చూడచక్కని ముఖం

happy girl
happy girl


ఒక కప్పు ద్రాక్షపండ్లను గుజ్జులా చేయాలి. అందులో కొన్ని చుక్కల నిమ్మరసం చేర్చి శరీరానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. నిమ్మ సహజ క్లెన్సర్‌లా పనిచేస్తుంది. ద్రాక్ష పొడిబారిన చర్మాన్ని మృదువ్ఞగా చేస్తుంది. నిద్రించే మందు పావ్ఞకప్పు తేనెలో చెంచా కొబ్బరినూనె, మూడు చుక్కల నిమ్మరసం వేసి చర్మంపై రాసుకోవాలి. మరునాడు గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది మాయిశ్చరైజర్‌లా పనిచేసి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఒక కప్పు పుదీనాఆకులు, అయిదు బాదం పలుకులను కలిపి మెత్తగా నూరాలి. దీనికి అరస్పూన్‌ పసుపు చేర్చి చర్మానికి రాసుకుంటే గరుకైన చర్మం మృదువ్ఞగా మారుతుంది. ౖ ఎండపెట్టి పొడిచేసిన కరివేపాకును ముల్తానిమట్టితో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్‌ చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు మొటిమలు, మచ్చలు వంటి వాటిని తొలగిస్తుంది. స్నానం చేయడానికి ముందు శనగపిండిలో కొంచెం పెరుగు కలిపి నలుగుపెట్టుకోవాలి. అది మృతకణాలను తొలగించి చర్మం పొడబారకుండా చేస్తుంది. ౖ ముఖం తాజాగా ఉండాలంటే ఒక కేరట్‌ గుజ్జుకు చెంచా వెన్న కలిపి రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొన్ని వారాలలో మంచి ఫలితం కనిపిస్తుంది. ౖ అరచెంచా చక్కెర, ఉప్పు, చెంచా తేనె, ఆలివ్‌ నూనె వీటిని కలిపి వీపుమీద మర్దనా చేయాలి. ఇలా చేస్తే మృతకణాలు వెంటనే మాయమవుతాయి.