గర్భిణులు – మలేరియా -2

గర్భిణులు – మలేరియా -2

చికిత్స: గర్భిణులు మలేరియా వ్యాధికి గురైనప్పుడు, వ్యాధి లక్షణాల్ని జాగ్రత్తగా గమనించి వ్యాధి నిర్ధారణ చేయాలి. ఇది సిఫిలిస్‌, హెర్పిస్‌, రూబెల్లా, టాక్సోప్లాస్మోసిస్‌, టైటోమెగలో వైరస్‌ ఇన్ఫెక్షన్‌ కాదాని విబేధించిన తర్వాతనే అన్ని పరీక్షలు చేసి చికిత్స చేయాలి. 1. ముందుగా మలేరియాకి చికిత్స అందించాలి. 2. మలేరియా వల్ల కలిగే కాంప్లికేషన్స్‌ని అరికట్టాలి. 3. కాన్పు సక్రమంగా అయ్యేటట్లు చూడాలి. 4. తల్లిబిడ్డల్ని జాగ్రత్తగా సంరక్షించాలి. 5. మళ్లీ మలేరియా తిరగబెట్టకుండా డాక్టర్ల పర్యవేక్షణలో మందుల్ని వాడాలి. 6. మెటర్నల్‌ అనేమియా 38 శాతం వ్ఞంటుంది. దీన్ని పోషకాహారం, ఐరన్‌, ఫోలిక్‌ ఆసిడ్‌తోను, రక్తం ఎక్కించడం ద్వారా అరికట్టవచ్చు. 7. 43శాతం పిల్లల్లో ఏర్పడే కాంప్లికేషన్స్‌ని మలేరియాని సకాలంలో గుర్తించి మందుల్ని వాడడం ద్వారా తగ్గించవచ్చు. పెరినాటల్‌ మొర్టాలిటీని 27శాతం వరకు తగ్గించవచ్చు. 8. కాన్పు సమయంలో డీహైడ్రేషన్స్‌ వ్ఞంటే ఫ్లూయిడ్స్‌ ఎక్కించాలి. ఎక్కువగా ఫ్లూయిడ్స్‌ని ఎక్కించరాదు.9. రక్తం ఎక్కించేటప్పుడు రియాక్షన్స్‌ ఏర్పడకుండా చూడాలి. 10. కాన్పు సమయంలో నొప్పులు ఇరెగ్యులర్‌గా వస్తున్నా, ఫీటల్‌ గుండె వేగం, నాడీ వేగం ఎక్కువగా వ్ఞన్నా, మెటర్నల్‌, ఫిటల్‌ డిస్ట్రెస్‌ వ్ఞన్న డాక్టర్ల పర్యవేక్షణలో మందుల్ని జాగ్రత్తగా రోగి కండీషన్‌ని బట్టి వాడాలి. కాన్పు రెండవ దశని తగ్గించడానికి ఫోర్‌సెప్స్‌ డెలీవరీ, వాక్యుమ్‌ ఎక్స్‌ట్రాక్షన్‌, సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయాలి. కాన్పు మూడవదశలో ప్లాసెంటాని జాగ్రత్తగా వేరు చేయాలి. 11. తల్లిలో సెప్టిసెమిక్‌ షాక్‌ వస్తే దాన్ని ‘ఆల్‌జిడ్‌ మలేరియా అంటారు. 12. పల్మోనరీ ఎడిమా వ్ఞంటే తల్లి వెనక్కి వాలి విశ్రాంతి తీసుకోవాలి. ఆక్సిజన్‌ ధిరపీ, డయూరిటిక్స్‌ ఇవ్వాలి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్‌, న్యూమోనియా, యూరినరీ ఇన్ఫెక్షన్స్‌ ఎక్కువగా వచ్చే అవకాశముంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా ఆంటిబియాటిక్స్‌ వాడి చికిత్స అందించాలి.

ముందు జాగ్రత్తలు:

ఎ.బి.సి.డిలుగా ముందు జాగ్రత్తలు తీసుకుంటే గర్భధారణలో మలేరియాని సులభంగా అరికట్టవచ్చు. ఎ) అవేర్‌నెస్‌ ఆఫ్‌ రిస్క్‌ ఆఫ్‌ మలేరియా: మలేరియా ప్రబలే ప్రాంతాల్లో ముందుగా మలేరియా వ్యాధి గురించి అవగాహన కల్పించాలి. నెల తప్పినప్పటి నుంచి ఆంటినేటల్‌ చెకప్‌లు బాగా ఉండాలి. ప్రతినెల రక్తహీనత లేకుండా సరిదిద్దాలి.

మంచి పోషకాహారాన్ని తీసుకునేటట్లు చూడాలి. అవసరమైతే రక్తం ఎక్కించాలి. ఐరన్‌, ఫోలిక్‌ ఆసిడ్‌ మాత్రల్ని రెగ్యుగలర్‌గా వాడాల్సి వ్ఞంటుంది. బి: బైట్స్‌ దోమలు కుట్టకుండా చూసుకోవడం: దోమలు డార్క్‌ కలర్స్‌ని బాగా ఆకర్షిస్తాయి. కాబట్టి తేలికపాటి లేత వర్ణం గల దుస్తుల్ని ధరించాలి. కాళ్లు చేతులు ఫుల్‌గా కవర్‌ చేయాలి. ఎసిలో, చల్లటి ప్రదేశంలో దోమలుండవ్ఞ. కాబట్టి ఫ్యాన్స్‌, ఎసి వేసుకోవడం మంచిది. దోమతెరలు, కాయిల్స్‌, మస్కిటో రిఫెల్లర్స్‌ వాడాలి. సాయంత్రం చీకటి పడకముందే కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. మురికి కాలువలో మలాధియన్‌ స్ప్రే, కిరోసిన్‌ పోయాలి. దీనివల్ల దోమల లార్వాలు వృద్ధి చెందవ్ఞ. నీరు నిల్వకుండా చూడాలి. నీటి తొట్టెలు, నీళ్ల బకెట్స్‌, నీటిసంపులో ఎక్కువ దోమలు నీరు నిల్వవ్ఞండకుండా చూడాలి. గ్రామీణ ప్రాంతాల్లో వేపాకులు, కానుక ఆకుల ధూపం వేయడం మంచిది. గాలి, వెలుతురు ఇంట్లో బాగా ఉండాలి. ఇల్లు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో, వీధుల్లో చెత్తచెదారం నిల్వ వ్ఞండకుండా శుభ్రం చేయాలి.

సి.కోమ్‌ఫ్రోఫైలాక్సిస్‌: మలేరియాకు క్లోరోక్విన్‌ అనే ఆంటి మలేరియా డ్రగ్స్‌ వాడుతారు. కామాక్విన్‌, మెఫ్లోక్విన్‌, సల్ఫోడాక్సిన్‌, ఫైరిమిధామైన్‌ (ఫ్రైమాక్విన్‌ వంటి అనేక బ్రాండెడ్‌ పేర్లతో ఈ మందులు దొరుకుతాయి. క్లోరోక్విన్‌ 600 గ్రా. 6గంటల కొకసారి రెండు టాబ్లెట్స్‌ చొప్పున రెండు రోజులు వేసుకొని రెండు రోజులు ఒక టాబ్లెట్‌ చొప్పున వాడాలి. మొత్తం 10 టాబ్లెట్స్‌ కోర్స్‌ వాడాల్సి వ్ఞంటుంది. డాక్టర్లు కేస్‌ని బట్టి వాటి డొసేజ్‌ వేరువేరుగా వ్ఞంటుంది. మొదటి రోజు సింగిల్‌ డోస్‌ కింద 4 టాబ్లెట్స్‌ను ఒకేసారి వేసుకోమంటారు. ఆరు గంటల తర్వాత మరో రెండు టాబ్లెలను వేసుకోవాలి. తర్వాత 3 రోజులూ ఉదయాన ఒక టాబ్లెట్‌, సాయంత్రం ఒక టాబ్లెట్‌ వేసుకోవాలి. మొత్తం 12 టాబ్లెట్స్‌తో కోర్స్‌ పూర్తవ్ఞతుంది. గర్భధారణ 3 నెలలలోపల మలేరియా జ్వరం వస్తే వీటిని వాడితే అబార్షన్‌ అయ్యే ప్రమాదముంది. కాబట్టి గర్భిణులు మలేరియా జ్వరం వస్తే మూడోనెల దాటాక మాత్రమే డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడాల్సి వ్ఞంటుంది. అలాగే ప్రైమాక్విన్‌ టాబ్లెట్స్‌ని గర్భ´ధారణ సమయంలో అసలు వాడనేకూడదు. ఈ మందుల్ని ఖాళీకడుపుతో వేసుకోకుండా, తిన్న తర్వాతనే వేసుకోవాలి. ఈ మందుల వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. వికారం, నోట్ల నీళ్లూరడం, వాంతులు, తలనొప్పి, చెవ్ఞల్లో హోరు. కళ్లు తిరగడం,ఆకలి మందగించడం, నీరసం వంటి లక్షణాలుంటాయి. డి. డయాగ్నోసిస్‌ (వ్యాధి నిర్ధారణ) కాంప్లికేషన్స్‌ రాకుండా నివారించడం: గర్భిధారణలో మామూలు జ్వరమయితే పారాసిటమాల్‌ టాబ్లెట్స్‌తో తగ్గిపోతుంది. మలేరియా జ్వరాన్ని రక్తపరీక్షల ద్వారా నిర్ధారించిన తర్వాతనే డాక్టర్ల పర్యవేక్షణలో సరైన చికిత్స అందించాలి. మొదటిది వెంటనే చలిజ్వరాన్ని తగ్గించాలి. రెండవది చలి జ్వరం రాకుండా చూడాలి. క్లోరోక్విన్‌ మూలంగా రక్త ప్రవాహంలోని మలేరియా క్రిములు నశిస్తాయి.

కాని కాలేయంలో వ్ఞండే క్రిములు మాత్రం అలాగే కొంతకాలం వ్ఞంటాయి. కొంత కాలం తర్వాత ఇవి మళ్లీ రక్త ప్రవాహంలోకి ప్రవేశించి మళ్లీ మలేరియా జ్వరాన్ని కల్గించే అవకాశముంది. అందువల్ల కోర్సు పూర్తయ్యాక కూడా వారానికి రెండు టాబ్లెట్స్‌ చొప్పున కొన్ని వారాల పాటు మందులు కేసుని బట్టి (మలేరియా ప్రాంతాల్లో) వాడాల్సి వ్ఞంటుంది. అప్పటికిగాని కాలేయంలోని ప్లాస్మోడియం క్రిములు నశించవ్ఞ. గర్భిణీలో కొందరిలో హార్మోన్స్‌, ఇమ్యూనోలాజికల్‌, హీమటోలాజికల్‌ (రక్తం)గా అనేక మార్పులు వ్ఞంటాయి. మందుల సైడ్‌ ఎఫెక్ట్‌ వల్ల, మందులు సరిగా వాడలేకపోవడం వల్ల, కాంప్లికేషన్స్‌ వల్ల 13శాతం మందిలో ట్రీట్‌మెంట్‌ కష్టమవ్ఞతుంది. గర్భధారణలో మలేరియా జ్వరమా కాదా అని సకాలంలో గమనించి సరైన చికిత్స తీసుకోవాలి. కాంప్లికేషన్స్‌ రాకుండా జాగ్రత్త పడితే తల్లి బిడ్డల సంరక్షణ వీలవ్ఞతుంది.

గర్భిణులకు జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకండా వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి రక్తపరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాతనే డాక్టర్ల పర్యవేక్షణలో మందుల్ని జాగ్రత్తగా వాడాల్సి వ్ఞంటుంది. బాలింత తల్లిపాలు బిడ్డకు ఇవ్వవచ్చు. తల్లి అనారోగ్యం, ఇతర కాంపికేషన్స్‌ బట్టి కొన్నిసార్లు తల్లి కోలుకునేంత వరకు తల్లిపాలు బిడ్డకు ఇవ్వకూడదు. గర్భిణులు మలేరియా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలాచాలా మంచిది. హోమియోపతిలో రోగి, రోగ లక్షణాల్ని బట్టి వైద్యపర్యవేక్షణలో మందులు వాడవచ్చు.

– డా. కె. ఉమాదేవి, తిరుపతి