నిద్రతో రోగాలకు చెక్‌

sleeping
sleeping


ఒక జబ్బు కాస్త తగ్గుముఖం పడుతోందో లేదో మరో జబ్బు మొదలవుతుంది.ఏదో క్యూ కట్టినట్లు ఒకదాని తరువాత ఒకటి రకారకాల జబ్బులు శరీరాన్ని కబలించి వేస్తుంటాయి.మందలు వేసేకోగానే ఏదో తగ్గినట్టే అనిపిస్తుంది.కానీ,పూర్తిగా ఏదీ పోదు విసుగొచ్చి మందులు మానేస్తే పరిస్థితి మరింత విషమిస్తుంది.ఇన్నిన్ని జబ్బులకు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడమే కారణమని చాలాకాలం దాక బోధపడదు.ఇంకాస్త లోతుకు వెళితే వ్యాధినిరోధనకశక్తి తగ్గడానికి అసలు కారణం నిద్రలేమి అన్న నిజం బయటపడుతుంది.అందుకే హాయిగా నిద్రించలేకపోతే అన్నీ కష్టాలే అంటున్నారు నిపుణులు. ఖరీదైన మంచాలా పరువులూ కొనుక్కోవచ్చు నిశ్శబ్దం.చాల్లగాలి ఏర్పాట్లు చేసుకోవచ్చు.ఇతరత్రా మరెన్నో సౌకార్యాలు సమకూర్చు కోవచ్చు అయినా శారీరకంగానో సమ్యసలే వేధిస్తున్నప్పుడు కంటిమీద కునుకే రాదు నిజానికి 90 శాతం నిద్రలేదని బాధలకు మానసిక సమస్యలే కారణం మిగతా ఆ 10 శాతం సమ్యసలకే శారీరక కారణాలు ఉంటాయి అయితే నిద్రలేమి ఏ కారణంగా వచ్చినా సమస్య తీవ్రంగానే వేధింస్తుంది.
ఇన్‌సామ్నియా
నిద్రలేమి సమస్యను ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు.మానసిక కారణలతో వచ్చే నిద్రలేదమిని మొదటి రకం ఇన్‌సామ్నియంగా శారీక కారణలతో వచ్చే నిద్రలేమిని రెండో రకం ఇన్‌సామ్నియంగా గుర్తిస్తారు. కొన్ని సమస్యలు నిద్రకు సంబంధించిన ప్రత్యేక పరీక్షాశాలల్లో తప్ప తేలవు వరుసగా రెండో పాటు నిద్ర పట్టనంత మాత్రన డాక్టర్‌ వద్దకు పరుగెత్తవలసిన లేదు.
ఏమవుతుంది! నిద్రలేని సమస్య దీర్ఘకాలికంగా కొనసాగితే వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోతుంద.శరీరంలోని గ్లూకోజ్‌ను క్రమబద్దం చేసే యంత్రాలు మెదలు సామర్థ్ధ్యం తగ్గిపోయి.ప్రతి చిన్న విషయానికీ కంగారు పడిపోవడం పాటు అసహసం పెరిగిపోతుంది.ఈ స్థితిలో నిర్లక్ష్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి ఒకవేళ డాక్టర్‌ సూచనలన్నీ పాటిస్తూ రాసిన మందులు వాడిన తరువాత కూడా -కూడా ఏ ప్రభావమూ కనిపించకపోతే మనసిక నిపుణులను కలవడం అవసరం.