గుమ్మడికాయ సూప్‌

GUMMADI
GUMMADI


కావలసిన పదార్థాలు
ఆలివ్‌ నూనె – 2 టేబుల్‌ స్పూన్లు ఉల్లిపాయలు – 2 గుమ్మడికాయ -1 కేజి
వెజిటబుల్‌ స్టాక్‌ లేదా చికెన్‌ స్టాక్‌ 2,3 కప్పులు డబుల్‌ క్రీమ్‌-1 ప్యాక్‌ క్రోటన్లు కోసం ఆలివ్‌ నూనె – 2 టేబుల్‌ స్పూన్లు బ్రెడ్‌ క్రస్ట్‌ తొలగించబడింది – 4 ముక్కలు గుమ్మడికాయ గింజలు – 1 ప్యాకెట్‌
రెడ్‌ రైస్‌ కందా పోహ్‌
తయారు చేయు విధానం
సాస్‌ పాన్‌ పొయ్యి మీద పెట్టి రెండు స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి 5 నిమిషాలు వేయించాలి. అయితే ఉల్లిపాయలు రంగు మారకూడదు. గుమ్మడికాయ లేదా స్క్వాష్‌ చేర్చి 8 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. మృదువుగా , గోల్డ్‌ కలర్‌ వచ్చే వరకు వేగించాలి. వెజిటబుల్‌ స్టాక్‌ లేదా చికెన్‌ స్టాక్‌ పోసి ఆ తరువాత ఉప్పు, మిరియాల పొడి కలపాలి. బాగా మరిగించాలి. స్క్వాష్‌ మృదువుగా అయ్యే వరకు సిమ్‌లో 10 నిమిషాలు ఉడికించాలి పాన్‌లో డబుల్‌ క్రీమ్‌ వేడిచేసి బ్లెండ్‌ చేయాలి. అదనపు వెల్వెట్‌ కోసం జల్లెడ ద్వారా సూప్‌ పోయవచ్చు. ఇప్పుడు సూప్‌ని రెండు నెలల వరకు ప్రోజెన్‌ చేయవచ్చు. క్రోటన్లు చేయడానికి బ్రెడ్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. ప్రైపాన్‌లో ఆలివ్‌ ఆయిల్‌ వేసి బ్రెడ్‌ ముక్కలు వేగించాలి. ఆ తరువాత గుమ్మడి కాయ గింజలను వేసి కొంచెం సేపు ప్రైచేయాలి. వీటని ఒకరోజు ముందుగా తయారుచేస్తారు కాబట్టి ఎయిర్‌టైట్‌ కంటైనర్లో నిలువ చేయాలి. రీహాట్‌ చేసినప్పుడు అవసరమైతే సూప్‌ రుచి కోసం, అందం కోసం క్రోటన్లు, గుమ్మడికాయ విత్తనాలను సూప్‌ మీద చల్లవచ్చు. స్క్వాష్‌ని తొలగించి, గింజలను లేత నుండి బాగా రోస్ట్‌ చేయాలి. చివర చీజ్‌ వేసి కరిగే వరకు ఉడికించాలి.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/