చెలి కానుక

TULASI
TULASI

చెలి కానుక

ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఉప్పుని కలిపి పుక్కిలిస్తే మౌత్‌వాష్‌గా పనిచేయడమే కాకుండా నోటి దుర్వాసన తగ్గుతుంది
తులసి ఆకులను నలిపి ముక్కు దగ్గరగా పెట్టి గట్టిగా ఆ వాసనను పీల్చితే జలుబు తగ్గుతుంది.

సాల్ట్‌ డబ్బాలో పది బియ్యపు గింజలు వేస్తే అది గడ్డకట్టకుండా పొడిగా రాలుతుంది.

వేడిఎక్కువై తలనొప్పిగా ఉంటే కొంచెం కొబ్బరి నూనెలో రెండు చుక్కలు చల్లని నీళ్లు పోసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మాడుపై మసాజ్‌ చేస్తే వేడి తగ్గి నొప్పి త్వరగా తగ్గుతుంది.

అన్నం ముద్దవకుండా ఉండాలంటే తడిబియ్యంపైన కొద్దిగా నిమ్మరసం పిండి, తర్వాత నీళ్లుపోసి వండితే పొడిపొడిగా ఉడుకుతుంది.
పూరీపిండిలో కొద్దిగా బొంబాయి రవ్వ, రెండు చెంచాల మైదా కలిపి చేస్తే పూరీలు మంచి రుచి గా ఉంటాయి.