దాల్చిన చెక్కతో బీన్స్‌

                       దాల్చిన చెక్కతో బీన్స్‌

mixed vegetable curry
mixed vegetable curry

దాల్చిన చెక్కతో బీన్స్‌
కావలసినవి: బీన్స్‌-పావుకిలో, దాల్చినచెక్క-అర అంగుళం ముక్క, యాలకులు-మూడు, లవంగాలు-మూడు, కారం-టీస్పూను, ఉల్లిముక్కలు-కప్పు, టొమాటో ముక్కలు-కప్పు, అల్లంతురుము-టీస్పూను, జీలకర్ర-టీస్పూను, మిరియాలు-నాలుగు, కరివేపాకు- 2 రెబ్బలు, నూనె-2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు-తగినంత, కొత్తిమీర తురుము-2 టేబుల్‌స్పూన్లు.
తయారుచేసే విధానం; బీన్స్‌ముక్కలు సన్నగా తరిగి ఉడికించాలి. బాణలిలో టేబుల్‌స్పూను నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత టొమాటోముక్కలు వేసి వేయించాలి. ఉప్పు, కారం వేసి ఉడికించి తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీలో అల్లంతురుము, జీలకర్ర, మిరియాలు, కొత్తిమీరతురుము, వేసి మెత్తగా రుబ్బాలి. అందులోనే వేయించిన ఉల్లి, టొమాటో ముక్కలు, పావుకప్పు నీళ్లు కూడా వేసి మళ్లీ రుబ్బాలి. బాణలిలో మిగిలిన నూనె వేసి కాగాక దాల్చినచెక్క ముక్కలు, యాలకులు, లవంగాలు వేసి వేయించాలి. తరవాత బీన్స్‌ ముక్కలు వేసి కాస్త ఉప్పు చల్లాలి. గ్రేవీ మసాలా వేసి అవసరమైతే మరోకప్పు నీళ్లు పోసి ఉడికించి దించాలి.

మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కూర
కావలసినవి;- క్యారెట్లు- రెండు, బీన్స్‌-పది, బఠాణీ-అరకప్పు, బంగాళాదుంప-ఒకటి, జీలకర్ర-అరటీస్పూను, ఉల్లిపాయ-ఒకటి, టొమాటో-ఒకటి, పుదీనా-టేబుల్‌స్పూను, అల్లంవెల్లుల్లి-టీస్పూను, కారం-అర టీస్పూను, పసుపు-పావు టీస్పూను, నిమ్మరసం-టీ స్పూను, పెరుగు-2 టేబుల్‌స్పూన్లు, కసూరిమెంతి-చిటికెడు, నెయ్యి-3టేబుల్‌స్పూన్లు, ఉప్పు-తగినంత, మంచినీళ్లు-సరిపడా, గ్రేవీకోసం;- కొబ్బరి తురుము- ముప్పావు కప్పు, పచ్చిమిర్చి-రెండు, మెంతులు-అరటీస్పూను, దాల్చిన చెక్క-అంగుళంముక్క, లవంగాలు-రెండు, యాలకులు-ఒకటి, పుట్నాలపప్పు-2 టీస్పూన్లు, జీడిపప్పు-నాలుగు, గసగసాలు-అరటీస్పూను.
తయారుచేసే విధానం; గ్రేవీకోసం తీసుకున్నవన్నీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. కూరగాయముక్కలు, బఠాణీ కలిపి కాస్త ఉడికించి ఉంచాలి. కుక్కర్‌లో నెయ్యి వేసి పలావు ఆకు వేసి వేయించాలి. జీలకర్ర, ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. పుదీనా తురుము, టొమాటోగుజ్జు వేసి వేయించాలి. తరవాత పసుపు, కారం, గరంమసాలా, ఉప్పు, రుబ్బిన మసాలాముద్ద వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. ఇప్పుడు తరిగిన కూరగాయ ముక్కలన్నీ వేసి తగినన్ని నీళ్లు పోసి కలపాలి. కసూరి మెంతి, పెరుగు, కూరగాయ ముక్కలు వేసి సిమ్‌లో ఉడికించి దించాలి.

curry
curry

మొక్కజొన్న గింజల కూర
కావలసినవి;- మొక్కజొన్న గింజలు-కప్పు, పలావు ఆకు-ఒకటి, జీలకర్ర-టీస్పూను, ఉల్లిపాయ-ఒకటి, అల్లంవెల్లుల్లి-టీస్పూను, టొమాటోలు-మూడు, కశ్మీరీ కారం-టీస్పూను, దనియాలపొడి-టీస్పూను, ఉప్పు-టీస్పూను, జీడిపప్పుముద్ద-పావుకప్పు, మంచినీళ్లు-కప్పు, మీగడ-2 టేబుల్‌స్పూన్లు, గరంమసాలా-పావు టీస్పూను, కసూరిమెంతి-టీస్పూను, కొత్తిమీర తురుము-2, టేబుల్‌ స్పూన్లు, నూనె- 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: బాణలిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి కాగాక పలావు ఆకు, టీస్పూను జీలకర్ర వేసి వేయించాలి. తరవాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయే వరకూ వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు వేసి మెత్తగా ఉడికిన తరవాత మసాలా పొడులూ, ఉప్పూ వేసి సిమ్‌లో ఉడికించాలి.