కాస్మొటిక్స్‌తో ఇబ్బందులు

MAKEUP-1
Cosmotics

కాస్మొటిక్స్‌తో ఇబ్బందులు

కొన్ని రకాల సౌందర్యసాధనాలు వాడినపుడు శరీరం దురదపుట్టడం, దద్దుర్లు రావటం, చికాకును కలిగించడం లాంటివి ఉంటాయి. వీటికి కారణం ఆయా ఉత్పత్తుల్లో మీ శరీరానికి పడనివేవో ఉండటమే. సౌందర్య ఉత్పత్తుల్లో వాడే కొన్ని రకాల మూలకాల వల్ల కూడా ఈ దురద, మంట రావచ్చు. అలాంటి కారణాలు కొన్నింటిపట్ల అవగాహన ఉంటే మంచిది

అల్యూమినియం ఆక్సైడు క్రిస్టళ్లు, వాల్‌నట్‌ పొట్టు, లేదా ప్యుమైస్‌ కలిగి, కొంత గట్టిగా ఉండే స్క్రబ్బులను వాడడం.

ఆల్కహాలు, మెంథాల్‌ మూలకాలతో కూడిన టోనర్లు గల ఆస్ట్రింజెంట్ల వాడకం వల్ల.

స్నానానికి బాగా చల్లని, లేదా బాగా వేడిగా ఉన్న నీటిని ఉపయోగించడం. ్య అందానికి మెరుగులు దిద్దుకునే పద్ధతులు, ఉదా: చర్మరంధ్రాలు తెరుచుకుని మట్టి, దుమ్ము చేరకుండా చేయడానికి వాడే స్టీమింగ్‌లాంటి పద్ధతుల వల్ల కూడా శరీరం దురద, మంట పుడుతుంది.

గాఢమైన వాసనలుగల ఎస్సెన్షియల్‌ నూనెలు, పాలీసినికల్‌ ఆల్కహాల్‌ లాంటి దురద పుట్టించే మూలకాలు కలిగిన ఫేషియల్‌ మాస్కులు వేసుకోవడం వల్ల.

గాఢవాసనలు కలిగిన సబ్బులు, పరిమళాలు వెదజల్లే టోనర్లు శరీరాన్ని పొడిగా మారుస్తూనే దురదను, అలర్జీని కలిగిస్తాయి.

దురద పుట్టించే కారకాలకు వ్యతిరేకంగా పనిచేసే కాంఫర్‌, మెంథాల్‌, పుదీనా, ఆల్కహాల్‌, ఫినాల్‌ లాంటి మూలకాలు ప్రతి సౌందర్య ఉత్పత్తులలోనూ ఉంటాయి. వీలైతే ఈ మూలకాలు ఉన్నాయో లేదో తెలుసుకున్న తరువాతే ఆయా ఉత్పత్తులను కొనడం మంచిది.