జలంధర బంధం

ASANALU
Jalamdha bandham

జలంధర బంధం

 

ముందుగా పద్మాసనంలో కూర్చుని రెండు చేతులను భుజముల ప్రక్కలకు మడిచి, చిటికెన వేళ్లను రెండు భుజముల మీద ఆనించి, చుబు కాన్ని ఛాతిభాగం మీదకు నొక్కుకునేట్లు చేయాలి. తర్వాత శ్వాసను బాగా తీసుకొని, ఛాతి మీద చుబుకాన్ని బాగా అదుముతూ, శ్వాసను కుంభించి ఉంచాలి. వీలైనంతసేపు శ్వాసను కుంభించి తర్వాత నిదానంగా శ్వాసను వదులుతూ యధా స్థితికి రావాలి. ఈవిధంగా కనీసం పదిసార్లు శ్వాసక్రియ జరపాలి. దీనివలన క్రమక్రమంగా ప్రాణశక్తి వృద్ధి చెందుతూ ఉంటుంది. ముక్కులోని ప్రాణనా డులు చైతన్యవంతమవ్ఞతూ ఉంటా యి. శరీరానికి విశ్రాంతి కలుగుతూ ఉంటుంది. దీనివలన కుండలినీ శక్తి మేలుకొంటుంది.