చుండ్రు విరుగుడు ఇలా

dandruff-cropped
ఈ కాలంలో చుండ్రుకు అవకాశాలు ఎక్కువ. ఈ కారణంగా జుట్టు ఎక్కువ శాతం రాలిపోతుంటుంది. జుట్టు ఈ వాతావరణానికి పేలవంగా, రఫ్‌గానూ తయారవుతుంది. తేలికపాటి షాంపూలు కొద్దిగా మాత్రమే ఉపయోగించాలి. కఠినమైన షాంపూలు శిరోజాల్లోని సహజమైన నూనెల్ని హరించి వేస్తాయి. అలాగే బాగా వేడినీటిని తలపై పోసుకోకూడదు. షాంపూ చేసుకున్న తర్వాత కండీషనర్‌ అప్లయిచేయాలి. లేదా కండీషనర్‌ కలిసి ఉన్న షాంపూను ఎంచుకోవాలి. హెయిర్‌ డ్రయర్‌ను జుట్టుకు కనీసం పది అంగుళాల దూరంలో ఉండాలి. అసలు వాడకుండా ఉంటే ఇంకా మంచిది. వారానికి రెండుసార్లు తలకు నూనె పెట్టుకుని, ఆ నూనెను రాత్రంతా అలా ఉంచేయాలి. వారానికి రెండు సార్లు పెరుగు లేదా గుడ్డులోని పచ్చసొన పొడి జుట్టుకు అప్లయి చేస్తే కేశాలు మృదువుగా ఉంటాయి. కొబ్బరినూనె, నువ్వులు లేదా ఆలివ్‌ ఆయిల్‌ కలిపి వేడిచేసి మాడుకు, శిరోజాలకు పట్టించి వేడినీటిలో ముంచిన టవల్‌ తలకు చుట్టుకోవాలి. ఐదు నిమిషాలుంచి, మరోమారు టవల్‌ను వేడినీటిలో ముంచి చుట్టుకుని కొద్దినిమాషాలు ఉంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా మాడు నూనెను బాగా గ్రహిస్తుంది. పొడిగా, పేలవంగా జుట్టు ఉన్నట్లయితే ఒక కప్పు తేనె, అరకప్పు ఆలివ్‌ ఆయిల్‌ లేదా నువ్వుల నూనె, రెండు టేబుల్‌ స్పూన్లు నిమ్మరసం కలిపి ఓ రాత్రంతగా ఉంచేసి కొద్దిగా తీసుకుని తలకు మసాజ్‌ చేయాలి. వేడి టవల్‌ చుట్టుకుని కొద్దిసేపు షాంపూ చేసుకోవాలి. జుట్టు పొడిగా దెబ్బతిని ఉన్నట్లయితే ఒక టీ స్పూన్‌ ఆముదం, రెండు స్పూన్లు స్వచ్ఛమైన ఆలివ్‌ ఆయిల్‌ లేదా కొబ్బరి నూనెను కలిపి మసాజ్‌ చేసుకుని వేడి నీటి టవల్‌ చుట్టి ఆ పై స్నానం చేయాలి.