జయ జయహే మహిషాసురమర్దిని…

DASARA
DASARA

జయ జయహే మహిషాసురమర్దిని…

ప్రతి ఇంట దసరా సంతోషాలు నింపుతుంది.ఇది హిందువులకు పెద్ద పండుగ. దేశమంతటా జరుపుకునే పెద్ద పండుగ ఇది ఒక్కటే. అయితే దసరా అంటే కేవలం పది రోజుల సెలవనుకునేలా ఈ తరం పిల్లలు ఉన్నారు. దసరా అంటే ఏంటి? నవరాత్రులు ఎందుకు చేస్తారు? దీని విశిష్టత ఏమిటి అనే కొన్ని ప్రశ్నలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుని,వారికీ తెలియచేద్దాం. దసరా హిందువులకు ఏడాదికి ఒక్కసారి వచ్చే పెద్ద పండుగ, దీన్ని విజయదశమి అనికూడా అంటారు. దుష్ట శక్తులను సంహరించి జగత్తును కాపాడిన జగన్మాత విజయంగా భావిస్తారు. మరో విధంగా చెడు మీద మంచి విజయం సాధించినట్టుగా సూచిస్తుంది. ఈ పండుగ పది రోజులు జరుపుకుంటాం.

చివరి మూడు రోజులకు అంటే దుర్గాష్ఠమి, మహర్నవమి, విజయదశమికి ఒక విశిష్టత ఉంది. మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను జయించాలన్న దృష్టితో ప్రజలను చిత్రహింసలు పెడుతుండేవాడు. ఆ బాధలను తట్టుకోలేక ముల్లోకాల బాధితులు త్రిమూర్తుల వద్దకు వచ్చి తమ ఆవేదనను వెళ్లబుచ్చకున్నారు. ఈ బాధ్యతను ఆదిపరాశక్తి జగన్మాత అయిన దుర్గాదేవి తీసుకుంది. ఆ రాక్షసుడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. వెంటనే తాను తనను వివాహం చేసుకోవాలన్నట్లు సదరు రాక్షసుడికి తెలిపింది. దీంతో ఆ ముగ్ధమనోహర రూపానికి దాసుడైపోయినా రాక్షసుడు వెంటనే అంగీకరించాడు. కానీ వివాహం చేసుకోవాలంటే తనపై యుద్ధం చేసి గెలవాలని జగన్మాత షరతు పెట్టింది. అందుకు అంగీకరించిన రాక్షసుడు యుద్దానికి సిద్ధమయ్యాడు. వీరిద్దరి మధ్య తొమ్మిది రోజుల పాటు భీకరమైన యుద్ధం కొనసాగింది.

ఈ నేపథ్యంలో రోజుకొక రూపం చొప్పున తొమ్మిది అవతారాలతో పోరాడిన జగన్మాత పదవ రోజు కాళీమాతగా అవతారమెత్తి మహిషాసురున్ని సంహరించి దశమి రోజున విజయం సాధించి ముల్లోకాలను కాపాడింది. ఈ అపూర్వ విజాయానికి ప్రతీకగానే మనం ప్రతి ఏటా ఈ పదిరోజులను పండుగగా భావిస్తూ మొదటి తొమ్మ్దిరోజులు నవరాత్రులుగా దుర్గాదేవిని రోజుకొక రూపంతో అలంకరించి పదవరోజు అంటే దశమి రోజున విజయదశమిగా జరుపుకుంటున్నాం. ఇది దక్షిణాదిన తెలసిన కథ. ఇకపోతే ఉత్తరాదివారు రావణాసురుడిని శ్రీరాముడు తొమ్మిదిరోజులు యుద్ధం సాగించి దశకంఠుడిని దశమి నాడు సంహరించడం వలన విజయదశమిగా భావిస్తారు. అక్కడ విజయదశమి కన్నా దసరా అనే పేరుతో పిలుస్తుంటారు.

ఇందుకు కారణం దసరాను సంస్కృతంలో దశ – హర అంటే దశ అంటే పది హర అంటే సంహరించడం అనేఅర్థం. విజయ దశమిని దసరాగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగను మన దేశంతోపాటు నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో కూడా హిందువులు ఈ పదిరోజుల్లో ప్రతి ఒక్కరు వారి పొరుగిళ్లకు వెళ్లి వారి ఆనవాయితీ ప్రకారం బహుమతులను, మిఠాయిలు, తాంబూలాలు, ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. మరికొన్ని ప్రాంతాలలో ఆ సమయంలో పండే పంటతో అమ్మవారిని పూజించి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. హిందువుల్లో కుంకుమకు ఒక ప్రత్యేకత ఉంది. కుంకుమ రంగు ఎరుపు. ఎరుపును శుభానికి, విజయానికి చిహ్నంగా భావిస్తుంటారు. అందుకనే స్త్రీలు నుదుటకు, పాపిట స్థానాల్లో ధరిస్తుంటారు. విజయానికి గుర్తుగా భావించేవారు విజయదశమి రోజున ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ తమ అవసరాలకు అనుగుణంగా వాహన పూజ, వస్తు పూజ, ఆయుధ పూజ చేసుకుంటుంటారు. ఆయుధ పూజకు ఒక చరిత్ర ఉంది. పూర్వం ద్వాపర యుగంలో పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమయ్యే ముందు వారు విజయం సాధించడానికి తమ ఆయుధాలను విజయదశమి రోజున దుర్గాదేవిని ఆరాధిస్తూ ఆయుధపూజ చేస్తారు.

చివరికి యుద్ధం గెలిచివిజయం సాధిస్తారు. అదే నమ్మకంతో మన హిందువులు ఏ పనిలోనైనా విజయం సాధించాలని వాహనాలను ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షిత్తంగా ఉండాలని ప్రారంభించే వ్యాపామైనా విజయవంతంగా కొనాసాగాలని కోరుకుంటారు.

దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్‌ లో విజయవాడ కనకదుర్గ ఆలయం చాలా ప్రసిధ్ధిచెందింది.దసరాకు దక్షిణాది వాళ్ళు ఈ ఆలయంలోని అమ్మవారిని ప్రత్యక్ష జగన్మాతగా భావిస్తుంటారు. అందుకనే ఇక్కడున్న అమ్మవారిని ఈ నవరాత్రుల్లో తోమ్మిది రూపాల్లో అలంకరిస్తూ, నైవేద్యాలను నివేదిస్తుంటారు.అధిక సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కులను సమర్పించుకొని అమ్మవారిని దర్శించుకుంటారు.అమ్మవారిని ఈ తొమ్మిది రోజుల అలంకరణ, నైవేద్యం చి స్వర్ణకవచాలంకృత దుర్గాదేవికి వడపప్పు,పాయసం చి బ్రహ్మచారిని నవదుర్గ-బాలత్రిపురసుందరిగా పూజిస్తూ బూందీనివేదిస్తారు. చి చంద్రఘంట నవదుర్గ-గాయత్రిదేవిగా,రవ్వకేసరి,పులిహోర చి కూష్మండ నవదుర్గ-అన్నపూర్ణదేవిగా అలంకరించి పొంగలి చి స్కందమాత నవదుర్గ-లలిత త్రిపురసుందరీదేవిగా అలంకారం,పులిహోర,పెసరబూరెలు చి కాలరాత్రిమాత-సరస్వతిదేవి అటుకులు,బెల్లం,శనగపప్పు,కొబ్బరి చి మహాగౌరి నవదుర్గ-శ్రీదుర్గాదేవి వడలు,నిమ్మరసం చి సిద్దిధాత్రి నవదుర్గ-మహిషాసురమర్ధిని చక్కెరపొంగలి చి దుర్గాదేవి-రాజరాజేశ్వరిదేవి పులిహొర,గారెలు ఈ విధంగా నైవేద్యాలన్నీ ఆయా ఆలయాల ఆగమశాస్త్రం,సంప్రదాయాల ప్రకారం,నక్షత్రం,తిధి,సంవత్సరాన్ని బట్టి జరుపుతారు.

– అవసరాల మీనాక్షి