నవ్వుతో.. ఒత్తిడి దూరం

Laughter
Laughter


నవ్వడం ఒక ఆరోగ్యం నవ్వకపోవడం ఒక రోగమని అంటారు పెద్దలు. అంతేకాదు నవ్వడం మనసుకు మంచిది. అదొక ఆరోగ్యకరమైన వ్యాయామం కూడా. నవ్వు నేర్పితే వచ్చేది కాదు. అది ఒక సహజ సంపద. సృష్ట్యాది నుంచి వున్న నవ్వు భాషకన్నా క్లుప్తమయినది. నవ్వులో ఎన్నో భావవ్యక్తీకరణలుంటాయి. కొన్ని సందర్భాలలో నవ్వును అణచుకోలేం. నవ్వు రాకుండా పెదవుల్ని బిగించనూలేం. మనోభావాన్ని వ్యక్తీకరించడమే నవ్వు ఉద్దేశ్యమని మనం భావించాల్సి వుంటుంది. నవ్వు మౌలిక లక్షణం. స్వీయ భావవ్యక్తీకరణ కాదు, ఇతరులలో సహకారాత్మక భావనలు నింపడమే. నవ్వు మనలో టెన్షన్స్‌ను సడలిస్తుంది. సమైక్య భావనను సామరస్యాన్ని పెంపొందిస్తుంది. నవ్వు మనసుని తేలికపరిచే ఉత్తమసాధనం. హాస్యం, నవ్వు ఆరోగ్యాన్ని ప్రశాంతనిస్తోంది. మనసూర్తిగా నవ్వడం మానసిక ఆరోగ్యానికి వ్యాయామం. సున్నితమైన హాస్యం నుంచి జనించిన నవ్వు ఆరోగ్యాన్ని, ఆయురార్ధాన్నిస్తుంది.
నవ్వడం ఆరోగ్యానికి ఆత్మీయసంతోషానికి అవసరమైన ఇంధనం. రోజు హాయిగా నవ్వేవారి జోలికి ఏ రోగం రాదు.హాయి అనేదానికి పర్యామ పదమే నవ్వడం. నవ్వుతూ జీవించాలి. నవ్వుతూనే జీవన సమరంలో సవాలు ఎదుర్కోవాలి.
రోజు మొత్తంలో ఎన్నిసార్లు ఎంతగా నవ్వేందుకు అవకాశం వస్తే అంతగా నవ్వండి. పదేపదే నవ్వండి పగలబడి నవ్వండి. జోక్‌ల మీద జోక్‌ లేసుకుని మరీ నవ్వండి. ఇలా నవ్వుతూ నవ్వించేవారితో వారిమధ్య ప్రతి రోజుఎంతో కోంత సమయం గడిపెలా మీ దినచర్యను ప్లాన్‌ చేసుకోండి. నవ్వేబోగం, నవ్వే యోగం, నవ్వే నవజీవన రాగం, నవ్వేమన బ్రతుకు వీణపలికే రాగం. ప్రశాంతతకు మిత్రుడు నవ్వు ఆందోళనకు బద్దశత్రువు నవ్వు. జీవితానికి కందెన నూనె నవ్వు అన్న సూక్తివాస్తవమైనది. అధికారిక సంబంధాలు, వైవాహిక సంబంధాలు తల్లిదండ్రులు బిడ్డలమధ్య సంబంధాలు ప్రతి ఒక్కటి సంఘర్షించుకునే సమయంలో నవ్వు ఔదార్యంలో ఉపయోగిస్తే సత్ఫలితాలు కనిపిస్తాయి. నవ్వడం తెలిసినవారు అతి కఠినమైన ప్రతికూల పరిస్థతులను కూడా తేలికగా తీసుకుని అనుభవించ గలుగుతారు. నవ్వు పై ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు అధ్యయనాలు జరిగాయి. హస్యం వల్లనో నవ్వు జనించే సందర్భాలు 20% వుంటే మొహమాట పడుతూ, తప్పనిసరిగా నవ్వాల్సిన పరిస్థితులు 80% వుంటాయని పరిశోధకులు అంటున్నారు. కొన్ని సందర్భాలలో నవ్వుతో మాట మౌనమవుతుంది. పలకరింపుగా నవ్వు చిరునవ్వు భావవ్యక్తీకరణసాధనం. శిశువు బోసి నవ్వులు చిందించటం సహజమైన పరిణామమని చైల్డ్‌ సైకాలజిస్ట్‌లు అంటున్నారు. తనయోగ్యతను చూసినవ్వుకోవడం తనను చూసి తాను నవ్వుకోవటం అనేది ఒక అమూల్యమైన కానుక. సాధారణ సంబంధాలను అభివృద్ది చేయడమే కాక ఇది స్వయం ప్రాముఖ్యతను గుర్తించిన భావాలను, స్వయం కల్పిత అభిప్రాయాలను అరికట్టగలుగుతుంది. సాధారణ సమయాలలో కూడా సజీవమైన హాస్యప్రియత్వం ఒక వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యానికి తొడ్పడుతుంది. హాస్యం ద్వారా ఉపశమనం పొందాలనే సమాజం ప్రగాఢ వాంఛకు గొప్పహాస్య ప్రవీణ్యతలు కైవసం చేసుకున్న వాత్సల్యం అదృష్టాతా, సాక్ష్యం చెబుతున్నాయి. మనకు ఉదాహరణగా నటుడు చార్లీచాంప్లిన్‌ గోచరిస్తాడు. బీర్బల్‌, తెనాలిరామకృష్ణుడు జ్ఞప్తిలో ఉంటారు. ఒక రాజకీయ ఆయుధంగా హాస్యశక్తిని ప్రముఖకార్టునిస్టులు డేవిడ్‌లో ఆర్‌కెలక్ష్మణ్‌ ప్రదర్శించారు. ఇతరులతో బాటు మనలో కూడా వినోదకరమైన విభాగాన్ని చూచుకోగలిగితే మనం అత్యంతమేలు పోందగలుగుతాము. నిత్య జీవితంలో హాస్య సన్నివేశాలపై నిశితదృష్టి నిలిపేందుకు పూనుకోవాలి. మనం కూడా వీలైనంత వరకు కోపంతో సమాధానాలు ఇవ్వడానికి బదులుగా, హాస్య దోరణిలోజవాబు లివ్వటానికి పూనుకోవాలి. సంభాషణల్లో తగిన సమయంలో పరిహాసం హాస్యాలాడటం ప్రవేశపెట్టడం ఆహ్వానించదగినది. ఈ హాస్యానికి ఆధారం ఏమిటో దాన్ని కూడా నిర్మొహమాటంగా అంగీకరించవచ్చును. హాస్య ప్రియత్వం ఉండటం ఒక అమూల్య కానుక. దానిని చేరుకునేందుకు ప్రయత్నిస్తే అది మన అందరికీ ఉచితంగా లభిస్తుంది. హాస్యం అనేది అంతరంగానికి ఆటవిడుపులాంటిది.నవ్వనేది మనిషికి అపూర్వమైన వరం. మనిషికి మళ్లీ ఏ ఇతరజీవి తనలోని తృప్తిని ఆనందాన్ని, ఉత్సాహాన్ని నవ్వు ద్వారా ప్రకటించలేదు. ఈ సౌకర్యం మనుష్యులైన మనకు మాత్రమే ప్రకృతి ప్రసాదించింది. నవ్వడం నేర్చుకోవాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉన్నవారు ఆరోగ్యరీతి మంచి పాజిటీవ్‌ మూడ్‌లో వుండగలరు. మనసారా నన్వితే గుండెనొప్పితో సహా కొన్ని వ్యాధులను సమర్ధవంతంగా నిరోధించవచ్చు అంటున్నారు. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ హెచ్‌కె చోప్రా. ఒత్తిడుల మూలంగా తలెత్తుతున్నా జబ్బులన్నింటికీ నవ్వే దివ్య ఔషధమంటున్నారు. మనం గట్టిగా నవ్వితే ఊపిరితిత్తులు తెరుచుకుని స్వచ్ఛమైన గాలిని గ్రహిస్తాయి. నవ్వు శక్తిని స్వస్థతను ఇస్తుంది. సకారాత్మక ఆలోచనా దృక్పదాన్ని పెంపొందిస్తుంది. జీవితాన్ని ముచ్ఛటగా గడపటం వివేకవంతమైన లక్షణం.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/