గెలుపు పాఠం నేర్పే ఓటమి

lady
Thinking

గెలుపు పాఠం నేర్పే ఓటమి

జీవితంలోనూ ‘పోరు తప్పనిసరి. ‘ఓటమి పాలవ్వాలని ఎవ్వరూ కోరుకోరు. గెలుపుపై ఉన్న ఆశ ‘పోరుకు దారి తీస్తుంది. శక్తియుక్తి ప్రధాన భూమికలుగా ఉండి విజయాన్ని వరించేటట్లుగా చేస్తాయి. మరి మీ ఓటమే గెలుపుకునాందని, దాని నుండి మీరు నేర్చుకోవాల్సిన విషయాలేమిటో, ఆత్మవిశ్వాసం ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. విశ్లేషించుకుంటే నూరేళ్ల జీవితంలో బాల్యం, కౌమార్యం, యవ్వనం, వృద్ధాప్యం దశలు పోరాటమయాలే. లక్ష్యాలు నిర్దేశించు కోవటంలోనూ, పరిసరాలను, పరిస్థితులను అనుకూలంగా మార్చుకొనటంలోనూ సౌకర్యవంతమైన విధానాల కల్పనలోనూ ‘పోరు తప్పనిసరిగా ఉంటుంది.

మనం నివసిస్తున్న సమాజం వైకుంఠపాళి లాంటిది. మెట్టుమెట్టు పైకెక్కే వేళ పొంచి ఉండే ‘డ్రాగన్స్‌ ఉంటాయి. ఆటలో ఐతే అక్కడ ఓ ‘డ్రాగన్‌ ఉందని గమనించవచ్చు గానీ జీవితంలో సాగే తీరు తెన్నులలో తెలీకుండా ఉంటాయి ఈ డ్రాగన్స్‌. వీటిని కొన్ని రకాలుగా మనం ఎంచుకోవచ్చు. సహజంగా మన శకియుక్తులు చాలక ఎదు రయ్యే అపజయాలు ఒకటి. మనలను అపజయాల పాలు చెయ్యాలనీ, పరోక్ష ప్రతిబంధకాలుగా నిలిచే శక్తులు మరికొన్ని. ఇది రెండవది. నిరుత్సాహపరుస్తూ, మన విజయాలను, ఉన్నతిని తూచి ఏడ్చే జాతులు మరికొన్ని. ఇది మూడవది.లోకోభిన్నరుచి అంటారు కదా. ఎవరి మనసులో ఏముందో, ఎవరి తత్వం ఎటువంటిదో గమనించుతూ సాగి పోయే ‘సమర్థత మనలో లేకపోతే పెనుపాముల నోట్లో పడవలసిందే.

మనం ఓటమి పాలైయ్యాక విరగబడి చాటున నవ్ఞ్వకునేవారూ, బహిరంగంగా విమర్శించే వారికీ కొదువే ఉండదు. అట్లని ఇతరుల విజయాలను జీర్ణించుకోలేరు. మనిషి విజ్ఞానం సంపాదించుకుంటూ సాంకేతిక విప్లవాలు సాధించుకుంటూ సృష్ఠికి ప్రతిసృష్ఠి గావించేంతటి మేథను పుణికి పుచ్చుకుంటున్నాడంటూ ఎలుగెత్తి ఘోషిస్తూ ఉంటాం. కానీ అసూయను, ద్వేషాన్ని, న్యూనతాభావాలను జయింపలేక తమదైన చీకటి ప్రపంచంలో బ్రతుకులీడుస్తుంటారు. సమాజం పరోక్షంగా చూపే ప్రతిబింబం ఇది. అట్లని మొత్తం సమాజం ఇలాగే ఉండదు. అతికొద్ది శాతం మాత్రమే ఇతరుల ఉన్నతిని, విజయాలను అభినందిస్తూ, ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇది సంస్కారవంతమైన తోడ్పాటు. ఈ తోడ్పాటు మృగ్యమై కలవరపరుస్తుందని మనచేష్టలుడిగితే క్రిందకు తోసివేస్తుంది నిర్దయగా ఉండే విధి. రంగులుపై పూతగా పూసుకున్న సమాజం.ఓటమి మనిషికి గుణపాఠాలను నేర్పుతుంది.

గెలుపుకై బాటను నిర్మించుకోవడంలో సాయపడుతుంది.దైర్యాన్ని, సంకల్పబలాన్ని చూస్తే ఓటమికే కాదు చెడు మనస్తత్వా లకు సైతం వెన్నులో చలి పుట్టేటట్లుగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం గుండెలనిండుగా తొణికిసలాడుతుంటే విరగబడి నవ్వే నవ్ఞ్వకు మంగళం పాడినట్లుగా ఔతుంది.

భయం, పిరికితనం అనుమానం ఇవన్నీ కూడా నిన్నటి డైరీ. తెగువ, తెగింపు, ధైర్యం చొరవ నేటి జంట పదాలుగా మన వెన్నంటి ఉండాలి. అంతేకాదు ఏ ‘ఓటమి అయినా తాత్కాలికమే. మనసును కృంగదీయ రాదు. అణిచేకొద్దీ పై కెగసే తత్వం పాదుకోవాలి.నవ్వేవాళ్లు, ఏడ్చేవాళ్లూ, వెటకరించేవాళ్లూ ఉండనీ. మనలక్ష్యం సుగమంగా మారి చేరుకొన్ననాడు విజయం కచ్చి తంగా మననే వరిస్తుంది.

– డి. ఉమాదేవి