కురులే ఆకర్షణ!

LADY111
Beautiful Hair

కురులే ఆకర్షణ!

గాలికి ఎగిరే అందమైన, ఒత్తయిన జుట్టు మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. అలాంటి శిరోజాలు తమకు కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటోంది. మనసులో కోరిక ఉంటేనే కాదు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అటువంటి శిరోజాలు మీసొంతం కావచ్చు. మరి శిరోజాల సౌందర్యం పెంచే రహస్యాలేమిటో తెలుసుకుందామా!

మీ జుట్టుకు సరిపడే తగిన షాంపూనే వాడండి. సరైన షాంపూ కురులకు, తల చర్మానికి సంరక్షణ అందిస్తుంది.

చిక్కుబడిన, నిర్జీవంగా కన్పించే జుట్టులో మెరుపు తేవడానికి హెయిర్‌ సీరమ్‌ ఉపయోగించండి.

తరచుగా వెంట్రుకలను ట్రిమ్మింగ్‌ చేయించండి.

జుట్టు ఒత్తుగా కన్పించడానికి మూస్‌ వాడండి, మార్కెట్లో చాలా రకాల మూస్‌లు లభ్యమవ్ఞతున్నాయి.

వెంట్రుకలను స్ట్రయిట్‌ చేయడానికి స్ట్రయిటినింగ్‌ మెషీన్‌ వాడొచ్చు.

హెయిర్‌ కలర్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు మీ స్కిన్‌ టోన్‌ను నిశితంగా పరిశీలించండి. దానికి అనుగుణమైన కలర్‌నే వాడండి. లేదంటే హెయిర్‌ కలర్‌ వికారంగా కనబడుతుంది. బ్రాండెడ్‌ కంపెనీల కలర్‌నే వాడండి.

పొడిజుట్టు నిగారింపు పెంచడానికి వెంట్రుకల మూలాల్లో ఒక అంగుళం విడిచి ఆ తర్వాత హెయిర్‌ కండిషనింగ్‌ చేయండి.

వెంట్రుకల్లో అప్పటికప్పుడు రంగు కావాలంటే షాంపూలో కాఫీ పౌడర్‌ కలిపి పెట్టాలి. 3-4 సార్లు షాంపూ చేసిన తర్వాత కూడా ఆ రంగు నిలిచి ఉంటుంది.

పచ్చి ఉసిరిని రుబ్బి జుట్టు కుదుళ్లకు పట్టించండి. 45 నిమిషాల తర్వాత కడగండి. వెంట్రుకల్లో నేచురల్‌ షైనింగ్‌ వస్తుంది.

వెంట్రుకల్లో చుండ్రు పెరిగితే షాంపూ వాడిన తర్వాత బాగా నీటితో శుభ్రపరచండి. ఆపై ఒక మగ్గు నీళ్లలో వెనిగర్‌ వేసి జుట్టుపై పోయండి.