చెలి కానుక

Cooking-1

చెలి కానుక

పకోడీల పిండిలో కొద్దిగా పెరుగు కలిపితే పకోడీలు మృదువ్ఞగా వస్తాయి. బ్రడ్‌ స్లయిసెస్‌ మాడినప్పుడు రెండు స్లయిసెస్‌ని కలిపి రుద్దితే మాడిన భాగం రాలిపోతుంది. ఎండిన పూరీలని మరోసారి నూనెలో వేయిస్తే అవి తాజాగా అవ్ఞతాయి. బ్రెడ్‌ ఎండిపోయిన లేదా టోస్ట్‌ మిగిలిపోయినా దాంతో, ఓ తమాషా వంటకం క్షణాల్లో చేయొచ్చు.

ఉల్లిపాయ, టమాట, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయించి ఆ బ్రెడ్‌ ముక్కల్ని అందులో వేయించి దింపి పైన కొద్దిగా మసాలాపొడి, కొత్తిమీర చల్లి తినొచ్చు. అనుకోని అతిథులు వచ్చినపుడు పై వంటకాన్ని వాళ్లకోసం చేయవచ్చు. ్జ పళ్లతో జామ్‌ జెల్లీలని చేసేప్పుడు ఆ పండ్లని ఉడకపెట్టే, నీళ్లలో కొద్దిగా నిమ్మరసం పిండితే త్వరగా జామ్‌సెట్‌ అవుతుంది.