాశన మాత్మనః
కామః క్రోథస్తథాలోభంః
తస్మాదేతత్త్రయం త్యజేత్‌II అనగా కామము, క్రోధము, లోభము, నరకద్వారములుగాన వీటిని త్యజించవలెను. పరులపై అసూయ, ద్వేషములు జనించినపుడు పరమాత్మ శత్రుమిత్రాదులయందు ఉదాసీనుని యందు, ద్వేషించువాని యందు, బంధు వ్ఞల యందు, పుణ్యాత్ముల యందు, పాపాత్ములందు సమబుద్ధి కల్గియుండాలని గీతాబోధన భక్తియోగంలో ”అద్వేష్టా సర్వభూతానాం అన్నారు.ప్రాపంచిక వైభవములచే గర్వం కలిగినపుడు పరమాత్మ అనంత మహావిభూతి ఒకసారి మనసా స్మరించినచో గర్వం, అహంకారం పోతాయని శ్రీకృష్ణులవారు గీత ద్వారా సందేశం ఇచ్చారు. కావ్ఞన గీతాజ్ఞానమును గంగాతీర్థముగా సేవించి జనన, మరణ రూపమగు భవబంధమును చేధించాలి. ఇది జనుల కర్త్యంగా భావించాలి. గీతాధ్యయనం నిత్యం చేయాలి. గీతాభావములను ఏకాగ్ర చిత్తముతో చింతిస్తూ ఉండాలి. సంసారయాత్రలో కేవలం నిమిత్త మాత్రులుగా వ్యవహరిస్తూ ఉంటే దుఃఖములకు, బంధములకు తావ్ఞండదు. శ్రీకృష్ణుడే మన జీవిత రథమును గమ్యస్థానమునకు గొనిపోవ్ఞను. గీతాశ్రవణం గీతోక్త భావ అనుష్ఠానము పరమ పవిత్రములైనవి. తాను తరించి ఇతరులను కూడ తరియింప చేయుటయే సనాతన ధర్మము. తాను పొందిన పరమానందమును ఇతరులకు కూడా పంచిపెట్టాలి. ”స్వయం తీర్ణః పరాం స్తారయతి సంసార కూపములోబడి దిక్కు తోచక యాతనలనుభవించువారిని జ్ఞాన వృద్ధులే కాపాడగలరు. ఆధ్యాత్మిక తత్వకోవిదులే వారిని దరిజేర్చగలరు. గీతను తాను పఠించి ఇతరులచే పఠింపచేయాలి. ఇదియే జ్ఞానదానం. జ్ఞానయజ్ఞం. ఇవియే గొప్పది. జల-అన్న-గో-భూ-నివాస-సువర్ణ-ఘృతదానములన్నింటి కంటెను జ్ఞానదానము ఉత్తమమైనది. గీతను వ్యాప్తి చేయువాడు తనకు మిక్కిలి ప్రియుడని గీతాంతమున గీతాచార్యులు తెలిపియున్నారు. కాన భగవంతునికి ఇష్టకార్యమును అందరూ చేయాలి. లోకానికి క్షేమము శ్రేయస్కరం. నిత్యజీవితంలో జనత ఆనందమయులుగా పునీతులుగా ఉండాలంటే గీతాగానం చేస్తూ ఉండాలి. గీతా మురళీ స్వనమును అంతటా వ్యాప్తిచేయాలి. జీవ్ఞల గమ్యం, కర్తవ్యం గీతాభ్యాసం- గీతాశ్రవణం. శ్లోII గీతా-గంగాచ గాయత్రీ గోవిందేతి-హృదిస్థితే చతుర్గకార-సంయుక్తే పునర్జన్మ-నవిద్యతేII అనగా గకారముతో ప్రారంభమైన గీత-గంగ-గాయత్రీ-గోవిందుడు అనే నాలుగు రూపాలను ఎవరు కలిగియుంటారో అట్టి వారికి పునర్జన్మ లేదని మహాభారతం బోధిస్తున్నది. నిత్యజీవ్ఞల హృదయాలలో గీత నిల‌య‌మై యుండాలి
– పి. వి. సీతారామమూర్తి