నాయకత్వ లక్షణాలివే!

                                   నాయకత్వ లక్షణాలివే!

TEAM LEADER
TEAM LEADER

ఈ మధ్య కాలంలో మహిళలు ఉద్యోగంలో రాణించడమే కాదు, టీమ్‌లీడర్లుగా కూడా విజయవంతంగా రాణిస్తు న్నారు. స్వల్పకాలంలో సాధారణ ఉద్యోగి నుంచి, టీమ్‌ లీడర్‌ వరకు ప్రమోషన్లతో తన సత్తా చాటుకుం టున్నది. మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, సంస్థ లాభాలకు తోర్ప డడం వల్ల అవకాశం ఇస్తే, మహిళలు కూడా ఉన్నతంగా ఎదుగు తారని నిరూపిస్తున్నారు. సంస్థ వీరిపై అపార మైన నమ్మకాన్ని ఉంచి, బాధ్యతలను అప్పగిం చినప్పుడు అంతే బాధ్యతగా సత్ప ´లితాలను సాధిస్తు న్నారు.
అయితే మీరు టీమ్‌లీడర్‌గా పనిచేస్తున్నారా? అందులో మరింత విజయాలను పొందాలంటే కొన్ని తెలుసుకోవాల్సిన అంశాలున్నాయి. ఎందుకంటే ఒక సంస్థ సత్ఫలితాలు సాధించాలంటే ఆ సంస్థలోని వారంతా చక్కని ప్రేరణతో పనిచేయాలి. పనివిషయంలో అందరూ కలిసి లక్ష్యసాధన కొరకు పరిశ్రమించేలా చేయడమే ”టీమ్‌బిల్డింగ్‌. అసలు టీమ్‌ బిల్డింగ్‌ అంటే ఏమిటో, దానినెలా నిర్వహించాలో తెలుసుకుందాం. టీమ్‌ లీడర్‌ సంస్థకు గార్డియన్‌లాగా వ్యవహరించాలి. సభ్యులందరిని కలిపి, సఖ్యతతో పనిచేసేటట్లు చేసే చాకచక్యం ఉండాలి. టీమ్‌లీడర్‌ అనుక్షణం తనను తాను ప్రేరేపించుకుంటూ తన టీమ్‌ సభ్యుల్ని ప్రేరేపిస్తూ ఉండాలి. సంస్థలో ఒకరినొకరు అర్థం చేసుకొనే విధంగా మీటింగులు, శిక్షణా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలి.సభ్యులు ఒకరినొకరు సంప్రదించు కుంటూ ఒకరి భావాలను మరొకరు గౌరవించుకుంటూ టీమ్‌వర్క్‌ను సమర్థవం తంగా కొనసాగించవచ్చును. అందరినీ కలుపుకుని గమ్యాన్ని చేరడానికి టీమ్‌లీడర్‌ ప్రయత్నించాలి. ప్రతిసభ్యుడు స్వయం ప్రేరణతో పనిచేసే విధంగా ప్రోత్సహించాలి. సంస్థలోని వ్యక్తుల అవసరాలను గుర్తించి వాటిని సంతృప్తిపరచటానికి ప్రయత్నించాలి.
ౖ టీమ్‌లీడర్‌ విశ్వాస పాత్రుడుగా ఉండాలి. సంస్థ లక్ష్యాలను, సాధించవలసిన విధానాలను, సంస్థ ఆశయాలను సమాచార పంపిణీ ద్వారా టీమ్‌లోని ప్రతి సభ్యునికి తెలియాలి. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కొన్ని సమయాల్లో స్వయం నిర్ణయాలు తీసుకొనే అవకాశమివ్వాలి. సంస్థపై నమ్మకం కలిగించేలా టీమ్‌ లీడర్‌ ఆత్మీయంగా ప్రవర్తించాలి. ఎప్పటికప్పుడు చర్చలు జరిపి సమస్యలను తెలుసుకోవడం, పరిష్కరించడం చేయాలి. టీమంతా కలిసి పనిచేస్తున్నప్పుడు వారిలో బాగా పనిచేసిన వారికి, సృజనాత్మకత చూపించిన వారికి తప్పనిసరిగా అభినందనలు అందించాలి.
ౖ టీమ్‌లీడర్‌, టీమ్‌ లక్ష్యాలకు విధానాలకు ఇతర సభ్యులతో అనుగుణ్యత కలిగి ఉండాలి. అవసరమైన గుణాలను అభివృద్ధి పరచుకోవాలి.
ౖ కొత్త సమస్యలు లేదా సవాళ్లు ఎదురైనప్పుడు అనేకవిధాలుగా ఆలోచన చేసి నూతన పరిష్కారాలను కనుగొనాలి. సమైక్యంగా పనిచేసి విజయసాధన చేయాలి. ప్రతి సభ్యుడు అకుంఠిత దీక్షతో నిబద్ధంగా పనిచేయాలి. సభ్యుల మధ్య స్వేచ్ఛగా భావప్రసారం జరగాలి. టీమ్‌లోని ప్రతి ఒక్కరితోనూ స్నేహపూరిత సంబంధము పెంచుకోవాలి. పూర్తిస్తాయిలో తన సామర్థ్యాలను ఉపయోగించి తనకు కేటాయించిన పనిని నిర్వహించాలి. ఎంత పని చేశావన్న దానికన్నా, ఎంత సమర్థతో పనిచేసావన్నదే ముఖ్యం. క్రమబద్ధమైన ఆలోచన చేయగలిగి ఉండాలి. కాలనిర్వహణ సమర్థత కలిగి ఉండటం సరైన సమయంలో సరైన నిర్ణయాలతో వృత్తి సామర్థ్యాన్ని పెంచే అలవాట్లు ఏర్పరుచుకోవడం, ఇతరుల సామర్థ్యాలను గుర్తించి గౌరవించాలి. అభినందించాలి. నేను తెలుసుకోవలసినది చాలా ఉంది అనుకున్నప్పుడే స్వీయ అభివృద్ధి జరుగుతుంది. నాకు అన్నీ తెలుసు అనే అహంకారం స్వీయ అభివృద్ధికి శత్రువ్ఞ లాంటిది. ప్రతిరోజూ నేర్చుకుంటూ నిత్య అన్వేషకుడిగా ఉండాలి. స్వార్థంతో నీవే పొందాలనుకుంటే నీవ్ఞ ఇతరులకు దూరమవ్ఞతావ్ఞ. నీవ్ఞ నిస్వార్థంగా ఇతరులకు ఇవ్వాలనుకుంటే నీవ్ఞ ఇతరులకు దగ్గరవ్ఞతావ్ఞ.
ౖ పరిష్కారం కనుగొనటం కాదు. పరిష్కారాన్ని తయారుచేయాలి. ఆలోచనావిధానాల్లో మార్పు రావాలి. క్రమపద్ధతిలో వివేచనతో కూడిన ఆలోచన, బహుళ ప్రతిస్పందనలతో కూడిన ఆలోచనల ద్వారా పరిష్కారం లభ్యమౌతుంది. అందిన ప్రతి అవకాశంలో పూర్తిస్థాయిలో సామర్థ్యాలను ఉపయోగించాలి. తప్పనిసరిగా సాధించాలనే దృఢనిశ్చయం కలిగి ఉండాలి.
ౖ ఇతరుల అభిప్రాయాలను వారి పనులను, వారి అవసరాలను విలువ నిచ్చి తన దృష్టితో కాక, ఇతరుల దృష్టితో కూడా సమస్యలను ఆలోచించి, పరిష్కరించగల తదనుభూతిని టీమ్‌ లీడర్‌ పెంచుకోవాలి.
ౖ తనకు తాను స్వయం ప్రేరణ కలిగించుకుంటూ తన సమూహంలోని సభ్యులలో కూడా ప్రేరణ కలిగించి ఉత్పాదకతను పెంచాలి. సరైన ప్రణాళిక నిర్వహణ, నియంత్రణ, సరైన నిర్ణయం మొదలగు నైపుణ్యాలు ఏరంగంలోని నాయకునికైనా సత్ఫలితాలనిస్తుంది.
ౖ ఇతరులతో సత్సంబంధాలు కలిగి, ఇతరులలో తన భావాలను నేర్పుతో వ్యక్తపరిచే సమాచార నైపుణ్యాలు సమర్థవంతుడైన నాయకునికి అవసరం. సంస్థలో అందరూ కలిసి పనిచేసే వైఖరి పెంపొందుతుంది.
ౖ ప్రణాళికాబద్ధంగా సమయపాలనతో, క్రమశిక్షణతో సరైన మార్గదర్శకత్వంతో నాయకత్వం వహించటం వలన ప్రతి ఒక్కరూ ఉత్తేజిత్తులై సంస్థ విజయానికి కారకులవ్ఞతారు. టీమ్‌వర్క్‌లో ప్రతి సభ్యుడూ ఎల్లప్పుడూ ఆశావాద దృక్పథం కలిగి ఉండాలి. ఆశావాదిగా ఉండాలి. నిరాశావాద భావనలతో ఇతర సభ్యులను నిరుత్సాహ పరచరాదు. అతని/ ఆమె ప్రవర్తన, వైరి, నడవడిక పద్ధతులు అలవాటుచేష్టలు అన్నీ కూడా తన సమూహ సభ్యులకు ఒక ఉదాహరణకు పాత్ర నమూనాగా ఉండేటట్లుండాలి. ఆదర్శనీయంగా అంగీకారయోగ్యంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఆలోచనల్లో తార్కికత చోటు చేసుకుంటే ప్రతిదీ క్రమంలో సాగుతుంది. విల్‌పవర్‌, సంసిద్ధత, సందర్శశుద్ధి వంటి గుణాలు టీమ్‌లీడర్‌ అలవర్చుకొంటే టీమ్‌బిల్డింగ్‌ పటిష్టంగా ఏర్పడగలదు.