తప్పక రక్షిస్తాడు..

prabhu yeshu
prabhu yeshu

‘ఆ రాత్రి నిద్రపట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను (ఎస్తేరు 6:1). మనపై శత్రువ్ఞ ఎప్పుడూ దాడిచేస్తుంటాడు. అయితే మనం దేవ్ఞడిని నమ్మకంగా సేవిస్తే, దేవ్ఞడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు అనేందుకు ఎస్తేరు గ్రంథం చక్కటి ఉదాహరణ. ఈ పుస్తకంలో మొర్దెకై యూదుడు. రాజైన అహష్వేరోషు తన అధిపతులలో అందరికంటే హామాను అనే వ్యక్తి పీఠం ఎత్తుగా చేస్తాడు. దీంతో హామాను తన హోదాను బట్టి అతిశయిస్తూ వ్ఞంటాడు. మొర్దెకై హామానుకు వంగకయు, నమ స్కరించేవాడు కాడు. దీంతో హామాను ఇతనిపై పగపట్టి, ఒక్క మొర్దెకైని బట్టి మొత్తం యూదు లనందరినీ హతమార్చేందుకు ఒక శాసనాన్ని తీసుకొస్తాడు. తన అధికారహోదాను బట్టి యూదులను చంపేయాలని కుట్రపడడం మాత్రమే కాదు మొర్దెకైని ఉరితీసేందుకు 50 మూరల ఎత్తుతో ఉరికొయ్యను చేయిస్తాడు. యూదులం దరినీ హతమార్చనున్నారని రాణి అయిన ఎస్తేరు, మొర్దెకై, యూదులంతా తెలుసుకుని, ఏడుస్తారు. మూడురోజులు ఉపవాసంతో గడుపుతారు. (తప్పనిసరిగా దేవ్ఞడికి ప్రార్థించి వ్ఞంటారు) ఈ విషయం బైబిల్‌లో లేకపోయినా మనం దీన్ని గ్రహించవచ్చు. తద్వారా దేవ్ఞడే హామానును, అతని సంతతిని హతమారుస్తాడు. రాత్రి రాజుకు నిద్రపట్టకుండా దేవ్ఞడు చేశాడు. దీంతో అహష్వేరోషు రాజ్యపు సమాచార గ్రంథాన్ని తెప్పించుకుని, చదివించుకుంటాడు. అందులో రాజును ఇద్దరు ద్వారపాలకులు హతమార్చేందుకు కుట్రపడతారు. ఈ విషయం మొర్దెకైకు తెలియడం వల్ల అది ఎస్తేరు చెప్పి, రాజును కాపాడుతాడు. ఈ విషయం గ్రంథంలో లిఖించబడింది. అప్పుడు రాజు మొర్దెకై నన్ను కాపాడినందుకు ఆయనకు కానుకగా ఏమైనా ఇచ్చారా? లేక ఘనపర్చారా? అని అడుగుతాడు. అందుకు సేవకులు లేదంటారు. మొర్దెకైని ఘనపర్చడం, హామానును మొర్దెకై కోసం సిద్ధపరచిన ఉరికొయ్యపై హామానునే ఉరివేసి చంపడం చకచకా జరిగిపోతుంది. అంతేకాదు దేవ్ఞడు మొర్దెకైను ఎంతో హెచ్చిస్తాడు. యూదులందరూ దేవ్ఞడి ద్వారా కాపాడబడతారు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక్క మొర్దెకై హామానును నమస్కరించనందుకు మొత్తం యూదాజాతిని నాశనం చేయాలని హామాను కుట్రపడతాడు. కానీ యూదుల పక్షాన దేవ్ఞడే సాయం చేసి, వారిని రక్షించాడు. అంతేకాదు హామానును అతని సంతతిని హతమారుస్తాడు. యుద్ధం దేవ్ఞడిదే. మనం దేవ్ఞడిని నమ్మకంగా సేవిస్తున్నప్పుడు శత్రువ్ఞ మనపై దాడిచేసే ప్రతి సందర్భంలోను రక్షిస్తాడు.
– పి.వాణీపుష్ప
తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/