దైవచింతన

                                దైవచింతన

TEMPLE
TEMPLE

తమ ఇష్టదైవాన్ని దర్శించడానికి దేవాలయాలకు వెళ్లడం మన సాంప్రదాయం. రోజూ దేవాలయానికి వెళ్ళి పూజలు చేసేవారు అరుదు. అయితే వారానికి ఒకసారయినా దేవాలయానికి వెళ్లే వారిసంఖ్య బాగానే ఉంటుంది. హిందువ్ఞలయితే శనివారం, ముస్లింలయితే శుక్రవారం, క్రైస్తవ్ఞలయితే ఆదివారం తమ ప్రార్థనా స్థలాల్ని సందర్శిస్తుంటారు. హిందుమతాన్ని అనుసరించే వాళ్లల్లో వేర్వేరు దేవ్ఞళ్ళను నమ్మేవారు ఉన్నారు. వారిలో సాయిబాబాని నమ్మేవారు గురువారం సాయిబాబా గుడికి వెళతాడు.

ఉప్పలమ్మను, మైసమ్మను ఆదివారం పూజిస్తుంటారు. ఇలాంటి దేవతల్ని ఒక్కొక్కరు ఒక్కో రోజున పూజిస్తారు. అయితే గుడికి వెళ్ళడానికి సమయం, సందర్భం ఉంటాయా? వీటిని సంబంధించి తప్పనిసరి సూచనలేం లేవ్ఞ. అయితే సాధారణంగా ఉదయం లేదా సాయంత్రం వేళ గుడికి వెళ్ళి రావడం మంచిదని సంప్రదాయకంగా కొన్ని అభిప్రాయా లు, నమ్మకాలు వచ్చాయి. ఉదయం పూట శ్రీమహావిష్ణువ్ఞని, ఆయన అవతారాలైన రాముడు, కృష్ణుడు తదితర దేవ్ఞళ్ళని సందర్శించా లంటారు. అలాగే సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శంకరుణ్ణి దర్శించుకోవా లంటారు.

అయితే ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. నిర్ణీత సమయా ల్లోనే ఆ దేవ్ఞళ్ళను దర్శించుకోవాలని ఎందుకంటా రంటే విష్ణ్వాలయంలో తులసితీర్థాన్నీ, పూమాలనిఇస్తారు. మనం ఉదయాన్నే స్నానం చేసి దేవ్ఞని దర్శనానికి వెళుతుంటాం. కనుక అక్కడ ఇచ్చే తులసి తీర్థం పరగడుపున తాగడం వల్ల శరీరం ఆరోగ్యానికి మంచిదంటున్నారు. తులసీ తీర్థం శ్వాస కోశాన్ని శుభ్రపరుస్తుంది. పూమాల అలంకారానికి చిహ్నం. పరిశుభ్రంగా దేవ్ఞడి దర్శనానికి వెళ్ళినవారు అక్కడ ఇచ్చిన పూమాలను ధరించడం వల్ల అలంకార ప్రియత్వాన్ని కలిగి స్తుంది.

పొద్దుటే ఏ చీకూచింత లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతచిత్తంతో దేవ్ఞని దర్శించుకుని మనస్ఫూర్తిగా దణ్ణం పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల ఆరోజు కార్యక్రమాలన్నీ సజావ్ఞగా జరిగి రోజంతా ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా ఉంటుంది. అంతేగాక ప్రశాంత చిత్తాన దేవ్ఞణ్ణి పూజించడం వల్ల మనసున తలచిన కోర్కెలు నెరవేరు తాయని చెబుతున్నారు.ఇక సాయంకాలం శివదర్శనమప్పుడు మారేడాకు లు మునిగి న తీర్థాన్నీ, విభూతిని ఇస్తారు. మారేడు నీరు జీర్ణకోశాన్ని శుభ్రపరుస్తుంది. ఇది రాత్రి సమయంలో తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమయ్యే అవకా శం ఉంది.

అంతేగాక సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక అలసటగా అనిపించినా కూడా స్నానం చేసి ఫ్రెషప్‌ అయి కొంచెంసేపు అలా గుడికి వెళ్ళి రావడం మంచిది. ఈ విధంగా దేవ్ఞణ్ణి దర్శించుకుంటే ఆ రోజు పడ్డ శ్రమంతా తొలగిపోయి ఉత్సాహంగా ఉంటారు. ప్రతిరోజూ లేదా ప్రతివారం గుడికి వెళ్ళడం అందరికీ కుదరకపోవచ్చు. అయితే పర్వదినాల్లోనూ, పండగలప్పుడు దేవాలయాలకు వెళ్ళడం మంచిది. పిల్లలతో షికారుగా ఎక్కడికయినా తిరిగి రావాలనుకునేవారు దేవాలయాలకు వెళ్ళడం మంచిది.

దేవాలయాల్లోని ప్రశాంత వాతావరణం పిల్లల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తుంది. చిన్నతనం నుంచే దైవభక్తి చింతన అలవడుతుంది. మనిషి తన విధి తాను నిర్వర్తిస్తూనే దైవంపై భక్తి కలిగి ఉండటం వల్ల ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే అవకాశం ఉంది. సానుకూల దృక్పథంతో ముందుకుపోతాడు. ఇందువల్ల అనుకున్నది సాధించ గలుగు తాడు. కనుక ప్రతి మనిషికి దైవం ఏదో రూపంలో తోడ్పడుతుంది.
– కమల