టాయిలెట్స్‌తో జాగ్రత్త

CLEANING

టాయిలెట్స్‌తో జాగ్రత్త

ఒక మనిషి సగటున సంవత్సరానికి 2500 సార్లు టా§్‌ులెట్లను ఉపయోగిస్తాడని ఒక అంచనా. అంటే దాదాపు జీవిత కాలంలో మూడు సంవత్సరాల కాలం టా§్‌ులెట్స్‌లో గడపాలన్నమాట. అలాంటప్పుడు ఆ ప్రదేశాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలో కదా! పట్టణాల్లో ముఖ్యంగా ఈ టా§్‌ులెట్ల విషయంలో బహుజాగ్రత్త అవసరం. డయేరియా, కలరా, టైఫాయిడ్‌, షిజెల్లా, పోలియో, హెపటైటిస్‌-ఎ, ఇ వంటి భయంకరమైన వ్యాధులు ప్రధానంగా ఈ టా§్‌ులెట్స్‌ అపరిశుభ్రతవల్లే వస్తాయనే విషయం ముందు ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈ విషయాలు తెలియకపోతే రోజూ నామమాత్రంగా శుభ్రపరచినా టా§్‌ులెట్స్‌ కారణంగా ఇటువంటి వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ.

టా§్‌ులెట్‌ బౌల్‌, రిమ్‌ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే కుటుంబసభ్యులందరికీ వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు విసర్జించే ఈ ప్రదేశంలో అనేక రకాల బ్యాక్టీరియాలు చేరి ఉంటాయి. వీటికి సరైన నివారణ ఎప్పటికప్పుడు అశ్రద్ధ చేయకుండా చేయకపోతే ఒకరినుండి ఒకరికి ఈ బ్యాక్టీరియాల ప్రభావం సోకే ప్రమాదం ఉంది. ఒక్కోసారి అకస్మాత్తుగా ఇంట్లో చిన్న పిల్లలకు వచ్చే అనారోగ్యాలు అంతుపట్టవు. ఇప్పటిదాకా బాగానే ఆడుకు న్నాడు, ఇంతలో ఏమైందో అని చాలా సార్లు పెద్దవాళ్ళు అయోమ యానికి లోనైతారు. అంతేకాని ఇంట్లోనే ఉన్న అపరిశుభ్రతపై దష్టి మళ్లదు. అదే కారణమని కూడా ఊహించరు. టా§్‌ులెట్స్‌ డోర్స్‌ తీసి ఉంచటం, పిల్లలు లోపలకు వెళ్లేటపుడు పట్టించుకోక పోవటం అంత మంచిదికాదు.

ఆటలాడుకునే సమయంలో ఏదైనా ఆటవస్తువు వెళ్ళి బేసిన్‌లో పడినా పిల్లలు తెచ్చేస్తుంటారు. అలాంటప్పుడు ఒక్కసారి వారి కాళ్ళకుకానీ, చేతులకు కానీ బ్యాక్టీరియా తాకితే చాలు, (మరికొద్ది సమయంలోనే పిల్లలు ఆ చేతులను నోటికి తాకించే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది) దానిప్రభావం చాలా తొందరగా ఆరోగ్యంపై కనిపిస్తుంది. నాచు కట్టినా ప్రమాదమే… టా§్‌ులెట్స్‌, బాత్‌రూమ్‌లలో నాచుపడితే రోజు రోజుకూ శుభ్రంచేద్దాంలే.. అని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు నిలయమ వుతుంది. ఎందుకంటే ఇటువంటి ప్రదేశాలు ఎప్పుడూ పరిశుభ్రంగా, ఎటువంటి జిగురు, జిడ్డు పట్టకుండా ఉండాలి.

నాచు పట్టడం, టా§్‌ులెట్‌ బౌల్‌పై గోధుమరంగు లో ఒకపొరలా పేరుకు పోవటం లాంటివి బ్యాక్టీరియాకు నిలయాలుగా మారతాయి. పైపైన అప్పుడప్పుడు స్ప్రే లాంటివి చేసినా దాని ప్రభావం బ్యాక్టీరియాను తాకదు. కారణం జిడ్డుగా, నాచు పట్టిన పైపొర బ్యాక్టీరియాకు రక్షణ కవచంగా మారటమే. అందుకని ప్రతిరోజూ ఉద యం సాయంత్రం ఈప్రదేశాల్ని పరిశుభ్రపరచుకోవాలి. దంత వైద్యులు ఏమంటున్నారు? పళ్లకు వచ్చే రోగాలకు టా§్‌ులెట్స్‌కు దగ్గర సంబంధమే ఉందని డెం టిస్టులు అంటున్నారు.

టా§్‌ులెట్‌కు కనీసం ఆరేడు అడుగుల దూరం వరకూ టూత్‌ బ్రష్‌లు పెట్టవద్దని చెబుతున్నారు. అంతేకాదు, ఆయా ప్రదేశానికి దగ్గరలో బ్రష్‌ చేయటం కూడా మంచిది కాదని అందువల్ల నోటినుంచి వచ్చే నురుగు ద్వారా అక్కడున్న బ్యాక్టీరియా శరీరంలోనికి చాలా సులువుగా ప్రవేశిస్తుందని అంటున్నారు. అయితే ముఖ్యంగా టూత్‌ బ్రష్‌ల 2వంటివి టా§్‌ులెట్స్‌కు ఎంత దూరంలో పెట్టుకుంటే అంత మంచిది. కొన్ని ముఖ్య సూచనలు ్జ క్రిమిసంహారక మందులతో ప్రతిరోజూ టా§్‌ులెట్స్‌ను శుభ్రపరచుకోవాలి. ్జ వాడిన అనంతరం ప్రతిసారీ పూర్తిగా టా§్‌ులెట్‌ను శుభ్రపరచాలి. వాలైనంత ఎక్కువ వాటర్‌ను వాడాలి. ్జ వీలైనంత మేరకు మీ టా§్‌ులెట్స్‌ను ఎక్కువ వెలుతురు ప్రసరించే విధంగా ఏర్పరచుకోవాలి. ఎప్పటికప్పుడు సాధ్యమైనంత వరకు గాలి వచ్చిపోయేలా ఉంటే చాలా వరకు చెడువాసన పోతుంది. క్రిమికీటకాలుకూడా నశిస్తాయి. టా§్‌ులెట్‌ చుట్టూ ఉన్న నేల పరిశుభ్రంగా ఉంచుకోవటమూ ముఖ్యమే, లేదంటే జారిపడే ప్రమాదం కూడా ఉంటుంది.

కాలు ఎట్టిపరిస్థితుల్లోనూ పాదరక్షలు లేకుండా టా§్‌ులెట్స్‌లో అడుగుపెట్టకూడదు. అంతేకాదు కొంతమంది కాలి మడమతో అటూ ఇటూ తోముతూ శుభ్రం చేస్తుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. టా§్‌ులెట్‌ క్లీనర్స్‌ను తప్పకుండా ఉపయోగించాలి.