కూరగాయలతో క్యాన్సర్‌ దూరం

Vegetables
– కూరగాయలు, పండ్లు పచ్చిగా తీసుకుంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. వండకుండా తినలేని పదార్థాలయితే చాలా కొద్దిగా నీటిని చేర్చి ఆవిరిమీద ఉడికించి తింటే వాటిలోని పోషకాలు నష్టపోకుండా ఉంటాయి.
– పండ్లు, కూరగాయల్లోని పోషకాలు ఎక్కువగా తొక్కకింది భాగంలోనే అధికమొత్తాలో ఉంటాయి. అందుకే వీలయినంతవరకు తొక్కతీయకుండా వాడడానికే  ప్రాధాన్యతనివ్వండి.
యాంటీఆక్సిడెంట్లయిన విటమిన్‌ సి, ఇ, సెలీనియం మినరల్‌తో కలిపి ఫైటోన్యూట్రియట్లను తీసుకుంటే అధిక శక్తివంతంగా ఉంటాయి.
– పసుపు, కాషాయం, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, వంకాయరంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల్లో ఈ ఫైటోన్యూట్రియంట్లు అధికంగా ఉంటాయి.
-ఒక్క కమలాపండులోనే దాని తొక్క, నూనె, గుజ్జు, రసం, తోలులో కలిపి  170 ఫైటోన్యూట్రియంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి.
– రోజుకు ఐదారురకాల కూరగాయలు, పండ్లు తీసుకునేవారు, ఒకటిరెండు రకాల పండ్లు, కూరగాయలు తీసుకునేవారితో పోల్చితే క్యాన్సర్‌ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఒక సర్వేలో తేలింది.