ఛాతీ రుగ్మతలపై కంగారెందుకు

Tension
Tension

ఛాతీ రుగ్మతలపై కంగారెందుకు

వయసు భేదం లేకుండా హఠాత్తుగా ముంచుకు వచ్చే అనారోగ్య సమస్యలు ఎక్కువవ్ఞతున్న రోజులివి. అందులో హృద్రోగ సమస్యలు మరింత ముంచుకువస్తున్నాయి. దీంతో ఛాతీలో మంట పుడితే ఇది గుండెనొప్పి కావచ్చుననే సందేహాలతో సతమతమయ్యే వారూ ఎక్కువగానే ఉన్నారు. ఈ రెంటికీ తేడా తెలియక గాభరాతో ఇసిజి చేయించుకునే వారూ ఉన్నారు.

ఈ బిజీలైఫ్‌లో ఒత్తిడి చాలా ఉంటోంది. దీనివల్ల వచ్చేదే ఛాతీలో మంట. దీనికి సంబంధించి పూర్తిగా తెలిస్తే తగ్గించుకోవడం పెద్ద సమస్య కాదు. దీనికోసం కంగారుపడి డాక్టరు దగ్గరకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఇంట్లోనే అందుబాటులో ఉండే వస్తువ్ఞలతోనే ఛాతిలో మంటను తగ్గించుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కింద ఇచ్చిన చిట్కాలలో ఏదైనా ఒకటి లేదా కొన్ని పద్ధతులైనా ఉపయోగించి చూడండి. అప్పటికీ తగ్గకపోతే డాక్టరును సంప్రదించాలని నిపుణులు అంటున్నారు.

బాదంపప్పు గుండెలో మంటను తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని బాదంపప్పులు తిని చూడండి. ఇవేకాకుండా ఇంట్లో అందుబాటులో ఉండే నిమ్మకాయను చిన్నచిన్న ముక్కలుగా చేసి చిటికెడు ఉప్పుతో వాటిని తీసుకోండి. పై రెండు పద్ధతులు గుండెల్లో మంటను తగ్గించడానికి చాలావరకు దోహదం చేస్తాయి.

కొన్ని పుదీనా ఆకులను కప్పునీటిలో నానబెట్టి భోజనం అనంతరం ఈ నీటిని తీసుకోండి. క్రమం తప్పకుండా కొన్ని రోజులు తీసుకున్నట్లయితే గుండెల్లో మంట తగ్గే అవకాశం ఉంది.

భోజనం చేసిన వెంటనే చిన్న బెల్లం ముక్కను బుగ్గలో ఉంచుకొని నెమ్మదిగా ఆ రసాన్ని మింగాలి. కడుపులో ఎసిడిటీని తగ్గించడానికి ఇది దోహదం చేస్తుంది. ్య రోజుకో అరటిపండు తిన్నా కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఎసిడిటీని తగ్గించే శక్తి అరటిపండుకి ఉంది. ్య రెండు స్పూన్ల నేచురల్‌ ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌, అంటే పరిమాణంలో నీటిని కలిపి భోజనానికి ముందు తీసుకోవాలి.

తులసిచెట్టు ఉండని ఇల్లంటూ ఉండదు. భోజనం అనంతరం కొన్ని తులసి ఆకులు నమిలి మింగాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్నిరోజులు చేసినట్టయితే ఎసిడిటీ, గుండెల్లో మంట తగ్గే అవకాశం ఉంది.

రోజుకి నాలుగైదు సార్లు కొబ్బరినీరు తీసు కున్నా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

కప్పు నీటిలో సోంపుగింజలు వేసి ఉడికించి రాత్రంతా వాటిని అలాగే ఉంచి, తెల్లవారి గింజలను వడకట్టి ముఖం కడుక్కున్న వెంటనే ఆ నీటిని తేనెతో కలిపి తీసుకోవాలి. ఎసిడిటీని తగ్గించుకోవడానికి ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.

గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ వేసి ముఖం కడుక్కున వెంటనే పరగడుపున తీసుకుంటే అనుకున్న ఫలితాన్ని త్వరితగతిన పొందవచ్చు. ్య మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం చేసిన వెంటనే ఓ ఐదు లేదా పదినిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలి. ఈవిధంగా చేయడం వలన తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి దోహదపడడమే కాకుండా ఎసిడిటీని తగ్గిస్తుంది.

గుండెల్లో లేదా కడుపులో మంట అనిపించిన వెంటనే ఈవిధంగా చేసి చూడండి. కొద్దిగా ఉప్పు, మరికొద్దిగా చక్కెర కలిపి తినండి. ్య ఆహారంలో ఫైబర్‌ అధికంగా తీసుకోవడం వలన జీర్ణశక్తి పెరుగుదలతో పాటు, ఎసిడిటీని గ్యాస్‌ను అరికడుతుంది.

కడుపులో లేదా ఛాతిలో బాగా మంటగా ఉన్నప్పుడు కొన్ని కిస్మిస్‌లను నోటిలో వేసుకొని నమలకుండా వాటి రసాన్ని మింగాలి. వెంటనే పై బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ్య బ్రకోలీ పచ్చిది తింటే కడుపులో మంట, ఎసిడిటీ నుంచి త్వరితగతిని ఉపశమనం పొందవచ్చు.

అరచేతిలో కొద్దిగా జీలకర్ర వేసుకొని మరోచేత్తో దానిని తేలికగా నలిపి నోట్లో వేసుకుని నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇది కడుపులో లేదా ఛాతిలో మంటను త్వరితగతిన తగ్గిస్తుంది. ్య చూయింగ్‌ గమ్‌ నమలడం ద్వారా ఎసిడిటి తగ్గే అవకాశాలున్నాయి.

ఎసిడిటితో బాధపడేవారు ఒకేసారి పెద్ద భోజనం కాకుండా నాలుగైదుసార్లు ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోవాలి. పొట్టను ఖాళీగా ఉంచకూడదు. అలాగే వేపుడుకూరలు, మసాలా పదార్థాలకు దూరండా ఉండాలి.