టమాట షేర్వ…

TOMOTO SARUV
TOMOTO SARUV

టమాట షేర్వ…

కావలసినవి
టమాటాలు-పావ్ఞకిలో, ఉల్లిపాయలు-రెండు (పెద్దవి), అల్లంవెల్లుల్లి-ఒక టేబుల్‌స్పూన్‌, గరంమసాలా-ఒక టేబుల్‌స్పూన్‌, జీలకర్ర-అరటేబుల్‌ స్పూన్‌, ఆవాలు-ఒక టేబుల్‌స్పూన్‌, కరివే పాకు-రెండు రెబ్బలు, కారం-రెండు టేబుల్‌ స్పూన్లు, పసుపు- చిటికెడు, ఉప్పు-తగినంత నూనె-సరిపడా,

తయారుచేసే విధానం

ముందుగా టమాటాల్ని ముక్కలు కోసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కల్లో అల్లం వెల్లుల్లి ముద్ద కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టౌమీద దళసరి గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి బాగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లి వేసి బాగా వేయించుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తర్వాత టమాట గుజ్జుని కూడా వేసి వేయించుకోవాలి. తరువాత ఒక పెద్ద గ్లాసునీళ్లు పోసి మరిగించాలి. దగ్గరగా అయ్యాక దించేయాలి. ఇలా చేసిన షేర్వ బిర్యానీలోకి చాలా రుచిగా ఉంటుంది.