గమ్యాన్ని చేర్చేవి అనుకూల సంకేతాలే

Destination additives positive signs
ఎపుడైనా మనం ఏమి అనుకుంటామో అదే జరిగి తీరుతుంది. మనం సానుకూలంగా మంచి జరగాలని ఆశిస్తే మంచే జరుగుంది. కానీ ఎక్కువ మంది ప్రతికూలంగా ఆలోచించడం, వక్రంగా వ్యవహరించడం వల్ల ఫలితాలు కూడా వ్యతిరేకంగానే వస్తాయి. దీన్ని మన ఖర్మ, దుర దృష్టంగా లెక్కగట్టి దులిపేసుకుంటారు.

కానీ అనేక అధ్యయనాల్లో తేలిందేమంటే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ముందు నుంచే మన మనసుకు పాజిటివ్‌ సంకేతాలను అందించాలి. అనుక్షణం ఇలాంటి సంకేతాలు మేదడుకు చేరుతూ ఉండాలి. శరీరంలోని అన్ని అవయవాలూ పాజిటివ్‌గానే స్పందించేలా తయారవ్వాలి. అపుడు అనుకున్న లక్ష్యం చేరువకావడం అనేది అసాధ్యం కాదు. అయితే అనుకు న్నంత తేలికైన వ్యవహారం కాదు…పాజిటివ్‌గా ఆలోచించడం. ఎంతో క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ది ఉంటే తప్ప పాజిటివ్‌గా ఆలోచిచడం కుదరదు.

మనిషి జీవితంలో కీకలమైంది, కష్టతరమైంది, అత్యంత ప్రధానమైంది యుక్తవయస్సు. దీన్ని సక్రమంగా, సరైనదిశలో ప్రణాళికా బద్దంగా మల చుకొని వ్యవహరిస్తే అనుకున్న లక్ష్యాలు ముంగిట వచ్చి వాలతాయి. ఇలా చేసిన వారే అన్ని పోటీ పరీక్షల్లో టాపర్స్‌గా నిలుస్తున్నారు. జీవితంలో కూడా టాప్‌ పొజిషన్‌లో ఉంటారు. కానీ ఇపుడున్న పరిస్థితులు అందుకు సహకరించడం లేదు. పెరుగుతోన్న పోటీ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందివచ్చిన అవకాశాలు పక్కదారి పట్టేలా చేస్తున్నాయి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం మన మీద పడటంతో అన్నింటా అరాచకమే రాజ్యం ఏలుతోంది. దీన్ని అధిగమించాలన్నా, అనుకున్నది సాధించాలన్నా ప్రతి వ్యక్తీ స్వీయ క్రమశిక్షణ అవశ్యం.

సానుకూల దృక్పథం ఎంతో ముఖ్యం. జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న వారిని ఎవరినైనా పరిశీలించండి వారంతా ఆశా వాదులు గానే ఉంటారు. పాజిటివ్‌గా ఆలోచించిన వారై ఉంటారు. ఆశావాదం లేకపోతే జీవితం లేదు.

భవిష్యత్‌పై భరోసాతో ప్రతిఅడుగు ముందుకు వేయాలి. ప్రతి క్షణాన్ని నిరాశా, నిసృహలకు లోనుచేసుకుంటూ విలువైన కాలాన్ని ఖర్చు చేస్తే మిగిలేది ఏమీ ఉండదు. అందుకే ఆశావాదంతో క్షణ క్షణాన్ని గడపాలి. ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోవడానికి సంసిద్దులవ్వాలి. పాజిటివ్‌గా ఆలో చిస్తే ఏమి జరుగుతుంది? ఆలోచించినంత మాత్రాన అనుకున్నది  ఎలా సాధ్యం అవుతుంది? కేవలం అనుకుంటేనే అయిపోతే ఇంట్లో కూర్చొని అదే పనిగా గొనుక్కుంటూ ఉండవచ్చు కదా? ఇలాంటివే ఎన్నో ప్రశ్నలు, సందేహాలు వస్తాయి. అయితే శాస్త్రీయంగా ఆలో చించాలి. తర్కంగా అనుసరించాలి. గాలిలో దీపంపెట్టి దేవుడా రక్షించు అంటే సాధ్యం అవుతుందా? అలాగే మొక్కుబడిగా పెద వులు కదలిస్తూ, అసాధ్య మైన కోర్కెల్ని సైతం తీర్చమని కోరు కుంటే తీరతాయా? కానేకావు. దేనికైనా ఒక విధానం ఉంటుంది. ఫార్ములా ఉంటుంటి. అసలు మీరేమి కావాలనుకుంటు న్నారు? దాన్ని ఎలా సాధించాలనుకుంటున్నారు? దీనికోసం మీరు ఎలా వ్యవహరించాలని ఆశిస్తున్నారు? వీటన్నింటికీ మీదగ్గర సమాధానం ఉంటే మీరు సరైన మార్గంలో వెళ్లగలుగుతారు. అందుకే యోగులు, రుషులు సైతం చేతిలో కమండలం, రుద్రాక్షలు, జపమాలను సైతం పట్టుకొని తదేకదీక్షతో, ఏకాగ్రతతో ఎందుకు వ్యవహరి స్తారు? వారు అనుకున్నది సాధించడం కోసమే. అనుకున్న లక్ష్యానికి చేరువ కావడంలో అనేక అవాంతరాలు కొన్ని సందర్భాల్లో వచ్చి చేరే ప్రమాదం కూడా ఉంటుంది. గులాబీ పువ్వుకు కూడా ముల్లుంటుంది. ముల్లు కుచ్చుకుంటుందని భయపడితే అందమైన గులాబీ సొంతం కాదు. అలాగే విజయం కూడా. సానుకూలంగా వ్యవహరించాలి. ఆలోచనలు ఎపుడూ ఉన్నత స్థాయిలోనే ఉండాలి. సాధించే క్రమాన్ని ప్రణాళికాబద్దం చేసుకొని ముందుకు వెళ్లాలి. జరిగేవన్నీ మంచికే అన్న దృఢచిత్తాన్ని అలవర్చుకోవాలి. పరిస్థి తుల్ని అనుకూలంగా మలచుకోవాలి. ఉన్న పరిచయాలను తోడుగా ఉంచుకోవాలి. అవకాశాలు వచ్చినపుడు ఉపయో గించుకునే వారు సాధారణ విజయాన్ని మాత్రమే పొందుతారు.