తులసి తరతరాల ఆరోగ్యసిరి

Tulasi
Tulasi

తులసి తరతరాల ఆరోగ్య సిరి

ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండేది తులసి. తులసి దేవుళ్లందరికీ ఎంతో ప్రీతికరం. దీనిలో అనేక రోగాలను నిరోధించే శక్తి ఉంది. దీనిలో ఏమేమి ఔషధగుణాలున్నాయో తెలుసుకుందాం.

 

తులసి ఆకులను బాగా నలిపి పండ్లు తోము కుంటే పండ్లనొప్పి రాదు. దీని ఆకులను నూరి వేడి నీటితో కలిపి పుక్కిలించినా, నమిలినా నోటిపూత తగ్గుతుంది.

తులసి ఆకుల నుంచి రసం తీసి తేనెతో కలిపి తీసుకొంటే ఆకలి బాగావేయడమే కాకుండా అన్నకోశానికి శక్తినిస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.

జలుబు, రొంప ఉన్నవారు రోజూ మూడు, నాలుగుసార్లు తులసి ఆకులను 25 తీసుకొని నోటిలో వేసి, బాగా నమిలి మింగితే ఉపశమనం కలుగుతుంది.

ప్రతిరోజూ పరగడుపున తులసి రసాన్ని మంచినీటితో కలిపి తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీరం దృఢపడుతుంది. తేజస్సు పెరుగుతుంది.

ఎండిన తులసి దళాలను మెత్తగా పొడిచేసి ముఖానికి రాసుకుంటే మంచి కాంతిగా ఉండటమే కాక ముఖంపై ఉండే మచ్చలు తగ్గుతాయి.

మానసిక పెరుగుదలలేని చిన్నపిల్లలకు తులసి రసంలో తేనె కలిపి రోజూ ఇస్తే ఫలితముంటుంది.

రోజూ 10, 20 తులసి దళాలను నమిలి తింటే అలసట, మానసిక వత్తిడి తగ్గుతుంది.

తులసి దళాల్లో కొద్దిగా కర్పూరం చేర్చి నూరి కుంకుడు గింజంత మాత్రలు చేసుకొని పూటకు ఒకటి చొప్పున రోజూ మూడుపూటలా తింటే కలరా వంటి అంటువ్యాధులు దరిచేరవు .

తులసి విత్తనాలను నీళ్లలో రాత్రి నానవేసి పొద్దుటేగాని, ఉదయం నానబెట్టి రాత్రిగాని తీసు కుంటే మూలవ్యాధి తగ్గుతుంది. తులసి దళాలను ప్రతిరోజూ తినడం గానీ లేక రసాన్ని తాగడం వల్లగానీ మూలవ్యాధి బాధలు తగ్గుతాయి.

మన్ను తినే అలవాటున్న పిల్లలకు కడుపులో బల్లలు వస్తాయి. వాటిని తగ్గించాలంటే తులసి రసంలో అల్లపురసం కలిపి తేనెతో 40రోజులు తాగితే బల్లలు హరిస్తాయి.

తులసి రసాన్ని కొద్దిగా వేడిచేసి మిరియాల చూర్ణాన్ని కలిపి సేవిస్తే కడుపులో క్రిములు పోతాయి.

ఏడుమిరియాలు, ఏడు తులసి ఆకులు కలిపి నమిలి మింగితే మలేరియా జ్వరం మూడు రోజులలో తగ్గుతుందని చెబుతారు.

తులసిరసం కొబ్బరినూనె సగంసగం కలిపి కాలిన పుండ్లకు రాస్తే నొప్పి వెంటనే తగ్గుతుంది.

తులసి విత్తుల పొడిని పాలతో కలిపి చిన్నపిల్లలకు ఇస్తే వాంతులు తగ్గుతాయి.

రెండు లేక మూడు తులసి దళాలను కొద్దిగా అల్లపుముక్కవేసి మెత్తగా నూరి నొప్పి ఉన్న పంటికి రెండువైపులా పెడితే పంటినొప్పి తగ్గుతుంది.

తులసి రసంలో కర్పూరం కలిపి దాంట్లో దూదిని తడిపి పిప్పి పంటిపై పెడితే వెంటనే నొప్పి తగ్గడమే కాక పంటిలోని క్రిములు బయటకు వస్తాయి. ఇన్ని ఉపయోగాలున్న తులసి శరీరానికి ఎలాంటి దుష్ట పరిణామాలను కలుగచేయదు సరి కదా శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రకృతి సహ జంగా ఉత్తేజపరిచి వ్యాధులను పోగొడుతుంది.

ఇన్ని లాభాలుండటం వల్లనే తులసికోట పెర టిలో పెంచి పూజించుట మన హిందూ ఆచార మైంది. తులసి లక్ష్మి అవతారం కాబట్టి పూజ చేసి నప్పుడు తులసిని విష్టువుపాదాల దగ్గర ఉంచాలి కాని తలపై పెట్టకూడదు.