చిన్నారుల చింతను దూరం చేయాలంటే?

BABY1
BABY1

చిన్నారుల చింతను దూరం చేయాలంటే?

ప్రపంచంలోకి కొత్తగా అడుగిడిన పసిప్రాణానికి అమ్మే ఓ పెద్ద ప్రపంచం. అమ్మఒడే వారికి సర్వస్వం. అమ్మ చేతి స్పర్శ ఓ గొప్ప ఔషధం. అలాంటి అమ్మకు ఆ పసికూనలు దూరంగా ఉండవలసి వస్తే… ఒకే గుండెచప్పుడు కలిగిన ఆ రెండు ప్రాణాల మధ్య చిన్న ఎడబాటు తప్పని సరైతే… అమ్మ మనసైతే అందరికీ తెలిసిందే కానీ ఆ పసి మనసు ఎంత బాధపడుతుందో, ఆప్రభావం వారిపై ఎంత తీవ్రంగా ఉంటుందో, దాన్ని ఎలా తగ్గించాలో…ప్రతి అమ్మ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు- పుట్టిన పిల్లలకు దాదాపు ఆరునెలల వరకూ అమ్మతోనే జీవితం.

ఆ తరువాత నెమ్మదిగా తన పనులరీత్యా, ఉద్యోగ రీత్యా అమ్మ బయటకు వెళ్లడంతో కొంత సమయం విడిగా ఉండటం పసి వాళ్లకు కొత్త అనుభవంగా తోస్తుంది. ఉద్యోగాలు చేసే తల్లులకు తమ నెలల పాపలను వదిలి బయటకు వెళ్లటం ఒక తప్పనిసరి పరిస్థితి. ఇలాంటి సమయంలోనే పిల్లల ప్రవర్తన ఒక్కో సారి చాలా ఇబ్బందులకు భయానికి గురిచేస్తుంది. గుక్కపెట్టి గంటల తరబడి ఏడవటం, డాక్టరు దగ్గరకు తీసుకువెళితే అంతా బాగానే ఉంది అనటం, తీరా అమ్మ దగ్గరకు చేరిన తరువాత చక్కగా నిద్రలోకి జారుకోవటం అంతా విచిత్రంగా అనిపిస్తుంటుంది. అవగాహన ఏర్పరచుకోవాలి రోజులో ఎంతో కొంత సమయం పసిపిల్లల్ని విడిచి గడపాల్సి రావటం ఈరోజుల్లో చాలామంది తల్లులకు తప్పని సరి అయిపోయింది.

అయితే ఇలాంటపుడు, వాళ్లకు దూరంగా గడపడానికి ముందే తమ పాపాయి గురించిన కొన్ని అంశాలు తల్లి బాగా గమనించాలి. బాగా ఏడుస్తుందా, ఎప్పుడూ డల్‌గా కనబడుతుందా, ఎక్కువ సమయం ఆపకుండా ఏడుస్తుందా, ఆడిస్తే త్వరగా ఆటల్లో పడి కేరింతలు కొడుతుందా- ఇవన్నీ తల్లికి అవగాహన ఉండాల్సిన విషయాలు. ఇవన్నీ దష్టిలో ఉంచుకుని, ఒకటి రెండు రోజులు నెమ్మదిగా వారికి కనిపించకుండా కొంత సమయం ఉండటం లాంటివి చేసి చూడాలి.

ఆ సమయంలో పసివాళ్ల ప్రవర్తన ఏవిధంగా ఉంటుందో అర్థమైపోతుంది. దాన్ని బట్టి వారిని ఎవరికి దగ్గరగా ఉంచాలి, ఎలాంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వారి ఏడుపును ఆపడానికి ఏ ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాలపై ఒక చక్కని ప్రణాళిక రూపొందించుకోవాలి. రోజూ అచ్చి బుచ్చి అంటూ ఎక్కడికీ కదలకుండా కబుర్లాడి ఒక్కసారిగా కనిపించకుండా మీ పనిమీద మీరు వెళ్ళిపోతే అక్కడ ఎంతమందిని కాపలా పెట్టినా మీరు దూరమైన లోటు పసివాళ్లకు పెద్ద బాధనే మిగుల్చుతుంది. పైగా అకస్మాత్తుగా వచ్చిన మార్పు వారి మానసిక స్థాయిమీద కూడా ప్రభావం చూపుతుంది. బాగా అలవాటైన మనిషి ఒక్కసారిగా ఏదైనా ప్రయాణంపై వెళితే ఇంత లోకం తెలిసిన మనకే ఏదో వెలితిగా ఉంటుంది. ఒక్కోసారి ఆ లోటును భరించలేము కూడా. మరి అమ్మ తప్ప వేరేలోకమే అప్పటివరకు ఎరుగని, అప్పు డప్పుడే కాస్త మనుషుల్ని గుర్తుపట్టే దిశగా బుడిబుడి అడుగులు వేస్తున్న ఆ చిన్ని మన సులకు ఒక్కసారిగా అమ్మే కనిపించ కుంటే ఎంత వెలితి అనిపిస్తుంది.

ఆ… పసివాడికేం తెలు స్తుందిలే! అంటారు చాలామంది. ఏం తెలియదు కాబట్టే చిక్కంతా. అందుకే మరికొన్ని రోజుల్లో మీరు పాపాయిని ఇంటిదగ్గర వదలి వెళుతున్నారనగా, లేదా ఎవరి దగ్గరైనా ఉంచాలను కుంటున్నా ముందు నుంచే వారికి కొంతదూరాన్ని అలవాటు కానివ్వాలి. కొంత సమయం మిగతా ప్రపంచంతో కూడా ఆడుకో నివ్వాలి. ఎవరికి దగ్గరగా ఉండబోతున్నారో వారికి ఆ పసివాళ్లను దగ్గర చేయాలి. వాళ్లు ఏడ్చినపుడు పరిగెత్తుకెళ్ళి ఎత్తుకొని ముద్దాడే మీరు…ఆ పసిపాపాయిని మీరు ఎవరిదగ్గర వదిలి వెళ్లాలను కుంటున్నారో వారితో చేయించి ఏడుపు ఆపు తున్నారా లేదా గమనించాలి. ఆరునెలల వయసు రాగానే పిల్లల్ని అప్పుడప్పుడూ బేబీ సిట్టర్‌లో కూర్చోబెట్టడం చేయండి. అలా చేయడం పిల్లలకు విడిగా ఉండటంపై అనుభవాన్ని నేర్పినట్టే అవుతుంది. ్య సంవత్సరం వయసు దాటిన దగ్గరనుంచి చిన్న చిన్న ఆటలు వారికి నేర్పించండి. వారంతట వారే చాలా సమయం మిమ్మల్ని మరచి ఆడుకోవడానికి ఇది దోహదపడుతుంది. ్య మూడు నాలుగు సంవత్సరాల వయసులో స్కూలు వాతావరణానికి ముందర నేర్చుకునే విషయాలు వారికి పరిచయం చేయండి. కొత్త వ్యక్తులను పరిచయం చేసి వారితో కలిసిపోయే అలవాటుకు దగ్గరచేయండి. కాస్త తెలిసే వయసు వచ్చి, చెబితే వినే జ్ఞానం అబ్బిన తరువాత ఎందుకు ఆ కాస్త సమయం వారికి దూరంగా ఉంటున్నారో చిన్ని బుర్రలకు అర్థమయ్యేలా చెప్పాలి.