చట్టపరిధిలో ప్రత్యామ్నాయం ఎంచుకోండి

sad lady
sad lady

ఒకప్పుడు అత్తలంటే కోడళ్లకు భయం. ఇప్పుడు కోడళ్లు అంటే అత్తలకు హడల్‌. అత్తల వేధింపులు తగ్గిపోయి కోడళ్ల సాధింపులు పెరిగిపోతున్నాయి. కట్నం కోసం కోడళ్లను కిరోసిన్‌ పోసి తగలపెట్టే అత్తలు ఎక్కడా కనిపించడం లేదు. విడాకులు, ఆస్తుల కోసం అత్తమామలపై కేసులు పెట్టి కోర్టుల కీడ్చే కోడళ్ల సంఖ్య పెరిగిపోతున్నది. మన సమాజంలో కనీసం పదిశాతం కుటుంబాలలో కోడళ్ల సమస్య ఉందని నా భావన. శోభనం రాత్రి నుంచే సమస్యలు సృష్టించేవారు కొందరైతే, ఏడాది తిరక్కుండానే విడాకులు అడిగే వారు మరికొందరు. ఏదో ఒక కారణంతో వివాహబంధాన్ని విచ్చిన్నం చేసుకుని ఉత్తిపుణ్యానికి అత్తమామల్ని కోర్టులకీడ్చుతున్నారు. ‘అరటిఆకు ముల్లువిూదపడినా, ముల్లు అరటాకుపై పడినా చిరిగేది అరటాకే అన్నది గతించిన సామెత. కోడలు కొడుకును తిట్టినా, కొడుకు కోడలితో గొడవపడినా, తల్లిదండ్రులకే నష్టం జరుగుతున్నది. పిల్లలకు పెళ్లిళ్లు చేసి, మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ శేషజీవితం గడపాలనుకోవడం అడియాసగా మారుతున్నది. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న కోడల్ని తెచ్చుకున్న మేం వృద్ధాప్యంలో కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. చికిత్సకు సమ్మతించని, సంసారానికి ఇష్టపడని, విడాకులు ఇవ్వని కోడలిని మార్చలేక సతమతమవ్ఞతున్నాం. కూతురిదే తప్పని తెలిసినా మా వియ్యపువారు ఆస్తికోసం అడ్డంగా వాదిస్తున్నారు. ముదిరిపోతున్న మా అబ్బాయి జీవితం అడవికాసిన వెన్నెలలా మారిపోతున్నది. నేను సాధారణ గృహణిని. నా వయస్సు 60 ఏళ్లు. మా వారు ప్రభుత్వం ఉద్యోగం చేసి పదవీవివరణ చేశారు. ఇద్దరం మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చాం. మావారికి వచ్చే జీతం పొదుపుగా ఖర్చుపెట్టుకుని ఓ ఇల్లు కట్టుకున్నాం. ఉన్న ఒక కొడుకుని ఎం.టెక్‌ వరకు చదివించాం. అతను బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు అతని వయసు 35 సంవత్సరాలు. మూడేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన ఒక అమ్మాయితో వివాహం జరిపించాం. వారు అంతగా ఉన్నవారు కాకపోవడంతో మేమే 10 లక్షలు ఖర్చుపెట్టి పెళ్లిచేశాం. తొలిరాత్రే ఆమె భర్తతో గొడవపెట్టుకున్నది. భర్తంటే తనకు ఇష్టం లేదని, పెద్దవారి బలవంతంపై పెళ్లి చేసుకున్నానని చెప్పింది. శోభనానికి ఏమాత్రం సహకరించలేదు. కొత్త కాబట్టి భయపడుతున్నదని, నెమ్మదిగా మారుతుందని మా అబ్బాయి సరిపెట్టుకున్నాడు. అయితే మూడురోజుల తర్వాత పుట్టింటికి వెళ్లిన ఆమె మా అబ్బాయిపైనే నిందలు మోపింది. అతను సంసారానికి పనికిరాడని అబద్దం చెప్పింది. రెండువైపుల వాదనలు, చర్చలు, మధ్యవర్తిత్వాలు జరుగుతూనే రోజులు గడిచిపోయాయి. ఏడాది తర్వాత మేమే ఒక సైకాలజిస్టును వారింటికి తీసుకెళ్లాం. అతను ఆమె ప్రవర్తనను గమనించి తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నదని గుర్తించారు. ఆమెలో ఓసిడి, స్కిజోఫ్రెనియా లక్షణాలు ఉన్నాయని, సైకియాట్రిస్టు ద్వారా చికిత్స చేయించమని సూచించారు. మా కోడలికి అతిశుభ్రం, అతిజాగ్రత్త, భ్రమలు, భ్రాంతులు ఉన్నాయి. ఆమె ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గువేసి, ఆ తడి ఆరేందుకు టేబుల్‌ ఫ్యాన్‌ పెడుతుంది. ఎప్పుడు కడిగిందే కడిగి, తుడిచిందే తుడుస్తూ, పూజలు చేస్తూ ఉంటుంది. కొత్తవారిని ముట్టుకుంటే మైల అంటూ స్నానం చేస్తుంది. లేనివి ఉన్నట్టు, జరగనివి జరిగినట్టు భ్రమ పడుతుంది. తనకు భర్త, అత్తమామలే హాని చేస్తారని అనుమానిస్తుంది. ఈనేపధ్యంలో చికిత్స చేయించక తప్పదంటే అందుకు సమ్మతించలేదు. భర్తతో కలసి వ్ఞండమంటే కాదన్నది. అయితే విడాకులు ఇమ్మంటే ఆమె తల్లిదండ్రులు ఆస్తిలో సగభాగం అడుగుతున్నారు. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదని, కాపురానికి రమ్మని కోర్టులో కేసు వేశాం. కోర్టులో మాపైనే ప్రత్యారోపణలు చేసి, వాయిదాలకు రాకుండా తిరుగుతున్నారు. ఈ నేపధ్యంలో ఏం చేయాలో మంచి సలహా చెప్పండి.

  • కృష్ణవేణి, చిత్తూరు

అమ్మా, విూరు చెప్పిన కొన్ని సమస్యలు సమాజంలో కనిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రి33తం గృహహింస చట్టం కింద భర్త, అత్తమామలు, ఆడపడచులు, బంధువ్ఞలందరిపై కేసులు పెట్టేవారు. అప్పుడు చట్టం కఠినంగా ఉన్నందున అందరిని అరెస్టులు చేసి రిమాండుకు పంపేవారు. విదేశాలలో ఉన్నవారిపైన కూడా కేసులు పెట్టి పీడించేవారు. ఈ చట్టం బాగా దుర్వినియోగం అవ్ఞతున్నదని గుర్తించిన సుప్రీంకోర్టు సరళీకరించింది. ఇప్పుడు ముందులాగా అరెస్టులు జరగవ్ఞ. కౌన్సెలింగ్‌ చేసి సున్నితంగా పరిష్కరిస్తున్నారు. దాదాపుగా గృహహింస కేసు సివిల్‌ కేసులా మారిపోయింది. అయినా విూకు అలాంటి సమస్య లేదు. విూరే కోడలు కాపురానికి రావాలని కోర్టు ద్వారా అడుగుతున్నారు. ఆమె డబ్బు కోసం, కోర్టు వాయిదాలకు రాకుండా ఆలస్యం చేస్టున్నట్టు అంటున్నారు. అలా వాయిదాలకు రాకుండా ఎగ్గొడితే ‘ఎక్స్‌పార్టీ డిక్రీని విూకు అనుకూలంగా ఇస్తారు. అయినా ఆమె కాపురానికి రాకపోతే మళ్లీ కోర్టు చుట్టూ తిరగాలి. కాబట్టి ఆమె తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నందున చికిత్సకు సహకరించాలని, లేదంటే విడాకులు మంజూరు చేయమని కోర్టుకు విన్నవించండి. ఏదిఏమైనా కోర్టు తీర్పులు రావడానికి సంవత్సరాలు పడుతుంది. కాబట్టి కోర్టు పరిధిలో ‘విూడియేషన్‌ కేంద్రం ద్వారా మధ్యవర్తిత్వం నిర్వహించి రాజీపడి విడాకులు తీసుకుంటే మంచిది. దానికి వారు సమ్మతించకపోతే అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించి చట్టబద్ధంగా విడాకులు తీసుకుని విూ అబ్బాయికి మరో పెళ్లి చేయండి. ఆలస్యం జరుగుతుందని భావిస్తే, విూ న్యాయవాదిని సంప్రదించి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించండి. ఇప్పుడు మన చట్టాలలో చాలా మార్పులు వచ్చాయి. సహజీవనం, వివాహేతర బంధాలు తప్పు కాదంటున్నాయి. అయితే విడాకులు తీసుకోకుండా మరొక వివాహం చేసుకోవడం మాత్రం నేరమౌతుంది. మన చట్టాలలో చాలా లొసుగులు, తప్పించుకునే మార్గాలు ఉన్నాయి. వీటివల్ల రకరకాల సౌలభ్యాలు, సమస్యలు ఉన్నాయి. కాబట్టి అధైర్యపడకుండా, చట్టం, న్యాయం, ధర్మం పరిధిలో సరైన ప్రత్యామ్నాయమార్గం ఎంచుకోండి. అందుకు న్యాయవాది సలహా తీసుకోండి.

  • డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు