కుట్టుపనిలో కిటుకులెన్నో..

కుట్టుపనిలో కిటుకులెన్నో..

కుట్టడం నేర్చుకోవాలనుకునేవారికి కొన్ని మెలకువలు అవసరం. భుజానికి తిన్నగా వేసుకున్న డాట్‌లావుగా పొట్టిగా ఉండి పొడవు 2 అంగుళాలు ఉంటే చాలు. ఫ్రంట్‌ ఓపెన్‌ల దగ్గర కూడా 2 అంగుళాలపై వరకు కుడితే సరిపోతుంది. డాట్లు కుట్టేటప్పుడు క్రాస్‌గా కుట్టాలని మరచిపోకండి. డాట్లు వేసిని తరువాత షేపు ముక్కలు తీసుకొని షేపు తీసిన వైపు రైటున ఒక ముక్కపెట్టి రాంగ్‌న ఒక ముక్క పెట్టి దాని మీద దళసరి ముక్కపెట్టి ఈ మూడు ముక్కల్ని చెస్ట్‌కి అతుక్కోవాలి.

అలా అతికేటప్పుడు డాటుని ప్రక్కకు మడిచి దానిమీద కుట్టుపడకుండా అతుక్కుంటే షేప్‌ బాగుంటుంది. తరువాత షేప్‌ ముక్కల్ని సమానంగా ఉన్నవైపు అతికి, రైటుకి త్రిప్పి, పైన కుట్టు వేయాలి. పైన కుట్టు ఇష్టంలేనివారు లోపలే కుట్లు వేసుకోవాలి. అలా రెండు పక్కలా కుట్టాక పెంపె, మడుపు వేసి, ఈ షేప్‌ ముక్కల్ని వెనుక భాగం మడుపు మీద పెట్టి, భుజాలు అతకాలి. తరువాత మెడ ముక్క అతికి మడిచి పెట్టి చేతికుట్లు వేసుకోవాలి. తరువాత భుజాలు చేతులు అతికి, చేతి చివర ఒక అంగుళం వెడల్పు మడత పెట్టి, చెయ్యి రాంక్‌కు తిప్పి, చేతి చివర రఫ్‌ తీసి, సైడ్స్‌ అతకాలి. సైడ్స్‌ అతికేటపుడు వెనకాల మనము పెట్టుకున్న మడతని రాంగ్‌న పైకి మడిచి కుట్టుకోవాలి. తరువాత నడుము దగ్గర భుజాలకి తిన్నగా రెండు ప్రక్కలా 1/2 అంగుళాల లూజు 3 1/2 పొడవు చొప్పున రెండు డాట్లు వేయాలి.

మనకి పట్టినట్లుగా ఉండటానికి చేతులు, సైడ్స్‌ కూడా కుట్లు వేసుకోవాలి. చేతులు అతికేటప్పుడు చంక దగ్గర హెచ్చు తగ్గులు ఉంటే సరిచేసి చేతులు అతకాలి. ముందుగా పరికిణీ గుడ్డను తీసుకొని బోర్డర్‌ ఉన్నడయితే అడ్డంగాను, బోర్డర్‌ లేనిదయితే నిలువుగాను మడతలు వేసుకోవాలి. బోర్డర్‌ ఉన్నదైనా రెండు ముక్కలు చేసుకొని దాన్ని మళ్ళీ అతుక్కొని పరికిణీ కుట్టుకుంటే బాగుంటుంది. ఉదాహరణకి పరికిణీ గుడ్డ 3 మీటర్లు ఉందను కోండి. దాన్ని రెండు ముక్కలు చేసి అతికిన తర్వాత కొనలు రెండూ సమానంగా పట్టుకొని మధ్యగా పైన చిన్న కటింగ్‌ చేసుకోవాలి. తర్వాత దాన్ని మళ్ళీ అడ్డంగానే నాలుగు మడతలు వేసి అక్కడా కూడా పైన చిన్నకటింగ్‌ చేసుకోవాలి.

ఇప్పుడు మనం కటింగ్‌ చేసినవి మూడు చోట్ల వస్తాయి. మనకు కావలసిన పొడవు మడతలతో సహా పెట్టుకోవాలి. ఇప్పుడు కుట్టడం నేర్చుకుందాం…. ముందుగా మనము నడుము కొలుచుకోవాలి. అలా కొలుచుకున్న నడుము ఉదాహరణకి 30 అంగుళాలు ఉందనుకోండి. దాన్ని 4తో భాగించాలి. ముందుగా ముందు ఓపెన్‌లు, రెండు వైపులా నాలుగు అంగుళాల పొడవున పైనించి క్రిందకు సన్నగా రెండు మడతలు వేసి కుట్టుకొని తర్వాత రైట్‌నుంచి కుచ్చులు పెడుతూ కుచ్చు వెడల్పు 1 1/2 అంగుళాలు ఉండవచ్చు.

ఇష్టమైన వారు 2 అంగుళాలు కూడా కుచ్చు వెడల్పు పెట్టుకోవచ్చును. అన్ని కుచ్చిళ్ళు సమానంగా ఉండాలి. మనం కొలుచుకున్న నడుము 30ని 4తో భాగిస్తే 7 1/2 అంగుళాలు జవాబు వస్తుంది కదా! మనం కటింగ్స్‌ పెట్టుకున్న మధ్యలో 7 1/2 అంగుళాలు రావాలి. అలా నడుము కుట్టుకున్న తర్వాత పెట్టుకొన్న కుచ్చుల మీద మడత చివర నుంచి సుమారు 4 లేక 4 1/2 అంగుళాల పొడవునా నిలువునా కుట్లు వేసుకొని, చివర రఫ్‌ తియాలి. నిలువు కుట్లు ఎలా వేసుకోవాలో తెలుస్తుంఇ. తరువాత సైడ్‌ క్రింద నుండి రఫ్‌ తీసి మొదలు పెట్టిన పైన మనం కుట్టుకొన్న ఓపెన్‌ల వరకు కుట్టి, రఫ్‌ తీయాలి. పరికిణీ చివర సన్నగా ఒక అంగుళం మడత పెట్టి కుట్టుకోవడం కాని లేక ఫాల్‌ కుట్టడం కాని చేయవచ్చు. తర్వాత నడుముకు బెల్టు పెట్టుకోవాలి. ష్కర్ట్‌: దీనికి ముందుగా నడుము చుట్టు కొలతలు తీసుకోవాలి.

దానికి 1 అంగుళం ఎక్కువ పొడవుతో 3 అంగుళాలు వెడల్పుతో నడుముకు పట్టీ కట్‌ చేసుకోవాలి. తర్వాత నడుము నుంచి మోకాలి క్రింద వరకు కొలత తీసుకొని దానికి రెండు అంగుళాలు ఎక్కువతో స్కర్ట్‌ పొడవును తీసుకోవాలి. నడుము దగ్గర పెట్టే కుచ్చిళ్ళ కొరకూ ఇంచుమించు నడుము చుట్టుకొలత కంటే 2 రెట్లు ఎక్కువ క్లాత్‌ ఎక్కువ తీసుకోవాలి. ఈ కుచ్చులు మందు భాగానికి వెనుక భాగానికి సమానంగా రావాలి. ముందు ఈ కుచ్చులు పెట్టికుట్టేట ప్పుడు నడుము పట్టీ ముక్కలు సగానికి గుర్తు పెట్టుకోవాలి. ముందుగానే నడుము చుట్టుకొలతకు సరిపోయేలా స్కర్ట్‌కు వెడల్పు కుచ్చిళ్ళు పెట్టా లి. కుచ్చిళ్ళ ముందు భాగానికి వెనుక భాగానికి సమానంగా వచ్చేలా కుట్టుకోవాలి.

తర్వాత నడుము పట్టీ ముక్కను రెండు వైపులా సన్న గా మడిచిపెట్టి కుట్టుకోవాలి. స్కర్ట్‌ భాగానికి నడుము దగ్గర రెండు వైపులా 2 అంగుళాల పొడవుతో సన్నగా లోపలకు మడిచి కుట్టు కోవాలి. ఓపెన్‌ కొరకు చివరగా ఓపెన్‌ క్రింద భాగాన్ని వదిలిపెట్టి అక్కడ నుంచి క్రింద వరకు జాయింట్‌ చేయాలి. క్రింద 2 అంగు ళాల వెడల్పున లోపలికి మడిచి కుట్టాలి. ఈ కుచ్చులు పెట్టే గుడ్డను ఒకే ముక్క కాకుండా రెండు సమానమైన ముక్కలుగా కట్‌ చేసి ఉం చుకుంటే కుట్టేటప్పుడు సులభంగా ఉంటుంది. ఈ డ్రెస్‌ను కాన్వెంట్‌ డ్రెస్‌గా కూడా ఉపయోగించవచ్చు. పైన బాడీ కుట్టుకోవచ్చు. లేకపోతే దాని మీద పుల్‌ జాకెట్టు వేసుకోవచ్చు.