చికెన్‌ కుతుబ్‌షాహి

CHIKENFFFFFfffff

చికెన్‌ కుతుబ్‌షాహి

కావలసినవి:
చికెన్‌-కిలో, అల్లంవెల్లుల్లి-ఒక టేబుల్‌స్పూన్‌, ఉల్లిముద్ద-అరకిలో, కారం-ఒక టేబుల్‌స్పూన్‌, మిరియాలపొడి-ఒక టేబుల్‌స్పూన్‌, గరంమసాలా-అర టేబుల్‌స్పూన్‌, కొత్తిమీర-కట్ట, పుదీనా-కట్ట, కోవా-50గ్రా, పలావు-రెండు పచ్చిమిర్చి-8, పెరుగు-100మి.లీ., ఉప్పు-రుచికి సరిపడా నూనె-అరకప్పు.

 

తయారుచేసే విధానం
చికెన్‌ ముక్కల్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి సుమారు 20 నిమిషాల పాటు ఉడికించాలి. బాణలిలో నూనె వేసి కాగాక పలావ్ఞ ఆకులు, ఉల్లిముద్ద, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత కారం, మిరియా లపొడి, కోవా వేసి పదినిముషాలు వేయిం చాలి. ఇప్పుడు ఉడికించిన చికెన్‌ ముక్కలు, గరంమసాలా, పచ్చిమిర్చి, పెరుగు వేసి సుమారు 20 నిమిషాలు పాటు సిమ్‌లో ఉడికించాలి. తరువాత కొత్తిమీర, పుదీనా ఆకులు చల్లి దించాలి.