తులసి ప్రాధాన్యత

                                తులసి ప్రాధాన్యత

tulasi
tulasi

వేనవేల సంవత్సరాల నుండీ ఆయుర్వేదంలో దీనికి ప్రాముఖ్యత ఉంది. ఆకులు, గింజలు, కాండము అన్నీ ఔషధోపయోగాలే! అనగా మృత్యువ్ఞఅని, ”లసతి అనగా ధిక్కరించేది అని అంటే ఇది అపమృత్యుదోష నివారణలో సాటిలేనిదని వివరణ ఇచ్చారు పండితులు. ప్రాచీన ఆయుర్వేద వైద్యులైన చరకుడు, శుశ్రుతుడు మొదలైన మహానుభావ్ఞలెందరో, ఈ మొక్క గొప్పదనాన్ని, ఉపయోగాలను తెలియజేశారు. జాతకపరంగా గాని, గృహపరంగా గాని, ఏవైనా మొక్కుబడులు ఉండి తీర్చని పక్షంలోగాని, తులసి కోటలోని మొక్క ఎండిపోతుందట. మళ్లీ మళ్లీ వేస్తున్నా అదే సమస్య తల ఎత్తుతుంది. కాబట్టి ఆయా విషయా లను ఆలోచించి, శ్రద్ధ తీసుకోవాలి. నిత్యమూ పూజించడం, స్తోత్రాలు చదవడం, జాతక దోషాలను పోగొట్టుతుంది. అలాగే, జ్ఞాపకం చేసుకుని, మొక్కులు తీర్చుకోవాలి. తులసినామాలు శాస్త్ర ప్రకారం జపిస్తూ, కార్తీకమాసంలో పూజించిన వారికి అశ్వమేధయాగం చేసినంతటి ఫలితం లభిస్తుందట. ఎవరైతే మంగళవ్యా ద్యాలతో, వైదిక పద్ధతిలో తులసీ-నారాయణులకు కళ్యాణం జరిపిస్తారో, వారికి ఇహంలో సర్వసౌఖ్యాలూ లభించడమే కాక, అంత్యకాలంలో వైకుంఠప్రాప్తి కలుగుతుందట! తులసితో శ్రీమహా విష్ణువ్ఞను పూజించితే, తిరిగి జన్మించవలసిన దుర్గతి ఉండదని, నిత్యమూ తులసిని పూజించాలని, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.